ఆ హీరోతో అలాంటి ఇబ్బంది.. ఒక్కో యాంగిల్‌లో అలా... బయటపెట్టిన హీరోయిన్ లయ
సీనియర్ హీరోయిన్ లయ నటించిన స్వయం వరం మూవీ అందరికీ ఇంకా గుర్తుండే ఉంటుంది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ చేస్తున్న సమయంలో తాను చాలా ఇబ్బందులు పడ్డాను అని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది లయ. మరి ఇంతకీ స్వయం వరం మూవీ సెట్స్ లో ఆమెను అంతగా ఇబ్బంది పెట్టింది ఎవరు? అనే ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలుసుకుందాం పదండి.
వేణు తొట్టెంపూడి, లయ హీరో హీరోయిన్లుగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ స్వయం వరం. కే విజయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 1999 ఏప్రిల్ 22న రిలీజ్ అయింది. ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ శ్యామ్ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో అప్పట్లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది.

ఆ మూవీ రిలీజ్ అయ్యి ఇప్పటికి దాదాపు 25 ఏళ్ళు పూర్తి అయిపోయాయి. కానీ అందులో ఉన్న పాటలు ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ కు ఎవర్ గ్రీన్ సాంగ్స్ అని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ తర్వాత లయ కెరీర్ పూర్తిగా మారిపోయింది. వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి.
అయితే తనకు లైఫ్ ఇచ్చిన స్వయం వరం మూవీ సెట్స్ లో లయ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందట. అది కూడా హీరో కారణంగా. ఈ విషయాన్ని స్వయంగా లయ తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.
పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇచ్చి విదేశాల్లో సెటిల్ అయిన లయ ప్రస్తుతం రీ ఎంట్రీకి రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలోనే జరిగిన ఇంటర్వ్యూలో స్వయం వరం సినిమాకు సంబంధించిన విశేషాలను మరోసారి గుర్తు చేసుకుంది ఈ బ్యూటీ.
అప్పట్లో ఈ సినిమా కోసం వేరే అమ్మాయిని అనుకున్నారని, కానీ ఆ తర్వాత తనని చూసి సెలెక్ట్ చేశారని చెప్పుకొచ్చింది లయ. అయితే సినిమాను ఒప్పుకున్నాక మాత్రం హీరోతో వచ్చిన హైట్ సమస్య కారణంగా తాను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందట. సినిమా చేస్తున్నంత సేపు ప్రతి సీన్లోనూ స్టూల్ ఉపయోగించే వారట.

హీరో వేణు బాగా హైట్ ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే లయ హైట్ తక్కువగా ఉండడంతో ఆయన హైట్ ను మ్యాచ్ చేయడానికి ఒక్కో కెమెరా యాంగిల్ లో ఒక్కో హైట్ ఉన్న స్టూల్ లో ఉపయోగించే వారట. సినిమా షూటింగ్ అనగానే అబ్బా మళ్ళీ స్టూల్ ఎక్కాలి, ఏంటి అసలు ఏదో స్కూల్లో తప్పు చేసి బెంచ్ మీద నిలబడ్డట్టుగా అనే ఫీలింగ్ వచ్చేదట లయకు.
షూటింగ్ జరిగినన్నాళ్లు ఇదే ఫీలింగ్ తో ఉండేదట లయ. ఇక షూటింగ్ అయిపోగానే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుందుట. హమ్మయ్య ఇకపై స్టూల్ ఎక్కాల్సిన పనిలేదు అని సంతోష పడిందట ఈ బ్యూటీ. స్వయం వరం సినిమా షూటింగ్ సెట్స్ లో తనకు జరిగిన అనుభవమని ఫన్నీగా బయట పెట్టింది లయ. ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారిన ఈ బ్యూటీ మళ్ళీ సినిమాలు చెయ్యడానికి రెడీగా ఉంది.


Click it and Unblock the Notifications











