అమితాబ్‌తో ఆ హీరోయిన్ రొమాన్స్ చేస్తే ఫోన్ చేసి తిట్టాను.. నా బెడ్ రూంలో ఆ ఫోటోలు.. కుష్బూ సీక్రెట్ రివీల్
సీనియర్ నటి, సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ కుష్బూ నటించిన రామ బాణం విడుదలకు సిద్దమైంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై శ్రీవాసు నిర్మిస్తున్న ఈ చిత్రంలో గోపిచంద్, డింపుల్ హయతి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు, కుష్బూ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలకు మంచి రెస్సాన్స్ వస్తున్నది. ఈ సినిమా మే 5వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంంలో కుష్బూ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ.. తన మనసులోని మాటలను బయటపెట్టారు. ఆమె చెప్పిన విషయాల వివరాల్లోకి వెళితే..
ఆ క్రెడిట్ డైరెక్టర్లకే ఇస్తా : పాత్రలను బట్టి నా నటన మారిపోతుంది. నేను మెథడ్ ఆర్టిస్ట్‌ను కాదు. పాత్రకు సంబంధించిన రిహార్సల్ చేసి సెట్‌కు వెళ్లే అలవాటు లేదు. నేను సహజసిద్దంగా నటిస్తాను. నేను డైరెక్టర్‌పై ఆధారపడి నటిస్తాను. డైరెక్టర్ ఏది కావాలనుకొంటే అది చేస్తాను. కుష్బూ చాలా బ్రిల్లియెంట్‌గా చేసిందనే ప్రశంస వచ్చినా.. చెత్తగా నటించిందని ప్రశంస వచ్చినా ఆ క్రెడిట్ డైరెక్టర్‌కే ఇస్తాను. నా క్యారెక్టర్‌ను డిజైన్ చేసినందుకే డైరెక్టర్‌కు క్రెడిట్ ఇస్తాను అని కుష్బూ అన్నారు.

కనీసం 20 సినిమాలు చేస్తా : నేను తెలుగు సినిమాల్లో నటించాలని ఉంది. కానీ నా పాత్రకు ప్రాధాన్యత ఉండాలి. నా పాత్రకు ఎంత నిడివి ఉంటుందని నేను ఆలోచించను. రెండు సీన్లు ఉన్నా సరే.. కథను మలుపు తిప్పేలా ఉండాలి. నేను చేయాలంటే సంవత్సరానికి 20 సినిమాలు చేయగలను. కానీ నేను చాలా పర్టిక్యులర్‌గా పాత్రలను ఎంచుకొంటున్నాను అని కుష్బు చెప్పారు.
నా మాటలు కాంట్రవర్సీగా : నా చుట్టు వివాదాలు ఎందుకు ఉంటాయంటే.. నేను ముక్కుసూటిగా మాట్లాడుతాను. దాపరికం లేకుండా చెప్పేస్తాను. నాకు నేను బ్యూటీ విత్ బ్రెయిన్‌గా భావిస్తాను. అందరూ చదివే వార్తనే ఎవరైనా రాస్తారు. కుష్బూ గురించి ఏమి రాసినా దానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అందుకే నా గురించి వార్తలు రాస్తారు. నేను మాట్లాడే విషయంలో కాంట్రవర్సి ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను ఏం మాట్లాడినా వైరల్ అవ్వడమే కాకుండా కాంట్రవర్సీ అవుతుంది. అందుకే నేను ఎప్పుడూ వార్తలో ఉంటాను. సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్నందున ప్రతీ ఒక్కరు క్రిటిక్, జడ్జిగా తమ అభిప్రాయాలను చెబుతున్నారు అని కుష్బూ అన్నారు.

చీనికమ్ సినిమాలో టబూ నటించినందుకు : నేను చాలా సెలెక్టివ్‌గా రోల్స్ చేస్తాను. ఒకే సినిమా చూసిన తర్వాత నేను ఎందుకు చేయలేదని బాధపడలేదు. కానీ ఒక్క సినిమా విషయలో అలాంటి బాధ కలిగింది. కొన్నేళ్ల క్రితం అమితాబ్ బచ్చన్‌తో టబూ చీనికమ్ అనే సినిమాలో నటించింది. అమితాబ్‌తో చీనికమ్ సినిమాలో రొమాన్స్ చేయడాన్ని నేను తట్టుకోలేకపోయాను. ఆ విషయం తెలిసి టబూపై కోపంతో ఊగిపోయాను. అమితాబ్‌తో రొమాన్స్ చేయడానికి నీకు ఎంత ధైర్యం అని సరదాగా నేను ఆమెపై ఫైర్ అయ్యాను.

నా బెడ్‌రూమ్‌లో అమితాబ్ ఫోటోలు : నేను అమితాబ్‌కు పెద్ద ఫ్యాన్‌ను. అమితాబ్ సినిమాలో నేను బాలనటిగా నటించాను. ఒకవైపు ఒడిలో ఆయన కుమార్తె శ్వేత. మరోవైపు ఒడిలో నన్ను ఆయన పెట్టుకొన్నారు. ఇప్పటికీ నేను నా బెడ్ రూమ్‌లో అమితాబ్ బచ్చన్ ఫోటోలు పెట్టుకొంటాను. నా కప్ బోర్డ్‌లో అమితాబ్ బచ్చన్ ఫోటోలు ఉంటాయి. నేను డైహార్డ్ ఫ్యాన్‌ను. అందుకే టబూపై కోపగించుకొన్నాను అని కుష్బూ తెలిపారు.


Click it and Unblock the Notifications











