లెహంగాలో కృతి శెట్టి హీటెక్కించే ట్రీట్.. అసలైన అందం చూపిస్తూ కాక రేపెస్తోందిగా
ఉప్పెన సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది కృతి శెట్టి. ఈ సినిమాతోనే బ్యూటీ క్రేజ్ మారిపోయిందని చెప్పాలి. ఈ సినిమాలో బేబమ్మ పాత్రలో కుర్రాళ్ల మనసు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక మొదటి సినిమాలో అమ్మడు రొమాంటిక్ సీన్స్ లో కాస్త హద్దులు దాటకుండానే కనిపించింది.
ఇక ఆ తరువాత మెల్లగా అమ్మడు గ్లామర్ డోస్ పెంచుకుంటూ వస్తోంది. ట్రెడిషినల్ డ్రెస్ లో కనిపించినా కూడా హీటెక్కించే ప్రయత్నం చేస్తోంది. ఇక ఆమే సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు గ్లామర్ డోస్ మరింత పెంచేస్తోంది. లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఫొటోల వివరాల్లోకి వెళితే..

మొదట్లోనే హై డిమాండ్: ఉప్పెన సినిమాతో కృతి శెట్టికి మంచి పేరు, గుర్తింపు అయితే వచ్చింది. మొదటి సినిమాతోనే యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంది. బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో హిట్స్ అందుకున్న కృతి.. ఒక్కసారిగా రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచింది. కొత్తగా వచ్చిన హీరోయిన్స్ లలో అత్యధిక వేగంగా రెమ్యునరేషన్ పెంచిన వారిలో కృతి టాప్ లిస్ట్ లో ఉంటుందని చెప్పవచ్చు.

బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా: ఆ తర్వాత వరుసగా ప్లాపులను ఖాతాలో వేసుకుంది. దీంతో అవకాశాలు తగ్గిపోయాయి.ఇటీవలే కస్టడీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
కానీ అనుకున్న స్థాయిలో ఈ సినిమా ఆడలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక ఆఫర్స్ పెంచుకునేందుకు తాజాగా అందాల ఆరబోస్తోంది. ఎప్పుడూ పద్ధతిగా కనిపించే ఈ భామ.. లెహాంగాలో మెరిసింది. లెహాంగాలో అందంగా ముస్తాబయిన ఈ ముద్దగుమ్మ ఫోటోస్ షేర్ చేసి ట్రీట్ ఇచ్చింది.

రోజు రోజుకీ గ్లామర్ డోసు పెంచేస్తోంది: అంతేకాకుండా.. రోజు రోజుకీ గ్లామర్ డోసు పెంచేస్తోంది. ఇక ఈ ఫోటోల్లో నడుము అందాలు ఆరబోస్తూ... హీట్ ఎక్కించింది. బిలీవ్ యువర్ సెల్ప్ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ భామ ఫోటోస్ చూసిన నెటిజన్లు... కామెంట్ల వర్షం కురిస్తున్నారు. హార్ట్ సింబల్స్ తో కామెంట్ బాక్స్ లో నింపేస్తున్నారు.

ప్రస్తుతం ఆ సినిమాలతో బిజీగా: ప్రస్తుతం కృతి శెట్టి తెలుగులో శర్వానంద్ సరసన ఓ ప్రాజెక్ట్ చేస్తుందని సమాచారం. అలాగే.. తమిళంలో విశాల్ మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా మలయాళంలో రూపొందుతున్న ఓ పాన్ ఇండియా ప్రాజెక్టులో కూడా నటిస్తుంది కృతి శెట్టి. ఇక గ్లామర్ డోస్ పెంచితే అమ్మడికి మరిన్ని అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంది.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. ఆఫర్స్ పెంచుకునేందుకు తన అందాల ఆరబోత స్టార్ట్ చేసింది ఈ భామ. ఇక చూడాలి మున్ముందు ఈ భామ ఎలాంటి సినిమాలతో అలరిస్తుందోనని.


Click it and Unblock the Notifications











