‘హిట్ 3 దర్శకుడితో అలా ఇబ్బంది పడ్డా.. ఉల్టా పుల్టాగా’
తెలుగు హీరోయిన్ కోమలి ప్రసాద్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఏపీకి చెందిన ఈ బ్యూటీ విభిన్న పాత్రలు పోషిస్తూ వెండితెరపై మెరుస్తూ వస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ లోని
విశాఖ పట్నంలో పుట్టింది కోమలి ప్రసాద్. ఇక అక్కడే తన చిన్నతనాన్ని గడిపింది. ఆ తర్వాత తమ కుటుంబం కర్ణాటకలోని బల్లారిలో పెరిగింది. ఇక ఆమె మెడిసిన్ పూర్తి చేసింది. ప్రవర ఇన్ట్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో పట్టా పొందింది. తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్న తర్వాత సినిమాలపై ఉన్న ఆసక్తితో ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలను దక్కించుకుంటోంది. తనదైన శైలిలో కెరీర్ ను ముందుకు నడిపిస్తోంది.
ఇక కోమలి ప్రసాద్ వెండితెరపై మెరియడమే కాకుండా తనకు వీలున్నప్పుడు ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ తన ఫ్యాన్స్ తో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేస్తూ ఉంది. ఈ క్రమంలో ఇటీవల కోమలి ప్రసాద్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఆసక్తికరంగా మారింది. అందులో ఆమె టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శైలేష్ కొలను గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలియజేసింది. హిట్ 3 దర్శకుడి గురించి ఆమె గతంలో చెప్పిన విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

దర్శకుడు శైలేష్ కొలనుతో ఆమె రెండు చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన హిట్ : ది సెకండ్ కేస్, 2025లో నాని నటించిన హిట్ 3 చిత్రాల్లో కోమలి ప్రసాద్ కు దర్శకుడు శైలేష్ కొలను కీలక పాత్రల్లో నటించే అవకాశాన్ని అందించారు. కాగా రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయనతో కలిసి పని చేయడం వండర్ ఫుల్ అని చెప్పింది. ఇదే సమయంలో శైలేష్ కొలను మాట్లాడే భాషపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆయన సెట్ లో ఎలా మాట్లాడుతారో, ఆయన మాట్లాడే తీరు ఎలా ఉంటుందనేది ఆమె చెప్పడం ఆసక్తికరంగా మారింది.
ఆమె మాట్లాడుతూ.. శైలేష్ కొలను మాట్లాడే భాషతోనే ప్రాబ్లం ఉంటుందని తెలిపింది. మనం ఒకలా మాట్లాడితే ఆయన తెలుగును విరగగొట్టి, ఉల్టా పుల్టా చేసి మాట్లాడుతారని చెప్పింది. ఇక ఆయన మొహంలో ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ఉండదని, అలా ఆయన మాట్లాడే తీరుతో కాస్తా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది. ఏదేమైనా దర్శకుడు శైలేష్ కొలను ఇచ్చిన అవకాశాలతోనే మంచి సక్సెస్ అందుకుంది. ఇక గతంలోనూ ఆమె పలు చిత్రాలల్లో నటించి మెప్పింది.
ఇక కోమలి ప్రసాద్ తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపుగా 10 ఏళ్లుగా యాక్టివ్ గా ఉంది. 2016 నుంచి నేను సీతా దేవి అనే చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత నెపోలియన్, అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి, రౌడీ బాయ్స్, సెబాస్టియన్ పీసీ 524 వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ తెలుగు ప్రేక్షకులకు వెండితెరపై అలరిస్తోంది. చక్కటి పాత్రలను పోషిస్తూ తెలుగు ఆడియెన్స్ కు మరింతగా దగ్గరవుతోంది. ఇక నెక్ట్స్ శశివదనే అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా గురించి రీసెంట్ అప్డేట్స్ మాత్రం పెద్దగా లేవు.


Click it and Unblock the Notifications











