నువ్వేంటి నాకు చెప్పేది.. నాకు ఆల్రేడీ తెలుసు అనే ఫీలింగ్
ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ.. కుటుంబ కథానాయికగా ప్రత్యేక గుర్తింపు పొందారు. తన సహజ నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. 1990-2000 మధ్యకాలంలో వరుస విజయాలతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా నిలిచింది. కూచిపూడి నర్తకిగా, జాతీయ స్థాయి చదరంగం క్రీడాకారిణిగా కూడా గుర్తింపు పొందిన లయ, సంప్రదాయ పాత్రల్లో నటిస్తూ కుటుంబ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ సంపాదించింది. బాలనటిగా 'భద్రం కొడుకో'సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె, తరువాత 'స్వయంవరం' సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం'ప్రేమించు', 'మనసున్న మారాజు', 'హనుమాన్ జంక్షన్', 'శివరామరాజు', 'అదిరిందయ్యా చంద్రం' వంటి సినిమాలతో విజయాలు అందుకుంది.
పెళ్లి తర్వాత లయ సినిమాలకు దూరమై అమెరికాలో స్థిరపడింది. కుటుంబ బాధ్యతలతో కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె ఇటీవల మళ్లీ నటనలోకి రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా 'తమ్ముడు' సినిమాతో తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చిన లయ, ఇప్పుడు 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని'అనే ఫ్యామిలీ థ్రిల్లర్‌లో నటుడు శివాజీతో కలిసి కీలక పాత్రలో కనిపించింది. తన నటనతో మరోసారి తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. లయ కేవలం సినిమాలే కాదు, టీవీ కార్యక్రమాలు, రియాలిటీ షోల్లో పాల్గొంటూ బిజీబిజీగా మారింది. ఈ క్రమంలో హీరోయిన్ లయ కిస్సిక్ టాక్స్ అనే టాక్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది.

ఈ ఇంటర్వ్యూలో మహిళల డ్రెస్సింగ్‌పై యాంకర్ వర్ష అడిగిన ప్రశ్నకు లయ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఇటీవల షార్ట్ డ్రెస్సులు ధరించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, దీనిపై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించగా.. హీరోయిన్ లయ సమాధానం ఇస్తూ, 'మనకు అనుభవం ఉన్నవాళ్లు ఏదైనా సలహా ఇస్తే దాన్ని వినాలి. ఆ సలహాను అర్థం చేసుకుని పాటిస్తేనే దానికి విలువ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో చాలామందికి 'నువ్వేంటి నాకు చెప్పేది.. నాకు ఆల్రేడీ తెలుసు అనే ఫీలింగ్ ఉన్నారు. అలాంటి వాళ్లకు ఎంత చెప్పినా ఉపయోగం ఉండదు' అని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో నటుడు శివాజీ డ్రెస్సింగ్‌పై చేసిన కామెంట్ల వల్ల ఎదుర్కొన్న వివాదం గురించి కూడా వర్ష ప్రశ్నించింది. దీనిపై స్పందించిన లయ, 'ఎవరైనా ఒక విషయాన్ని చెబితే ముందుగా దాని వెనక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు చాలా మందిలో అర్థం చేసుకునే మనస్తత్వం కనిపించడం లేదు. వెంటనే విమర్శించడం లేదా తప్పుగా తీసుకోవడం జరుగుతోంది' అని చెప్పారు.
యువతలో పెరుగుతున్న లవ్ ఫెయిల్యూర్స్, ఆత్మహత్యల గురించి కూడా లయ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 'లవ్ ఫెయిల్యూర్ అనేది జీవితంలో చాలా సాధారణమైన విషయం. కానీ దానితోనే జీవితం ముగిసిపోయిందని భావించడం సరైంది కాదు. ఒక రిలేషన్‌షిప్ మనకు బాధ కలిగిస్తే దానిని వదిలేసి ముందుకు సాగాలి. జీవితం చాలా పెద్దది, అవకాశాలు ఎన్నో ఉంటాయి' అని యువతకు సూచించారు.
అలాగే సినీ పరిశ్రమలో ఎవరైనా మీకు ఇబ్బందులు కలిగించారా అని అడిగిన ప్రశ్నకు లయ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తన కెరీర్‌లో కొన్ని కష్టకాలాలు ఎదురైనా, ప్రతిసారి ఏదో ఒక శక్తి తనను కాపాడినట్టు అనిపించేదని చెప్పారు. 'నాకు సమస్యలు వచ్చే సమయంలో ఎవరో ఒక అజ్ఞాత శక్తి నన్ను కాపాడుతున్నట్టు అనిపించేది. అది ఏమిటో ఇప్పటికీ నాకు తెలియదు. కానీ ఆ శక్తి వల్లనే నేను చాలా సమస్యల నుంచి బయటపడ్డాను' అని లయ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











