కోట్ల సంపద ఉన్న భర్తకు దూరంగా... విడాకులపై లయ షాకింగ్ కామెంట్స్
ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విడాకుల వ్యవహారాలు ఎక్కువయ్యాయి. ఎప్పుడు ఎవరు బాంబు పేలుస్తారో తెలియక సినీ వర్గాలు, వారి అభిమానులు టెన్షన్ పడుతున్నారు. నిత్యం ఎవరో ఒక స్టార్ విడాకుల గురించి సోషల్ మీడియాలో గాసిప్స్ వస్తున్నాయి. వీటిలో కొన్ని నిజం ఉంటుండగా.. మరికొన్ని మాత్రం గాలివార్తలే. నిన్న మొన్నటి వరకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ విడాకుల వ్యవహారం సౌత్‌లో చర్చనీయాంశమైంది. తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లయ గురించి గాసిప్స్ వస్తుండటంతో ఆమె స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే..
క్లాసికల్ డ్యాన్సర్, చెస్ ప్లేయర్
తన అందం, చిరునవ్వుతో కొన్నేళ్లపాటు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసిన లయ పెళ్లి చేసుకుని ఫ్యామిలీతో అమెరికాలో సెటిలయ్యారు. అయితే చాలా మంది సీనియర్ హీరోయిన్లు తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడంతో ఆమె కూడా ఓ రాయి వేసి చూద్దామని ట్రై చేస్తున్నారు. 21 అక్టోబర్ 1981న విజయవాడలో జన్మించారు లయ. ఆమెలో ఒక చెస్ క్రీడాకారిణి, ఓ డ్యాన్సర్ ఉన్నారు. చిన్న వయసులోనే దాదాపు 50కి పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చి శెభాష్ అనిపించుకున్నారు.

స్వయంవరం సినిమాతో ఎంట్రీ
అయితే చదువును మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఎంసీఏ పూర్తి చేశారు. తొలుత 1992లో భద్రం కొడుకో అనే సినిమాలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన లయ ఏడేళ్లు తిరిగే సరికి 1999లో స్వయంవరం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. తన క్యూట్ స్మైల్, అందానికి అప్పట్లో కుర్రాళ్లు పరవశించిపోయారు. స్వయంవరం సినిమా హిట్ కావడంతో లయకు అవకాశాలు క్యూకట్టాయి. మా బాలాజీ, మనోహరం, మనసున్న మారాజు, కోదండ రాముడు, హనుమాన్ జంక్షన్, ప్రేమించు, శివరామరాజు, నీ ప్రేమకై, మిస్సమ్మ, విజయేంద్ర వర్మ, అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా తదితర చిత్రాలలో నటించారు.
అఖండ 2లో లయ కూతురు
కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే అమెరికాకు చెందిన ఓ ఎన్ఆర్ఐ డాక్టర్‌ను పెళ్లాడిన లయ అనంతరం అక్కడే స్థిరపడ్డారు. ఈ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె. దాదాపు పదేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న లయ 2018లో రవితేజ హీరోగా వచ్చిన అమర్ అక్బర్ అంటోనీతో తెలుగువారిని మరోసారి పలకరించారు. తన కుమార్తె శ్లోకాను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు లయ సన్నాహాలు చేస్తున్నారు. బాలకృష్ణ - బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అఖండ 2లో లయ కూతురు ఆఫర్ కొట్టేసిందని టాక్. ప్రస్తుతం నితిన్ హీరోగా వస్తున్న తమ్ముడు సినిమాలో లయ కీలకపాత్ర పోషించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అందుకే భర్తకు దూరంగా
టాలీవుడ్‌లో అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న దశలో లయ గురించి సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ముఖ్యంగా లయ తన భర్త నుంచి విడాకులు తీసుకోబోతున్నారని? ఆమెకు వేలకోట్ల ఆస్తులు ఉన్నాయంటూ రూమర్స్ వైరల్ అయ్యాయి. దీనిపై ఓ ఇంటర్వ్యూలో లయ క్లారిటీ ఇచ్చారు. తన భర్తకు అమెరికాలో క్లినిక్స్ ఉన్నాయని.. తమ కుటుంబంలో అందరూ డాక్టర్సేనని తనకు వేలకోట్లు లేకపోవచ్చు కానీ ఏం కావాలన్నా క్షణాల్లో కొనగలనని పేర్కొన్నారు. భర్త అమెరికాలో, నేను ఇండియాలో ఉండటం వల్లే తామిద్దరం విడిపోయామని, విడాకులు తీసుకున్నామని వార్తలు వస్తున్నాయని కానీ వీటిలో ఎలాంటి వాస్తవాలు లేవని లయ వెల్లడించారు. ఆమె క్లారిటీతోనైనా ఈ పుకార్లకు ఇంతటితో చెక్ పడుతుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











