నా తండ్రి నన్ను లైంగికంగా వేధించాడు.. షాకింగ్ విషయం బయటపెట్టిన హీరోయిన్!

ముంబైలో పుట్టి పెరిగిన కుష్బూ ఎన్నో సినిమాల్లో నటించింది తమిళ సినీ పరిశ్రమ నుంచి నటిగా పరిచయమైంది. ఆమె తెలుగులో కూడా అనేక సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె.. ఇప్పుడు కూడా అవకాశాలు వస్తే ఏమాత్రం వెనకడుగు వేయకుండా సినిమాలు చేస్తూ వెళ్తోంది. ప్రస్తుతానికి రాజకీయాల్లో బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తున్న ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు తెరమీదకు వస్తున్నాయి. అందులో ఒక విషయం మాత్రం షాక్ కలిగిస్తోంది. దాని వివరాల్లోకి వెళితే....

నాన్న వల్ల ఇబ్బందులు...:కుష్బూ కుటుంబం మొదట్లో ముంబైలో నివసించేదట. ఆ సమయంలో కుష్బూ తండ్రి ఆమెతో తప్పుగా ప్రవర్తించిన విషయం ఆమె గతంలో స్వయంగా వెల్లడించింది. గతంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమితులైన ఖుష్బూ చిన్న వయసులో పిల్లలపై లైంగిక వేధింపులు జరిగితే ఆ చేదు జ్ఞాపకం ఎప్పటికీ మిగిలిపోతుంది. అబ్బాయి కావచ్చు లేదా అమ్మాయి కావచ్చు నేను మా నాన్న వల్ల ఎన్నో వేధింపులకు గురయ్యాను అని కుష్బూ చెప్పుకొచ్చింది.

Actress Kushboo Sundar Reveals How She Faced Sexual Harassment From Father News Goes Viral

లైంగికంగా వేధిస్తూ...:మా నాన్న మా అమ్మని బాగా కొట్టేవాడు... అతని పని ఎప్పుడూ తన భార్య పిల్లల్ని కొడుతూ ఉండడమే... అలాగే కుమార్తెను లైంగికంగా వేధించడం అది తన జన్మ హక్కుగా నా తండ్రి భావించేవాడని ఆమె గతంలో కామెంట్ చేసింది. కుష్బూ సుందర్ కి సుమారు 8 ఏళ్ల వయసున్న సమయంలో ఆమెను తన తండ్రి లైంగికంగా వేధించేవాడట. అయితే మొదట్లో ఈ విషయం తప్పని ఆమెకు తెలిసేది కాదు కానీ వయసు గడిచే కొద్ది ఇదంతా తప్పని ఖుష్బూకి అర్థమైందట.

అమ్మకు చెబితే ఎవ్వరూ నమ్మలేదు...:15 ఏళ్లు వచ్చేసరికి ఆమె ఈ విషయంలో తన తండ్రిని ఎదిరించి మాట్లాడటం మొదలుపెట్టిందట. అప్పుడు ఆమె మీద తన తండ్రి దాడి చేసేవాడని కూడా ఆమె వెల్లడించింది. తన తండ్రి తనతో ఇలాగా ప్రవర్తిస్తున్నాడని చెబితే కుటుంబంలో తల్లి సహా ఇతర కుటుంబ సభ్యులు తిడతారేమో అని భయపడిందట. ఎందుకంటే ఆమె తల్లి తన భర్తను దేవుడిగా భావించేదట. అందుకే కుష్బూ ఒకానొక సమయంలో ఈ విషయం చెప్పినా కూడా ఆమె తల్లి ఈ విషయం నమ్మలేదట.

Actress Kushboo Sundar Reveals How She Faced Sexual Harassment From Father News Goes Viral

భర్త సుందర్ సి బిజీ బిజీ...:ఇక తల్లి కూడా తనను పట్టించుకోవడంలేదని భావించి ఎట్టకేలకు తానే తన తండ్రికి ఎదురు తిరిగి బుద్ధి చెప్పడంతో ఆ పని చేయడం మానేశాడట. తర్వాత ముంబై నుంచి చెన్నై వచ్చి సినీ రంగంలో ఆమె సినీ నటిగా మారి తనదైన శైలిలో నటించడం మొదలుపెట్టింది. ఆమె తర్వాత సుందర్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. ఆయన ఓ సిినిమా డైరెక్టర్. పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక కుష్భు ప్రస్తుతానికి బిజెపిలో చాలా యాక్టివ్ గా పని చేస్తున్నారు. రాబోతున్న ఎన్నికలకు సంబంధించి ఆమె ప్రచారకర్తగా కూడా చాలా చోట్ల నుంచి ప్రచారం చేసే అవకాశం కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X