Kriti Sanon: గులాబీలా మారిపోయిన మహేష్ బాబు హీరోయిన్ - లుక్కేస్తే చాలు కిక్కెక్కుతుంది!

Kriti Sanon: వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన కృతి సనన్.. తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత దోచెయ్ సినిమాలో నటించింన ఈ క్యూట్ బ్యూటీ బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్కడే వరుసగా అవకాశాలు దక్కించుకొని అద్భుతమైన చిత్రాల్లో నటించింది. తనకు తగ్గ పాత్రల్లో నటిస్తూనే.. కోట్లాది రూపాయలు సంపాధించుకుంది. ఇటీవలే ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో సీతగా కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసింది. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ.. సీతగా కృతి సనన్ చాలా బాగా ఒదిగిపోయింది.

ఓ వైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ కృతి సనన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్లను అందరితో పంచుకుంటుంది. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో అదిరిపోయే లుక్కులో కనిపించి అందరిచేత ఆహా అనిపించుకుంది.

Actress Kriti Sanon Latest Good Looking Saree Photos goes Viral

గులాబీ రంగు కలర్ జార్జెట్ చీర కట్టుకొని చాలా స్టైలిష్ గా కనిపించింది కృతి సనన్. లైట్ పింక్ కలర్ రంగులో ఉన్న ఈ చీరపైకి కృతి సనన్ గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకుంది. అలాగే ఓ చోకర్ కూడా పెట్టుకొని అద్భుతమైన ఫోజులు పెడుతూ.. ఫొటోలు దిగింది. పోనీటెయిల్ వేుకొని తెగ సిగ్గు పడిపోతూ కనిపించింది. కృతి సనన్ ఈ ఫొటోలు షేర్ చేసిన కాసేపట్లోనే రెండున్నర లక్షలకు పైగా లైకులు వచ్చాయి. అలాగే వేలల్లో కామెంట్లు వచ్చాయి. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు.

ఎలాంటి డ్రెస్సు అయినా మీకు వెంటనే సెట్ అయిపోతుందని కొందరు, చీరలో కత్తిలా ఉన్నావంటూ మరికొందరు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. నీవంటే ఇష్టం, ఐ లవ్ యూ అంటూ తమ మనసులోని భావాలని వెల్లడిస్తున్నారు. ఒక్క ఇన్ స్టాగ్రామ్ వేదికగానే కృతికి 55.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటి వరకు ఈ క్యూట్ బ్యూటీ 2471 పోస్టులు చేసింది. ఆమె పెట్టే ప్రతీ పోస్టుకు ఆమె ఫ్యాన్స్ లైకులు కొడుతూ, షేర్లు, కామెంట్ల చేస్తూ ఆగం చేస్తుంటారు.

Actress Kriti Sanon Latest Good Looking Saree Photos goes Viral

కృతి సనన్ సోషల్ మీడియాలో ఎక్కువగా తనకు సంబంధించిన అన్ని రకాల ఫొటోలను పోస్ట్ చేస్తుంది. బికినీ నుంచి చీర వరకు అన్నీ ధరిస్తూ.. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తుంటుంది. ఆమె ఏం వేసుకున్నా, ఏ సినిమాలో నటించినా ఆమె అభిమానులు తెగ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎప్పటికప్పుడు కామెంట్లు, షేర్లు, లైకుల రూపంలో తమ అభిమాన హీరోయిన్ పై ప్రేమను ఒలకబోస్తూ ఉంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X