Kiara Advani: రిసెప్షన్ లో ఖరీదైన నెక్లెస్ తో కనిపించిన కియారా.. దాని ధర గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో లవ్ బర్డ్స్ గా చాలా కాలం పాటు కొనసాగిన కీయరా అద్వానీ సిద్ధార్థ మల్హోత్రా మొత్తానికి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని సరికొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. ఎంతో కాలంగా వీరి ప్రేమ గురించి కథనాలు వెలువడుతున్నప్పటికీ కూడా ఇప్పుడు ఆ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. కానీ డైరెక్ట్ గా పెళ్లి చేసుకుని వారు సరికొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు. అయితే ఇటీవల రిసెప్షన్ కూడా గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ వేడుకలో కియారా అద్వానికి సంబంధించిన ఒక నెక్లెస్ గురించి అనేక రకాల కథనాలు వస్తున్నాయి. ఇక దాని ధర ఎంత అనే వివరాల్లోకి వెళితే..

ప్రేమలో ఉన్నా..

ప్రేమలో ఉన్నా..

బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ మల్హోత్రా ఇద్దరు కూడా గత ఐదేళ్లకు పైగానే ప్రేమలో ఉన్నట్లు అనేక రకాల కథనాలు వచ్చాయి. అయితే ఎప్పుడు కూడా ఆ విషయంలో ఇద్దరూ ఓపెన్ అయితే అయింది లేదు. కానీ వారి సన్నిహితులు మాత్రం పెళ్లి చేసుకోవచ్చు అనే విధంగా గాసిప్స్ కు అయితే కొంత రియాక్ట్ అయ్యారు. ఇక మొత్తానికి ఇటీవల వారు ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

రిసెప్షన్ వేడుకకు..

రిసెప్షన్ వేడుకకు..

పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే ఆహ్వానించిన ఈ బాలీవుడ్ జంట తర్వాత రిసెప్షన్ వేడుకకు మాత్రం ప్రముఖ సినీ తారలను ఆహ్వానించారు. రిసెప్షన్ వేడుకలో కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరైనట్లు టాక్ వచ్చింది. కానీ అందుకు సంబంధించిన ఫోటోలు ఏమీ బయటకు రాలేదు. ఇక ముంబైలో జరిగిన ఆ రిసెప్షన్ వేడుకలో బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అజయ్ దేవగన్ కాజోల్ రణబీర్ ఆలియా భట్ అనుపమ్ ఖేర్ వంటి సినీ తారలు పాల్గొన్నారు.

హైలెట్ గా నిలిచిన జంట

హైలెట్ గా నిలిచిన జంట

ఇక పెళ్లిలో మాత్రమే కాకుండా రిసెప్షన్ వేడుకలో కూడా సిద్ కీయరా ఇద్దరు కూడా చాలా అందంగా కనిపించారు. ఇక వారికి సంబంధించిన జ్యువెలరీ డ్రెస్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా రిసెప్షన్ వేడుకలో కియార స్టైలిష్ గా కనిపించింది. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఆ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ డ్రెస్ లో చాలా హైలెట్ అయింది.

కీయరా ఖరీదైన నెక్లెస్

కీయరా ఖరీదైన నెక్లెస్

కీయరా తన ఫిష్ లైట్ గౌన్ లో క్రీం టౌన్ సిల్క్ టాప్ తో ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఆ డ్రెస్ కి తగ్గట్టుగా ఒక డైమండ్ స్టోన్స్ కలిగిన నెక్లెస్ ను కూడా ధరించింది. వెడ్డింగ్ రిసెప్షన్లో మొత్తంగా ఆ హారమైతే చాలా హైలెట్ గా నిలిచింది. ఇక వచ్చిన గెస్ట్ లు అందరూ కూడా ఎక్కువగా అది చాలా అద్భుతంగా ఉంది అని పొగిడారు. ఇక దాని ధర ఎంత ఉంటుంది అనే వివరాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దాని ధర ఎంతంటే..

దాని ధర ఎంతంటే..

ఇక ఈ రిసెప్షన్ వేడుకలో ధరించిన ఆ నెక్లెస్ ప్రత్యేకంగా డిజైన్ చేశారట. జాంబియన్ గ్రీన్ వరల్డ్ స్టోన్స్ నుంచి తెప్పించి మరి ప్రత్యేకంగా కుటుంబ సభ్యులు డిజైన్ చేయించినట్లుగా తెలుస్తోంది. ఇక ఆ మెరిసే రాయిని పన్నా అని పిలుస్తారట. అది చాలా విలువైనది అని కూడా చెబుతున్నారు. ఇక ఈ జ్యువెలరీ గురించి ప్రస్తుతం ఆన్లైన్లో సెర్చ్ చేసిన వారు మొత్తంగా అయితే అందులో ఒక్కొక్క పచ్చ రాయి 3.32 క్యారెట్లు ఉంటుందని, ఇక ఒక్క ఆకుపచ్చ రాయి దాదాపు రూ.29,000 వరకు ఉంటుంది అని చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X