twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బూతులు తిడుతున్నారు.. నన్ను అల్లరి చేయడం ఎందుకు?.. నటి లయ ఆవేదన

    |

    ఒకప్పుడు తెలుగు తెరపై హీరోయిన్‌గా తన సత్తా చాటిన లయ తర్వాత పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిలైన సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత 'అమర్ అక్బర్ ఆంటోనీ'లో ఓ చిన్న పాత్రలో మెరిసారు. ఈ సినిమాలో లయ కూతురు చైల్డ్ ఆర్టిస్టుగా నటించడం విశేషం.

    తాజాగా ఓ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ జీవితానికి అనుభవాలను లయ పంచుకున్నారు. అంతే కాదు... ఈ మధ్య తనను చాలా బాధించిన ఓ విషయాన్ని కూడా ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్న తీరుపై ఫైర్ అయ్యారు.

    నా మాట తీరే అంత

    నా మాట తీరే అంత

    ఈ మధ్య నేనొక ఇంటర్వ్యూ ఇచ్చా. అందులో నేను మాట్లాడే తెలుగు బాగోలేదని కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్‌లో రాశారు. కొన్నేళ్లుగా వేరే ప్రాంతంలో ఉంటున్నప్పుడు యాస మారడం సహజం. అయినా నా మాట తీరు అంత.

    కొందరు బూతులు తిడుతున్నారు

    కొందరు బూతులు తిడుతున్నారు

    ఇపుడు పర్ఫెక్ట్‌గా తెలుగు ఎంతమంది మాట్లాడుతున్నారు? ఆడియో ఫంక్షన్లలో ఎంతోమంది ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. బూతులు తిడుతున్నారు.. వాళ్లను ఎందుకు నిలదీయరు? అమ్మాయిలంటే అంత లోకువా? మనిషికో న్యాయమా? అంటూ లయ ప్రశ్నించారు.

    నా బతుకు నేను బతుకుతున్నా, అల్లరి చేయడం ఎందుకు?

    నా బతుకు నేను బతుకుతున్నా, అల్లరి చేయడం ఎందుకు?

    అమెరికాలో ఓ మూలన నా బతుకు నేను బతుకుతున్నా. నా భాష బాగోలేదంటూ పబ్లిక్‌ ప్లాట్‌ఫామ్‌ మీద నన్ను అల్లరి చేయడం ఎందుకు? నన్నే కాదు ఎంతో మంది అమ్మాయులను ఇలాగే అల్లరి చేస్తున్నారు.

    వాళ్లకు కూడా అమ్మ, అక్క, చెల్లి ఉంటారుగా...

    వాళ్లకు కూడా అమ్మ, అక్క, చెల్లి ఉంటారుగా...

    వాళ్లకు కూడా ఇంట్లో అమ్మ, అక్క, చెల్లి ఉంటారుగా. అలాంటి సందర్భంలో వాళ్లు గుర్తురారా? సోషల్‌ మీడియా వల్లే ఈ గోల అంతా. ఈ మధ్య ఈ పైత్యం మరింత శృతి మించుతోంది. ఇది సరైంది కాదు అని లయ అభిప్రాయ పడ్డారు.

    వ్యక్తిగా టార్గెట్ చేయడం సరికాదు

    వ్యక్తిగా టార్గెట్ చేయడం సరికాదు

    ఫ్యామిలీ ఫొటో ఫేస్‌బుక్‌లో పెట్టాలన్నా భయంగా ఉంటుంది. చిన్న పిల్లల్ని కూడా వదలడం లేదు. ఏదైనా సినిమాలో చేసినపుడు నటన బాగోకపోతే విమర్శించొచ్చు. వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్‌ చేయకూడదు. నేను ఎవర్నీ ఎప్పుడూ బాధపెట్టలేదు, నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డారంటే క్షమాపణలు చెప్పేరకం నేను. అలాంటి నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని లయ ఆవేదన వ్యక్తం చేశారు.

    English summary
    Actress Laya furious on youtube channels. Laya Gorty is a Telugu film actress and a Kuchipudi dancer. Her debut film as child actor is Bhadram Koduko in 1992. Later, she started as an actress with Telugu film Swayamvaram in 1999 along with another popular actor, Venu in 1999. She went on to act in about 60 movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X