హీరోయిన్స్‌ను ఎవరు పెళ్లి చేసుకోవాలని అనుకోరు.. ఎప్పటికీ అలానే..: కృతి సనోన్
ఒకప్పుడు హీరోయిన్స్ పెళ్లయిన తర్వాత అసలు సినిమా ఇండస్ట్రీలోకి మళ్ళీ రావడానికి పెద్దగా ఆసక్తిని చూపించే వారు కాదు. ఫ్యామిలీ లైఫ్ తోనే ఎక్కువగా బిజీగా ఉండేవారు. అయితే మరికొందరు మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినప్పటికి రెగ్యులర్ హీరోయిన్స్ కు మాత్రం స్టార్ట్ చేయడం లేదు. హీరోయిన్స్ జీవితంలో పెళ్లి అనేది చాలా కీలక మలుపు అని అప్పట్లో చాలా బలంగా ఉండేది అయితే. హీరోయిన్స్ ను పెళ్లి చేసుకోవడానికి కూడా ఎవరు పెద్దగా ఆసక్తి చూపించరు అనే కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇక ఆ కామెంట్ పై ఇటీవల ప్రభాస్ హీరోయిన్ కృతి సనన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ ఇండస్ట్రీలోనే..
బ్యూటిఫుల్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న కృతి సనోన్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా తన రేంజ్ పెంచుకోవాలని చూస్తోంది. ఈ బ్యూటీ మొదట మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

సక్సెస్ కాకపోయినా..
కృతి సనన్ మొదటి నుంచి కూడా విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అవి సక్సెస్ కాకపోయినా కూడా నటిగా మాత్రం ఆమెకు మంచి మార్కులు పడుతూ ఉంటాయి. కెరీర్ విషయంలో మాత్రం ఈ బ్యూటీ వేసిన అడుగులు అందరికంటే విభిన్నంగా ఉంటాయి. కమర్షియల్ సినిమాలు అయితే ఎక్కువగా చేసింది లేదు. వీలైనంతవరకు ప్రతి సినిమాలో తన పాత్ర విభిన్నంగా ఉండేలా చూసుకుంటుంది.

ప్రభాస్ తో సినిమా
కృతి సనోన్, ప్రభాస్ తో ఆదిపరుష్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అసలైతే ఈ ఏడాది మొదట్లోనే విడుదల కావాలి. కానీ గ్రాఫిక్స్ కారణాల వలన సమ్మర్ కు వాయిదా పడిన విషయం తెలిసిందే. రామాయణం ఆధారంగా తెరపైకి రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కృతి సనోన్ సీత పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమా ఈ బ్యూటీకి చాలా కీలకం కానుంది.

మొదట్లో అలానే అనేవారు
అయితే పర్సనల్ విషయాలపై కూడా అప్పుడప్పుడు ఈ బ్యూటీ ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్స్ పెళ్లి అనేది చాలా హైలైట్ అవుతుంది అని అయితే హీరోయిన్స్ ను పెళ్లి చేసుకోవడానికి పెద్దగా ఎవరు ఆసక్తి చూపించారు అనే భావన చాలామందిలో ఉంది అని ఆమె వివరణ ఇచ్చింది. తన ఫ్రెండ్స్ కూడా మొదట్లో అలానే అనేవారు అని కానీ వారి విషయాలను పట్టించుకోకుండా తాను కెరీర్ పై ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా తెలియజేసింది.

అర్థం చేసుకోలేకపోతున్నారు .
ఇటీవల కాలంలో కొంతమంది హీరోయిన్స్ పెళ్లి అయిన తర్వాత కూడా ఎప్పటిలాగే వారి కెరీర్ ను కొనసాగిస్తున్నారు. కానీ కొన్నేళ్ల క్రితం వరకు హీరోయిన్స్ ను ఎవరు పెళ్లి చేసుకునే వారు కాదు అనే భావనతో ఎక్కువగా ఉండేవారు. ఇప్పటికే కొంతమందిలో అదే భావన ఉంది. సినిమాలో హీరోయిన్స్ కేవలం యాక్టింగ్ పరంగానే ఆ విధంగా నటిస్తారు అనే విషయాన్ని కొందరు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు కొంత మారుతున్నప్పటికీ మరికొందరి మనసుల్లో మాత్రం అలాంటి ఆలోచననే ఉంది అని అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని ఈ బ్యూటీ తెలియజేసింది.


Click it and Unblock the Notifications











