పొట్టి బట్టల్లో మంచు లక్ష్మి అందాల ధగధగలు.. ఆమెనిలా ఎప్పుడైనా చూశారా?
మంచు లక్ష్మి ప్రసన్న.. తెలుగు రాష్ట్రాల్లోని జనాలకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. దీనికి కారణం ఈ అమ్మడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు కావడమే. దీనికితోడు ఈ భామ సుదీర్ఘ కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన చిత్రాలతో సందడి చేస్తోంది.
నిర్మాతగా, నటిగా ఎన్నో సినిమాలతో వచ్చిన మంచు లక్ష్మి.. ఇప్పుడు కూడా ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఈ స్టార్ డాటర్ తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మంచు లక్ష్మి కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి మరి!

స్టార్ డాటర్‌గా పరిచయం
టాలీవుడ్‌లో కొన్ని ఫ్యామిలీలు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాయి. అందులో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుటుంబం ఒకటన్న విషయం తెలిసిందే. చాలా కాలంగా సినీ రంగంలో సత్తా చాటుతోన్న ఆయన.. తన పిల్లలను కూడా సినిమాల్లోకి తీసుకొచ్చారు. అలానే మంచు లక్ష్మి ప్రసన్న వెండితెరపైకి వచ్చారు. ఈ రంగంలో ప్రత్యేకతను చాటుకుంటోంది.

హాలీవుడ్‌లోనే మొదలెట్టి
తెలుగులో నటిగా పరిచయం అవడానికి ముందే మంచు లక్ష్మి 'ద ఓడ్' అనే ఇంగ్లీష్ ఫిల్మ్‌తో పరిచయమైంది. ఆ తర్వాత 'డియర్ ఎయిర్' అనే మూవీలోనూ చేసింది. అదే ఏడాది నిర్మాతగానూ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. సరిగ్గా అప్పుడే 'లక్ష్మి టాక్ షో' అనే ప్రోగ్రామ్‌తో బుల్లితెరపైకీ ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఆరంభంలోనే ఆల్‌రౌండర్‌గా అనిపించుకుంది.

తెలుగులో ఆ చిత్రాలతో
'అనగనగా ఓ ధీరుడు' అనే సినిమాతో మంచు లక్ష్మి తెలుగులో నటిగా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఏకంగా ఇందులో నెగెటివ్ రోల్ చేసిన ఈమె.. మొదటి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత 'గుండెల్లో గోదారి'లో అద్భుతమైన నటనతో అవార్డులను దక్కించుకుంది. అలా సుదీర్ఘమైన కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా పేరు బాగానే దక్కింది.

ఇప్పుడు ఆ సినిమాలు
ఆరంభంలో నిర్మాతగా సందడి చేసిన మంచు లక్ష్మి.. ఆ తర్వాత సినీ నటిగానూ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలోనే బుల్లితెరపైకి సైతం ఎంట్రీ ఇచ్చి ఎన్నో కార్యక్రమాలను చేసింది. అంతేకాదు, ఈ మధ్య కాలంలో పలు వెబ్ సిరీస్‌లలోనూ నటించింది. ఇప్పుడు మంచు లక్ష్మి 'అగ్ని నక్షత్రం', 'ఆదిపర్వం' సహా పలు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.
సోషల్ మీడియాలో ఫుల్
ఏకధాటిగా సినిమాలు, షోలు చేస్తూ తీరిక లేకుండా ఉంటోన్నా.. మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ విశేషాలను కూడా షేర్ చేసుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

హాట్ ట్రీట్‌తో కవ్విస్తూనే
టాలీవుడ్‌లోని చాలా మంది నటీమణులతో పోల్చుకుంటే సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉండే మంచు లక్ష్మి.. అప్పుడప్పుడూ అందాల విందు కూడా చేస్తూ రచ్చ చేస్తోంది. అలాగే, బుల్లి బట్టలతో దిగిన ఫొటోలను, వీడియోలను సైతం ఇంటర్నెట్‌లో షేర్ చేసుకుంటోంది. వీటిలో చాలా వరకూ అందాలు మొత్తం ఆరబోస్తూ దిగిన వాటితో ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

మంచు లక్ష్మి పిక్స్ వైరల్
మంచు లక్ష్మి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె స్లీవ్‌లెస్ టాప్‌తో పాటు షార్ట్ ధరించి కనిపించింది. అలాగే, టెంప్ట్ చేసేలా ఫోజులు కూడా ఇచ్చింది. ఫలితంగా మంచు లక్ష్మి అందాలు కుర్రకారును తెగ రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చి.. అన్నీ ఫుల్ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











