ఖుష్బూకి లైంగిక వేధింపులు.. ఆ హీరోకి చెప్పు చూపించి మరీ మాస్ వార్నింగ్
ఒక్క తెలుగు సినిమా లోనే కాదు దాదాపు ప్రతీ భాషకి చెందిన సినీ పరిశ్రమలోనూ మహిళా ఆర్టిస్టులు, మహిళా హీరోయిన్స్ కి లైంగిక వేధింపులు అనే మాటలు తరచూ బయటకి వినిపిస్తూనే ఉంటాయి. ఈ వేధింపులు ఇప్పటి నుంచి కాదు ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్నాయి.
ఇప్పటికే సీనియర్ హీరోయిన్స్ అయ్యి ఫేడ్ అవుట్ అయ్యిన హీరోయిన్స్‌లో వయసులో ఉన్నప్పుడు సినీ రంగాన్ని ఏలిన వారు కూడా ఉన్నారు. అలాంటి ఓ సీనియర్ నటి షాకింగ్ విషయాలు షేర్ చేసుకోవడంతో సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ప్రముఖ నటి అలాగే రాజకీయ నాయకురాలు అయినటువంటి ఖుష్బూ సుందర్ ఒకప్పుడు తమిళ్ సినిమాలో ఎదురు లేని హీరోయిన్ గా నిలిచారు. తనకి ఏకంగా గుడి కట్టించిన అభిమానులు కూడా ఉన్నారు. అలాగే ఖుష్భు తెలుగులో కూడా పలు సినిమాలు అది కూడా మెగాస్టార్ చిరంజీవి , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ సినిమాల్లో కీలక పాత్రలు చేశారు.
ఇపుడు రాజకీయాల్లో, పలు టీవీ షోలలో బిజీగా ఉండగా తాజాగా ఖుష్బూ ఓ ఇంటర్నేషనల్ మూవీ ఫెస్టివల్ లో పాల్గొనగా అందులో మహిళా సంరక్షణపై జరిగిన ఓ డిబేట్ లో ఆమె చేసిన కామెంట్స్ ఇపుడు అటెన్షన్ ని తెచ్చుకున్నాయి. కాగా ఆమె ఏం చెప్పిందంటే.
తన సినిమా కెరీర్ లో ఓ ప్రముఖ హీరో తనకి ఏదన్నా ఛాన్స్ ఉందా అంటూ వేరే రకంగా మాట్లాడాడు అని అపుడు దానికి నేను నా చెప్పుల సైజ్ 41 ఇక్కడే చెంప పగలగొట్టాలా లేక అందరి ముందు కొట్టాలా అని చెప్పాను ఖుష్బూ తెలిపారు. దీనితో ఆమె వ్యాఖ్యలు ఇపుడు వైరల్ గా మారింది.

ఆడవారికి అన్ని చోట్లా ఇబ్బందులు ఉంటున్నాయి అని కానీ సమయాన్ని బట్టి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేది మాత్రం మన చేతిలోనే ఉంటుంది. సినిమాలోకి ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే నేను వచ్చాను. ఎక్కడైనా సమానత్వం, గౌరవంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను అని ఖుష్బూ తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని వెల్లడించారు.
దీనితో ఈమె కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. అయితే ఇపుడు ఖుష్బూని అంతలా ఇబ్బంది పెట్టిన ఆ సీనియర్ హీరో ఎవరు అనే టాక్ కూడా ఇపుడు మొదలైంది. ఇవి పక్కన పెడితే ఖుష్బూ ప్రస్తుతం బీజేపీలో కేంద్ర స్థాయిలో బిజీగా ఉండగా తెలుగులో పాపులర్ కామెడీ షో జబర్దస్త్ లో బిజీగా ఉన్నారు. ఇవి కాకుండా అరకొర సినిమాలు కొన్ని చేస్తున్నారు. అలాగే తన భర్త సుందర్ సి తమిళ్ లో హారర్ సిరీస్ అరణ్మణై ని డెవలప్ చేసే పనిలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











