యూఎస్‌లో గిన్నెలు తోముతారా? .. స్టార్ హీరోయిన్‌కు ఎయిర్‌పోర్ట్‌లో ఘోర అవమానం
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే గగనం. ఎవరో కొందరికే ఆ అదృష్టం లభిస్తుంది. అలాంటి వారిలో ఒకరు లయ. 90వ దశకం చివరిలో తన అందం, క్యూట్ లుక్స్, నటనతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ రేసులో దూసుకొచ్చారు బెజవాడ అమ్మాయి లయ. చూడటానికి పక్కింటి పిల్లలా కనిపించే లయ కొన్నేళ్లపాటు వరుస బ్లాక్ బస్టర్స్‌తో హవా చూపించారు. కానీ అనూహ్యంగా పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిలయ్యారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత తిరిగి మాతృభూమిపై అడుగుపెట్టిన ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌లో దుమ్ములేపాలని భావిస్తున్నారు.
తొలుత డ్యాన్సర్‌గా ఎన్నో వేదికలపై ప్రదర్శనలిచ్చారు లయ. ఈ క్రమంలో ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా అందుకున్నారు. అలాగే ఓ ఆమె ప్రొఫెషనల్ చెస్ ప్లేయర్ కూడా. తర్వాత నటన వైపు వెళ్లిన స్టార్ స్టేటస్ చూసిన తెలుగు అమ్మాయిల్లో ఒకరు. ఏడాదికి కనీసం నాలుగు సినిమాలు చేస్తూ దశాబ్ధకాలం పాటు యువతకు గిలిగింతలు పెట్టారు. తొలుత వేణు తొట్టెంపూడి హీరోగా వచ్చిన స్వయంవరం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన లయ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు లయ ఫేవరేట్‌గా మారిపోయారు. ప్రేమించు, మనోహారం, మిస్సమ్మ, విజయేంద్రవర్మ, టాటా బిర్లా మధ్యలో లైలా వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో ఆమె రేంజ్ మారిపోయింది. కళ్లతోనే భావాలు పలికించగల నటీమణుల్లో ఒకరిగా లయ గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోయిన్‌గా అవకాశాలు వస్తున్న టైంలోనే అనూహ్యంగా పెళ్లి చేసుకుని భర్తతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు లయ. అక్కడ ఐటీ ఉద్యోగంతో పాటు డ్యాన్స్ స్కూల్ కూడా పెట్టి సక్సెస్‌ఫుల్‌గా నడిపించారు.
కరోనా , లాక్‌డౌన్ కారణంగా స్కూల్ మూసేసి సోషల్ మీడియాలో రీల్స్, డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ హల్ చల్ చేశారు. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పాటు లయ పేరు మళ్లీ తెలుగు నాట వినిపించింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ల్యాండ్ అవ్వాలని ఫిక్స్ అయినా ఆమె చలో ఇండియా అన్నారు. దాదాపు రెండు దశాబ్ధాల విరామం తర్వాత టాలీవుడ్‌లో లయ రీ ఎంట్రీ ఇస్తున్నారు. నితిన్ హీరోగా వస్తున్న మూవీలో ఆమె కీలకపాత్ర పోషిస్తున్నారు.
అయితే లయ అమెరికా నుంచి ఇండియా వస్తున్న క్రమంలో ఎయిర్‌పోర్ట్‌లో ఘోర అవమానాన్ని ఎదుర్కొన్నారట. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు పంచుకున్నారు. అమెరికా నుంచి ఇండియాలోని ఓ ఎయిర్‌పోర్ట్‌లో దిగామని.. కస్టమ్స్ చెకింగ్‌లో భాగంగా ఫింగర్ ప్రింట్ పడలేదని చెప్పారు. తన చేతులు డ్రైగా ఉండటాన్ని గమనించిన కస్టమ్స్ ఆఫీసర్ శానిటైజర్ వేసుకుని ఓ 15 నిమిషాల పాటు కుస్తీ పడిన తర్వాత ఓకే అయ్యిందని లయ తెలిపారు. తాను బయల్దేరబోతుండగా .. మీరు అమెరికాలో గిన్నెలు బాగా తోముతారా? మీ హ్యాండ్స్ అంత డ్రైగా ఉన్నాయని ప్రశ్నించడంతో తాను షాకయ్యానని లయ్య చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











