మతి పోగొట్టేలా మంచు లక్ష్మి గ్లామర్ షో.. ఆమెనిలా ఎప్పుడూ చూసుండరు!

టాలీవుడ్‌లో చాలా మంది స్టార్లు వాళ్లు పిల్లలను సినిమాల్లోకి పరిచయం చేశారు. అందులో చాలా మంది హీరోలుగా ఎంట్రీ ఇవ్వగా.. కొందరు మాత్రమే హీరోయిన్లుగా వచ్చారు. అలాంటి వారిలో మంచు మోహన్ బాబు కుమార్తె లక్ష్మి ఒకరు. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చిన ఈ భామ.. ఆరంభంలోనే తనదైన నటన, గ్లామర్‌తో ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుంది. తద్వారా ఎన్నో అవకాశాలను అందుకుని సత్తా చాటింది. అయితే, ఇప్పుడు స్క్రీన్‌పై కనిపించకున్నా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. అలా ఇప్పుడు కొన్ని ఫొటోలు వదిలింది. అవి మీకోసమే!

పెద్ద సపోర్టుతోనే పరిచయం:తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని ఫ్యామిలీలు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాయి. అందులో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుటుంబం ఒకటి. చాలా కాలంగా సినీ రంగంలో సత్తా చాటుతోన్న ఆయన.. తన పిల్లలను కూడా సినిమాల్లోకి తీసుకొచ్చారు. అలానే మంచు లక్ష్మి ప్రసన్న వెండితెరపైకి వచ్చారు. ఈ రంగంలో ప్రత్యేకతను చాటుకుని దూసుకుపోతోంది.

Actress Lakshmi Manchu Latest Stunning Pics Goes Viral

ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి:వాస్తవానికి తెలుగులో నటిగా ఎంట్రీ ఇవ్వడానికి ముందే మంచు లక్ష్మి 'ద ఓడ్' అనే ఇంగ్లీష్ ఫిల్మ్‌తో పరిచయమైంది. ఆ తర్వాత 'డియర్ ఎయిర్' అనే మూవీలోనూ చేసింది. అదే ఏడాది నిర్మాతగానూ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. సరిగ్గా అప్పుడే 'లక్ష్మి టాక్ షో' అనే ప్రోగ్రామ్‌తో బుల్లితెరపైకీ ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఆరంభంలోనే తన టాలెంట్లను నిరూపించుకుంది.

తక్కువ చిత్రాలకే గుర్తింపు:మంచు లక్ష్మి 'అనగనగా ఓ ధీరుడు' అనే సినిమాతో తెలుగులో నటిగా ప్రయాణాన్ని మొదలెట్టింది. ఏకంగా ఇందులో నెగెటివ్ రోల్ చేసిన ఈమె.. మొదటి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత 'గుండెల్లో గోదారి'లో అద్భుతమైన నటనతో అవార్డులను దక్కించుకుంది. అలా సుదీర్ఘమైన కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా.. గుర్తింపును అందుకుంది.

Actress Lakshmi Manchu Latest Stunning Pics Goes Viral

అన్నింట్లో.. ఇప్పుడు అవే:మొదట్లోనే నిర్మాతగా మారిన మంచు లక్ష్మి.. ఆ తర్వాత సినీ నటిగానూ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలోనే బుల్లితెరపైకి సైతం ఎంట్రీ ఇచ్చి ఎన్నో కార్యక్రమాలను చేసింది. అంతేకాదు, ఈ మధ్య కాలంలో పలు వెబ్ సిరీస్‌లలోనూ నటించింది. ఇప్పుడు మంచు లక్ష్మి 'అగ్ని నక్షత్రం' సహా కొన్ని సినిమాల్లో నటిస్తోంది. ఇలా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.

సోషల్ మీడియాలో బిజీ:వరుసగా సినిమాలు, షోలు చేసినా చేయకున్నా.. మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలతో పాటు కెరీర్‌ విశేషాలను కూడా షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. తద్వారా నిత్యం వార్తల్లోనే ఉంటూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

Actress Lakshmi Manchu Latest Stunning Pics Goes Viral

అందాలను ఆరబోస్తోంది:చాలా మంది నటీమణులతో పోల్చుకుంటే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మంచు లక్ష్మి.. అప్పుడప్పుడూ అందాల విందు కూడా చేస్తూ రచ్చ చేస్తోంది. అలాగే, బుల్లి బట్టలతో దిగిన ఫొటోలను, వీడియోలను సైతం ఇంటర్నెట్‌లో షేర్ చేసుకుంటోంది. వీటిలో చాలా వరకూ అందాలు మొత్తం ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. దీంతో లక్ష్మి తరచూ ట్రెండ్ అవుతోంది.

మంచు లక్ష్మి పిక్స్ వైరల్:తాజాగా మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె జాకెట్‌ను తీసేసి ఇన్నర్స్‌తోనే కనిపించింది. అలాగే, టెంప్ట్ చేసేలా ఫోజులు కూడా ఇచ్చింది. ఫలితంగా ఆమె అందాలు కుర్రకారును తెగ కవ్విస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో ఇవన్నీ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X