కేతిక శర్మ అందాల జాతర.. చీరకట్టులో మైమరిపిస్తోన్న ముద్దుగుమ్మ

చిత్ర పరిశ్రమ విచిత్రమైనది. ఇక్కడ స్థిరపడాలంటే గుమ్మడికాయంత టాలెంట్‌తో పాటు అవగింజంత అదృష్టం కూడా ఉండాలని పెద్దలు అంటూ ఉంటారు. అందం, అభినయం ఉన్న ఎంతో మంది అడ్రస్‌లు గల్లంతు కాగా.. చూడటానికి ఏమాత్రం బాగోని వారు .. అంతంత మాత్రం నటనతో నెట్టుకొచ్చేవారు స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తుంటారు. ఈ లాజిక్ ఏంటో అర్ధం కాక బుర్రగొక్కుంటూ ఉంటారు. ఈ కోవలోకే వస్తారు హీరోయిన్ కేతికా శర్మ. అందం, అభినయంతో పాటు మంచి ఫిజిక్ ఈ ముద్దుగుమ్మ సొంతం కానీ. ఎందుకో తర్వాత అవకాశాలు రాలేదు.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ హీరోగా డెబ్యూ మూవీ రొమాంటిక్‌ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కేతికా శర్మ లుక్స్ పరంగా గుడ్ అనిపించుకుంది. ఆ సినిమాలో రొమాంటిక్ సీన్స్‌లో ఏమాత్రం ఒళ్లు దాచుకోకుండా నటించింది. ఆ వెంటనే నాగశౌర్య హీరోగా తెరకెక్కిన లక్ష్యలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన రంగ రంగ వైభవంగా సినిమాలో నటన, అందంతో మెస్మరైజ్ చేసింది . ఆ మూవీ వచ్చిన కొద్దిరోజులకే ఏకంగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్- సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన బ్రో మూవీలోనూ నటించింది. ఈ వరుస ఆఫర్లతో కేతికా శర్మ రేంజ్ మారిపోతుందని, టాలీవుడ్ స్టార్స్ హీరోయిన్‌గా మారుతుందని భావించారు. కట్ చేస్తే బ్రో తర్వాత ఈ ముద్దుగుమ్మ మళ్లీ కనిపించలేదు.

actress ketika sharma mesmerizing in saree

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే కేతికా శర్మ.. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ కాలం గడుపుతోంది. నిజానికి సినిమాల్లోకి రాకముందు కేతిక మోడలింగ్‌లో రాణించింది. అలాగే సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లూయన్సర్‌గానూ ఫేమస్. డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన నటీనటులు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. కేతికను కూడా తల్లిదండ్రులు వైద్యురాలిగా చూడాలనుకున్నారు. ఎందుకంటే అమ్మానాన్నలు ఇద్దరూ డాక్టర్లు కావడం చేత.

కానీ విధి ఆమెను సినీ రంగం వైపు నడిపించింది. సినీ పరిశ్రమలో అవకాశాలు రాకపోవడంపై మొన్నా మధ్య కేతిక శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. .నా సినిమా బాగా ఆడాలి.. మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటానని, ఇందుకోసం మనసుపెట్టి పనిచేస్తానని ఆమె వెల్లడించారు. కానీ ప్రయత్నం మాత్రమే మనచేతుల్లో ఉంటుందని, ఫలితం ప్రజల చేతుల్లో ఉంటుందని కేతిక అన్నారు. అందుకే తన చేతుల్లో లేని దాని గురించి ఎక్కువగా ఆలోచించనని ఆమె పేర్కొంది.

చిన్నతనం నుంచే యాక్టింగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఎప్పటికైనా సినిమాల్లో అడుగుపెట్టాలని కలలు కన్నానని కేతిక చెప్పారు. రంగరంగ వైభవంగా సినిమాలో డాక్టర్‌గా నటించి.. నన్ను వైద్యురాలిగా చూడాలనుకున్న అమ్మానాన్నల కలను నెరవేర్చానని తెలిపారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సుల్లో రచ్చ చేసే కేతిక చీరకట్టులో కనువిందు చేస్తున్నారు. పుస్తకం చదువుతూ, కొప్పు ముడేస్తూ పరువాల విందు ఇస్తున్నారు. ఇంకేందుకు ఆలస్యం ఆ ఫోటోలు మీరు కూడా చూసేయండి.

More from Filmibeat

Read more about: ketika sharma movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X