బన్నీకి జోడిగా రాంచరణ్ హీరోయిన్!
నా పేరు సూర్య తర్వాత తదుపరి చిత్రం ప్రకటించడానికి బన్నీ చాలా టైం తీసుకున్నాడు. దానికి కారణం సరైన కథ కుదరకపోవడమే. అరవింద సమేత చిత్రం తర్వాత త్రివిక్రమ్ వినిపించిన కథ నచ్చడంతో బన్నీ ఒకే చేశాడు. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన డిసెంబర్ 31న వెలువడింది. అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.
బన్నీకి జోడి కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ అల్లు అర్జున్ తో రొమాన్స్ చేయబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కైరా అద్వానీని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటనే మిగిలి ఉందట. ఎమ్ఎస్ ధోని చిత్రంతో సినిమాల్లోకి అడుగు పెట్టిన కైరా అద్వానీ టాలీవుడ్ లో కూడా పాగా వేయడానికి ప్రయత్నిస్తోంది.

టాలీవుడ్ లో తొలి చిత్రంతోనే మహేష్ బాబు సరసన నటించిన ఘనవిజయం సొంతం చేసుకుంది. రాంచరణ్ సరసన నటించిన వినయ విధేయ రామ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఇప్పుడు అల్లు అర్జున్ చిత్రంలో కూడా నటించబోతుండడంతో కైరా అద్వానీ టాలీవుడ్ లో టాప్ లీగ్ లోకి చేరడం ఖాయం అని అంచనా వేస్తున్నారు. కైరా అద్వానీ నటన, గ్లామర్ యువతని ఆకర్షించే విధంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications