Lakshmi Manchu హాట్ సెల్ఫీ వైరల్.. మీరెప్పుడూ చూడని గ్లామర్ ట్రీట్!
చాలా ఇండస్ట్రీల మాదిరిగానే తెలుగులో కూడా ఎంతో మంది స్టార్లు తమ వారసులను సినిమాల్లోకి పరిచయం చేశారు. అలాంటి వారిలోనూ కొందరు మాత్రమే సక్సెస్ కాగా.. మరికొందరు సరైన బ్రేక్ కోసం ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు. వారిలో మంచు లక్ష్మి ఒకరు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకుంది. అదే సమయంలో నటిగా, నిర్మాతగా, యాంకర్‌గా ఇలా సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తోంది. సోషల్ మీడియాలో తాజాగా లక్ష్మి సెల్ఫీలను వదిలింది. వాటిని మీరే చూడండి!

బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే
సినీ రంగంలో సుదీర్ఘ కాలంగా విశేషమైన సేవలు అందిస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఆయన తన పిల్లలను కూడా సినిమాల్లోకి తీసుకొచ్చారు. మంచు మనోజ్, మంచు విష్ణు ఎప్పుడో సినిమా హీరోలుగా ప్రయాణాన్ని మొదలు పెట్టగా.. వాళ్లతో పాటే మంచు లక్ష్మి కూడా ఇండస్ట్రీలోకి పరిచయం అయింది.

అక్కడ ఎంట్రీ.. ఇక్కడ కూడా
తెలుగులో నటిగా పరిచయం అవడానికి ముందే మంచు లక్ష్మి 'ద ఓడ్' అనే ఇంగ్లీష్ ఫిల్మ్‌తో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'డియర్ ఎయిర్' అనే మూవీలోనూ చేసింది. అదే ఏడాది నిర్మాతగానూ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. సరిగ్గా అప్పుడే 'లక్ష్మి టాక్ షో' అనే ప్రోగ్రామ్‌తో బుల్లితెరపైకీ ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఒకేసారి తనలోని మూడు యాంగిల్స్ చూపించింది.

తక్కువ సినిమాలే చేసింది
'అనగనగా ఓ ధీరుడు' అనే సినిమాతో మంచు లక్ష్మి తెలుగులో నటిగా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఏకంగా ఇందులో నెగెటివ్ రోల్ చేసిన ఈమె.. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత 'గుండెల్లో గోదారి'లో అద్భుతమైన నటనతో అవార్డులను అందుకుంది. అలా సుదీర్ఘమైన కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా.. గుర్తింపును బాగానే వచ్చింది.

అన్నింట్లోనూ ఉంటూ రచ్చ
ఆరంభంలో నిర్మాతగా మారిన మంచు లక్ష్మి.. ఆ తర్వాత సినీ నటిగానూ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలోనే బుల్లితెరపైకి సైతం ఎంట్రీ ఇచ్చి ఎన్నో కార్యక్రమాలను చేసింది. అంతేకాదు, ఈ మధ్య కాలంలో పలు వెబ్ సిరీస్‌లలోనూ నటించింది. ఇలా వీలైనన్ని ఎక్కువ వాటిలో నటిస్తూ ప్రేక్షకులకు మజాను పంచుతోంది. ఇలా అన్ని చోట్లా కనిపిస్తూ హవా చూపిస్తోంది.

సోషల్ మీడియాలో బిజీగానే
వరుసగా సినిమాలు, షోలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ విశేషాలను కూడా షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. తద్వారా నిత్యం వార్తల్లోనే ఉంటూ క్రేజ్ రెట్టింపు చేసుకుంటోంది.

అందాలను ఆరబోస్తోందిగా
సోషల్ మీడియాలో మిగిలిన వాళ్లతో పోలిస్తే ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మంచు లక్ష్మి.. అప్పుడప్పుడూ అందాల విందు కూడా చేస్తూ రచ్చ చేస్తోంది. అలాగే, బుల్లి బట్టలతో దిగిన ఫొటోలను, వీడియోలను సైతం ఇంటర్నెట్‌లో షేర్ చేసుకుంటోంది. వీటిలో చాలా వరకూ అందాలు మొత్తం ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు తెగ హైలైట్ అవుతూ ఉంటోంది.

మంచు లక్ష్మి సెల్ఫీలు వైరల్
మంచు లక్ష్మి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని సెల్ఫీలను షేర్ చేసింది. వీటిలో ఆమె స్ట్రాప్‌లెస్ టాప్‌ను ధరించి కనిపించింది. అలాగే, టెంప్ట్ చేసేలా ఫోజులు కూడా ఇచ్చింది. ఫలితంగా ఆమె అందాలు తెగ కనువిందు చేస్తోన్నాయి. ఫలితంగా ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవన్నీ ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











