ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న కేతిక శర్మ హాట్ వీడియో: ముద్దులు పెట్టి.. ఎదపై హత్తుకుని!

సినిమాలు హిట్ కాకుంటే ఎలాంటి హీరోయిన్ అయినా కెరీర్‌ను ముగించాల్సిన పరిస్థితులు ఉంటాయి. కానీ, టాలీవుడ్‌లోని కొందరు భామలు మాత్రం ఫలితాలతో సంబంధం లేకుండా ఆఫర్లను దక్కించుకుంటోన్నారు. అందులో కేతిక శర్మ ఒకరు. పూరీ జగన్నాథ్ కాంపౌండ్ హీరోయిన్‌గా వచ్చిన ఈ బ్యూటీ.. అందం, అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసేసింది. ఫలితంగా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ ఉత్సాహంతోనే సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హడావిడి చేసేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కేతిక ఓ వీడియో వదిలింది. అది మీరే చూడండి!

ఒక్క వీడియో మార్చేసిందిగా

ఒక్క వీడియో మార్చేసిందిగా

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే కేతిక శర్మ మోడల్‌గా యమా సందడి చేసింది. ఆ రంగంలో అందచందాలతో ఆకట్టుకున్న ఈ భామ.. చాలా బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. ఆ తర్వాత 2016లో 'థగ్ లవ్' అనే యూట్యూబ్ వీడియోలో నటించింది. దీనికి భారీ రెస్పాన్స్ రావడంతో ఆమెకు నేషనల్ రేంజ్‌లో పాపులారిటీ లభించి ఆఫర్లు వెల్లువెత్తాయి.

రొమాంటిక్ ఎంట్రీతో ఫేమస్

రొమాంటిక్ ఎంట్రీతో ఫేమస్

ఇంటర్నెట్‌లో సంచలనంగా మారిన కేతిక శర్మకు ఎన్నో షోలు, సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ భామ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ హీరోగా నటించిన 'రొమాంటిక్' మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయింది. అయితే, ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ, కేతికకు మాత్రం మంచి గుర్తింపుతో పాటు ఫాలోయింగ్ కూడా పెరిగింది.

ఫలితాలతో పని లేకుండానే

ఫలితాలతో పని లేకుండానే

టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ దక్కకపోయినా కేతిక శర్మకు టాలీవుడ్‌లో అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే తన రెండో చిత్రంగా ఈమె నాగశౌర్య హీరోగా నటించిన 'లక్ష్య'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఇది కూడా హిట్ అవలేదు. ఇక, ఇటీవలే కేతిక శర్మ.. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'రంగరంగ వైభవంగా' మూవీలోనూ చేసినా.. ఇది నిరాశనే మిగిల్చింది.

ఇక్కడా.. అక్కడా అవకాశాలే

ఇక్కడా.. అక్కడా అవకాశాలే

తెలుగులో కేతిక శర్మ నటించిన సినిమాలన్నీ పెద్దగా సక్సెస్ కాలేదు. పైగా ఇవన్నీ ఆమెకు నిరాశనే మిగిల్చాయి. అయినా సరే తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం అస్సలు తగ్గలేదు. దీంతో ఇప్పటికే ఈ చిన్నది కొన్ని చిత్రాలను కూడా ఓకే చేసేసింది. అలాగే, దక్షిణాది భాషల్లోనూ నటించేందుకు సిద్ధం అవుతోంది. దీంతో నార్త్ బ్యూటీ సౌత్‌లోనూ సంచలనం అవుతోంది.

సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి

హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన కేతిక శర్మ.. ఈ మధ్య కాలంలో మరింత యాక్టివ్ అయింది. ఇందులో భాగంగానే ఈ ముద్దుగుమ్మ తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

హాట్ షోలో గీత దాటేస్తోంది

కేతిక శర్మ సోషల్ మీడియాలో చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఆమె కొంత కాలంగా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో తన లేలేత అందాలను చూపించేవే ఎక్కువ ఉంటున్నాయి. తద్వారా కేతిక శర్మ తరచూ వార్తల్లో నిలుస్తూ హైలైట్ అవుతోంది.

 కేతిక హాట్ వీడియో వైరల్

కేతిక హాట్ వీడియో వైరల్

క్యూట్ బ్యూటీ కేతిక శర్మ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను వదిలింది. వీటిలో ఈ చిన్నది ప్యాంట్ లేకుండానే డ్రెస్ వేసుకుని ఘాటు ఫోజులిస్తూ హాట్ షో చేసింది. అంతేకాదు, ఓ పిల్లికి ముద్దుల మీద ముద్దులు ఇవ్వడంతో పాటు ఎదపై హత్తుకుని రెచ్చిపోయింది. దీంతో కేతిక శర్మ షేర్ చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X