ఆర్టికల్ 370 రద్దుపై తెలుగు హీరోయిన్ లావణ్య త్రిపాఠి రియాక్షన్ ఇదీ..

కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లు కేంద్ర కేబినెట్‌లో ఆమోదం పొందిన వెంటనే రాష్ట్రప‌తి ఆమోదం పొందుతూ గ‌జెట్ విడుద‌లైంది. దీంతో 70 ఏళ్లుగా కశ్మీర్ విషయంలో కొనసాగుతున్న ప్ర‌తిప‌త్తి ర‌ద్ద‌యినట్లయింది.

ఇప్పటి వరకు ఒకే రాష్ట్రంగా ఉన్న జమ్ము అండ్ కాశ్మీర్.... ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత మూడు(జమ్ము, కశ్మీర్‌, లద్దాక్‌) ప్రాంతాలుగా విడిపోయింది. జమ్ము, కశ్మీర్‌లు అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుకాగా, లద్దాక్‌‌ను అసెంబ్లీ లేని యూనియన్ టెర్రీటరీగా ప్రకటించారు.

 Actress Lavanya Lripathi tweet on Article 370 abrogation

అయితే ఆర్టికల్‌ 370 రద్దుపై దేశ వ్యాప్తంగా మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు ఈ చర్యను వ్యతిరేకిస్తుండగా, ఇండియా వైడ్ మెజారిటీ ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. తాజాగా ఆర్టికల్‌ 370 రద్దుపై నటి లావణ్య త్రిపాఠి కూడా స్పందించారు. ఇలా చేయడం సంతోషంగా ఉందని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గర్వకారణం అంటూ ట్వీట్ చేశారు.

లావణ్య త్రిపాఠి సినిమాల విషయానికొస్తే... అందాల రాక్షసి సినిమా ద్వారా టాలీవుడ్లో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ నార్తిండియా బ్యూటీ తెలుగులో వరుస సినిమాలు చేస్తూ హైదరబాద్‌లో సెటిలైంది. గతేడాది ఇంటిలిజెంట్, అంతరిక్షం చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఆమె నటించిన అర్జున్ సురవరం విడుదలకు సిద్ధంగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X