Krithi Shetty: కస్టడీ డిజాస్టర్ అయినా ఏకంగా 100 కోట్ల బిగ్ మూవీలో ఛాన్స్.. హీరో ఎవరంటే?
ఉప్పెన మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ కృతి శెట్టి వరుస హ్యాట్రిక్ హిట్స్ ని సొంతం చేసుకుంది. తరువాత వరుసగా నాలుగు ఫ్లాప్ లని ఖాతాలో వేసుకుంది. తాజాగా నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన కస్టడీ మూవీ కూడా ఆమె డిజాస్టర్ జాబితాలో చేరిపోయింది. దీంతో తెలుగులో ఐరన్ లెగ్ ముద్ర ఆమె మీద పడిపోయింది.
తెలుగులో ఛాన్స్ లు రాకపోయిన ఈ బ్యూటీ ఇప్పుడు తమిళ్, మలయాళీ భాషలలో రెండు సినిమాలు చేస్తోంది. తమిళంలో జయం రవి హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీలో కృతిశెట్టిని హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఈ సినిమాతో భువనేష్ అర్జునన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీని ఇషారి గణేష్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

తాజాగా ఆయన ఈ సినిమాని 100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. గతంలో బాల దర్శకత్వంలో సూర్య హీరోగా స్టార్ట్ అయిన సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఆ మూవీ నుంచి సూర్య తప్పుకున్నాడు. అతని స్థానంలోకి అరుణ్ విజయ్ వచ్చారు.
తరువాత కృతి శెట్టి కూడా ఈ మూవీ నుంచి తప్పుకుంది. తమిళంలో జయం రవి మూవీ కన్ఫర్మ్ కాగా మలయాళంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. టోవినో థామస్ హీరోగా పీరియాడికల్ కథతో తెరకెక్కుతోంది.
ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తూ ఉండటం విశేషం. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడంతో తెలుగులో కూడా రిలీజ్ అవ్వనున్నాయి. ఈ మూవీస్ తో అయిన ఆమె అదృష్టం మారుతుందా లేదా అనేది చూడాలి. అవి సక్సెస్ అయితే మళ్ళీ కృతి శెట్టి కెరియర్ గాడిలో పడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











