Krithi Shetty: అత్యాశకు పోయి బోల్తా పడిన కృతిశెట్టి.. ఉప్పెనలా వచ్చి.. ఇప్పుడు మాత్రం దారుణంగా...

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఎంతగా దోబూచులాడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక సక్సెస్ రాగానే హీరోయిన్స్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఒకటి రెండు ఫ్లాప్స్ ఎదురైతే ఏమి కాదు కానీ వరుసగా నాలుగు సినిమాలు డిజాస్టర్ అయితే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ఇక ఇప్పుడు ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ఊహించిన విధంగా వరుస అపజయాలను ఎదుర్కొంటుంది. అవి కూడా సాధారణమైన డిజాస్టర్స్ కాదు. కనీసం పెట్టిన పెట్టుబడిలో సగం బడ్జెట్ కూడా వెనక్కి రాని డిజాస్టర్స్ ఎదుర్కొంటుంది. ఇక కృతి శెట్టి ఇప్పటివరకు ఎన్ని సినిమాలతో సక్సెస్ అందుకుంది అలాగే ఎన్ని సినిమాలతో ఫెయిల్యూర్స్ ఎదుర్కొంది అనే వివరాల్లోకి వెళితే..

అదే స్పీడ్ తో మూడు హిట్స్:టాలీవుడ్ లోకి చాలా మంది అందాల భామలు హీరోయిన్స్ గా అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మెరుపులు మెరిపిస్తారు. అదే స్పీడ్ తో రెండు మూడు హిట్స్ కొట్టి స్టార్ హీరోయిన్ అయిపోతుందనే నమ్మకాన్ని కలిగిస్తారు. తరువాత సినిమాల ఎంపికలో లోపాల కారణంగా వెనక్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు అలాంటి పరిస్థితిలోనే కృతి శెట్టి ఉన్నట్లు అనిపిస్తోంది.

Actress Krithi shetty back to back disasters effect on remuneration

వరుస విజయాలు:ఉప్పెన మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మంగళూరు బ్యూటీ కృతి శెట్టి. మొదటి మూవీతోనే ఈ అమ్మడు బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా ఇచ్చిన ఉప్పుతో కృతి శెట్టి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయం అని అందరూ భావించారు. దానికి తగ్గట్లుగానే అవకాశాలు క్యూ కట్టాయి. రెండో సినిమా బంగార్రాజుతో మరో హిట్ సొంతం చేసుకుంది.

Actress Krithi shetty back to back disasters effect on remuneration

కృతి శెట్టి డిమాండ్ పెరిగిపోయింది.:అలాగే మూడో మూవీ శ్యామ్ సింగరాయ్ తో హ్యాట్రిక్ హిట్స్ సాధించింది. ఇలా బ్యాక్ టూ బ్యాక్ మూడు సూపర్ హిట్స్ వచ్చేసరికి కృతి శెట్టి డిమాండ్ పెరిగిపోయింది. దానికి తగ్గట్లుగానే అమ్మడు రెమ్యునరేషన్ కూడా అమాంతం పెంచేసింది. అయితే ఏ ముహూర్తాన హ్యాట్రిక్ హిట్స్ కొట్టిందో కాని ఆ తరువాత నుంచి వరుస ఫ్లాప్స్ వస్తూనే ఉన్నాయి.

Actress Krithi shetty back to back disasters effect on remuneration

మళ్ళీ వరుస అపజయాలు:నెక్స్ట్ రామ్ పోతినేనితో ది వారియర్ మూవీ చేసిన కృతి శెట్టి డిజాస్టర్ ని ఖాతాలో వేసుకుంది. తరువాత నితిన్ కి జోడీగా చేసిన మాచర్ల నియోజకవర్గం మూవీతో మరో డిజాస్టర్ కొట్టింది. వెంటనే గ్యాప్ లేకుండా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేసిన ఆమెకి మాత్రం ప్లస్ అవ్వలేదు.

Actress Krithi shetty back to back disasters effect on remuneration

మరో డిజాస్టర్:తాజాగా కస్టడీ సినిమాతో మరో ఫ్లాప్ కృతి శెట్టి ఖాతాలో వచ్చి చేరింది. ఈ సినిమా మీద అమ్మడు చాలా హోప్స్ పెట్టుకుంది. అయితే కస్టడీ మూవీ ఫెయిల్యూర్ కి కృతి శెట్టి కారణం అనే మాట అక్కినేని అభిమానుల నుంచి వినిపిస్తోంది. ఆమె పాత్ర లేకుండా ఉంటే సినిమా హిట్ అయ్యేదని అంటున్నారు. ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో తెలుగులో ఏ మూవీస్ లేవు. తమిళంలో ఒకటి, మలయాళంలో ఒక మూవీ చేస్తోంది. ఈ రెండింటి మీదనే ఆమె భవిష్యత్తు ఆధారపడి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X