మెగా కోడలు అందాల ఆరబోత.. ఇన్నర్‌లోనే ఊహించని విధంగా షో
తెలుగు సినిమా పరిశ్రమలో కొందరు హీరోయిన్లు క్యూట్ లుక్స్‌తో మాయ చేయడంతో పాటు క్లీన్ ఇమేజ్‌తో సత్తా చాటారు. అలాంటి వారిలో లావణ్య త్రిపాఠి ఒకరు. ఆరంభంలోనే అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ భామ.. వరుసగా ఆఫర్లను దక్కించుకుంది. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగుతోంది. ఇక, వరుణ్ తేజ్‌తో వివాహం తర్వాత కూడా తనదైన ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. ఇక, తాజాగా లావణ్య సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. మరి ఏమాత్రం లేట్ లేకుండా వాటిని మీరే చూసేయండి!

అందాల రాక్షసిగా ఎంట్రీ
సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి 'అందాల రాక్షసి' అనే సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అయింది. అందులో అత్యుత్తమ నటనతో మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈమె.. చాలా తక్కువ సమయంలోనే పాపులారిటీ సంపాదించుకుంది. దీని తర్వాత 'దూసుకెళ్తా', 'భలే భలే మగాడివోయ్', 'సోగ్గాడే చిన్న నాయన' వంటి చిత్రాలతో హిట్లు అందుకుంది.
వరుస ఫ్లాపులతో కష్టాలు
ఆరంభంలో మంచి హిట్లను ఖాతాలో వేసుకున్న లావణ్య త్రిపాఠి.. ఆ తర్వాత ఎన్నో పరాజయాలను చవి చూసింది. దీంతో వరుస పరాజయాలతో కెరీర్ ముగిసిపోతుందనుకున్న సమయంలో 'అర్జున్ సురవరం' అనే సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న లావణ్య త్రిపాఠి.. ఆ తర్వాత మళ్లీ కొన్ని ఫ్లాపులను చూసింది. దీంతో ఆమె కెరీర్ ఆశించిన రీతిలో సాగలేదు.

మెగా కోడలిగా మారింది
క్యూట్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గత ఏడాదిలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చాలా కాలం పాటు ఎంతో రహస్యంగా ప్రేమాయణం సాగించిన వీళ్లిద్దరూ.. పెద్దలను ఒప్పించి అగ్నిసాక్షిగా ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత కూడా లావణ్య కెరీర్‌ను కంటిన్యూ చేస్తోంది. ఇప్పటికే ఆమె పలు ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెట్టేసుకుంది.
సిరీస్‌లతోనూ వస్తుంది
గతంలో మాదిరిగా హీరోయిన్ అవకాశాలు రాకపోవడంతో లావణ్య త్రిపాఠి వెబ్ సిరీస్‌లు, లేడీ ఓరియెంటెడ్ మూవీలు చేస్తోంది. ఇలా 2022లో ఆమె ప్రధాన పాత్రలో 'హ్యాపీ బర్త్‌డే' అనే సినిమాలో నటించింది. ఇప్పుడు 'థునాల్' అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ముఖ్యంగా లావణ్య ఇటీవలి కాలంలోనే 'పులి మేక', 'మిస్ పర్‌ఫెక్ట్' అనే వెబ్ సిరీస్‌లతో అలరించింది.

అందులో యమా బిజీ
గతంలో ఏకధాటిగా ప్రాజెక్టులు చేసినప్పటికీ.. ఈ మధ్య కాలంలో చేతి నిండా సినిమాలు లేకపోయినా.. లావణ్య త్రిపాఠి మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన సినీ, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా తన ఫాలోవర్లను క్రమంగా పెంచుకుంటూ లావణ్య దూసుకుపోతూనే ఉంది.
గ్లామర్ షో కాస్త దూరం
సోషల్ మీడియాలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి సుదీర్ఘ కాలంగా సందడి చేస్తూనే ఉంటోంది. మిగిలిన హీరోయిన్లతో పోల్చుకుంటే ఇందులో ఆమె అందాల ఆరబోత తక్కువగానే చేస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో ఆమె అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది.

లావణ్య పిక్స్ వైరల్‌గా
క్యూట్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె సరికొత్త లుక్‌తో ఇన్నర్‌లోనే కొన్ని ఫొటోలను దిగింది. పైగా వీటిలో తన అందచందాలను చూపిస్తూ కుర్రాకారును హుషారెత్తిస్తోంది. దీంతో లావణ్య త్రిపాఠి తాజాగా షేర్ చేసిన ఈ ఘాటు ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది.


Click it and Unblock the Notifications











