Krithi Shetty: మొదటిసారి ప్రేమ విషయంలో నోరు విప్పిన ఉప్పెన బ్యూటీ.. ఆ రూమర్స్ కు చెక్!
మొదటి సినిమాతోనే భారీ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్న గ్లామరస్ బ్యూటీ కృతి శెట్టి ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాలో కృతి శెట్టి అందంతోనే కాకుండా నటనతో కూడా ఎంతగానో మెప్పించింది. ఇక ఈ బ్యూటీ మొదటి సారి తన ప్రేమ విషయం గురించి నోరు విప్పింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాలకు కూడా ఒక విధంగా ఆమె చెక్ పెట్టింది అనే చెప్పాలి.. పూర్తి వివరాల్లోకి వెళితే..

సౌత్ లో బిజీగా..
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన తొలి చిత్రం ఉప్పెన సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాతో వైష్ణవ్ తేజ్ కంటే ఎక్కువగా కృతి శెట్టి కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది అనే చెప్పాలి. మొదటి చూపులోనే కుర్రాళ్లను అమితంగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో చాలా బిజీగా మారిపోయింది.

డిమాండ్ మామూలుగా లేదు
మొదటి సినిమా విడుదల కాకముందే కృతి శెట్టి వరుసగా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అంటే ఆమెకు డిమాండ్ ఏ రేంజిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాకుండా మొదటి సినిమా సక్సెస్ అయిన తర్వాత ఒక్కసారిగా ఈ బ్యూటీ పారితోషికాన్ని కూడా పెంచేసింది. మొదటి సినిమాకు లక్షల్లో అందుకున్న కృతి శెట్టి ఇప్పుడు మాత్రం కోట్లల్లో డిమాండ్ చేస్తోంది.

భారీగా రెమ్యునరేషన్
నాగార్జున నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమాలో కృతి శెట్టి ఏకంగా రెండు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుని వార్తల్లో నిలిచింది. రెండు పదుల వయసులో కి రాకముందే అమ్మడు ఎవరూ ఊహించని విధంగా అగ్రహీరోయిన్ స్థాయిలో భారీగా డిమాండ్ చేస్తూ ఉండటం హాట్ టాపిక్ గా మారింది.

18 ఏళ్ళ వయసులో...
కృతి శెట్టి వయసు ప్రస్తుతం 18 ఏళ్లు మాత్రమే. ఈ వయసులోనే అమ్మడు గ్లామరస్ పాత్రలు కూడా చేసేందుకు ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. కానీ ఎక్కువగా లిమిట్స్ దాటకుండా తన పాత్రలను సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ మొదటి రెండు సినిమాల్లో మాత్రం లిప్ లాక్ సన్నివేశాలలో నటించింది.

ప్రేమ విషయంలో..
ఇక ప్రస్తుతం కృతి శెట్టి ప్రేమలో ఉన్నట్లు అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఈ బ్యూటీ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ రూమర్స్ కు చెక్ పెట్టేసింది. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం కూడా సినిమా కెరీర్ పైనే ఉంది అంటూ ఇప్పట్లో ప్రేమ గురించి కూడా పెద్దగా ఆలోచించడం లేదు అని అంత సమయం కూడా తన దగ్గర లేదు అని అమ్మడు చాలా క్లారిటీ గా వివరణ ఇచ్చింది.

రాబోయే సినిమాల విషయానికి వస్తే..
ఇక ప్రస్తుతం కృతి శెట్టి సినిమాల విషయానికి వస్తే రామ్ పోతినేని లింగుస్వామి కలయికలో తెరకెక్కుతున్న 'ది వారియర్' అనే సినిమాలో మెయిన్ హీరోయిన్గా నటిస్తోంది. ఆ చిత్రం తెలుగు తమిళంలో ఒకేసారి విడుదల కాబోతోంది. అలాగే సుధీర్ బాబు మోహన కృష్ణ ఇంద్రగంటి కలయికలో తెరకెక్కుతున్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమాలో కూడా నటిస్తోంది. అలాగే మరో రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











