Don't Miss!
- Finance Loan Fraud: మహీంద్రా ఫైనాన్స్ కంపెనీలో రూ.150 కోట్ల మోసం.. స్టాక్ ఢమాల్..
- News పవన్ నామినేషన్ ర్యాలీలో పాల్గొనబోయే టాలీవుడ్ సెలెబ్రిటీలు వీళ్లే..!!
- Automobiles ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్‌లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
- Technology Realme నుంచి కొత్త ఫోన్ Realme Narzo 70 5G లాంచ్ రేపే! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports హార్దిక్ పనైపోయింది- ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
వాళ్ల డబ్బు బలం ముందు నేనెంత? అందుకే ధైర్యం చేయలేదు: మాధవిలత
నన్ను ప్రేమించకుంటే నీపై యాసిడ్ పోస్తాను, చంపేస్తాను, నాకు దక్కని నువ్వు ఎవరికీ దక్కొద్దు లాంటి కొంత మంది శాడిస్టుల గురించిన వార్తలు మనం తరచూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. తెలుగు నటి మాధవిలత జీవితంలో కూడా ఇలాంటి శాడిస్ట్ ఒకడు ఉన్నాడు. అతడి వల్ల కొన్నేళ్ల పాటు ఆమె నరకం అనుభవించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాధవిలత ఇందుకు సంబంధించిన విషయాలు వెల్లడించారు. అతడి మూలం నేను మాత్రమే కాదు, తన కుటుంబం కూడా అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చిందని తెలిపారు.
పవన్ చేస్తే మీకేం నొప్పి.. మీరు పీకడానికి? పర్సనల్ లైఫ్ వద్దు.. మాధవీలత వార్నింగ్
ఎవరు అతడు?
మా నాన్న రైల్వే ఎంప్లాయ్. గతంలో బళ్లారి రైల్వే క్వార్టర్స్‌లో మేము ఉండేవారం. ఆ సమయంలో అతడు పరచయం అయ్యాడు. అతడితో రెండు నెలలు స్నేహం చేయడమే నేను చేసిన తప్పదు. అప్పటి నుంచి ప్రేమ పేరుతో నన్ను టార్చర్ చేయడం మొదలు పెట్టాడు అని మాధవిలత తెలిపారు.
సైకో నాకు రియల్ లైఫ్‌లో తాకాడు
నాకు అలాంటి ఉద్దేశ్యం లేదని చెప్పడంతో నన్ను ప్రేమించని నువ్వు ఎవరినీ ప్రేమించొద్దు నాకు దక్కని నువ్వు ఎవరికీ దక్కొద్దు అని వేధించడం మొదలు పెట్టాడు. చాలా సినిమాల్లో చూసే సైకో క్యారెక్టర్ నాకు రియల్ లైఫ్ లో తాకిందని మాధవి వెల్లడించారు.
హీరోయిన్ అవ్వకుండా మొహం మీద యాసిడ్ పోస్తానన్నాడు
ఏం చూసుకుని నీకు అంత పొగరు? నువ్వు హీరోయిన్ ఎలా అవుతావో నేనూ చూస్తాను అని బెదిరించేవాడు. 2007లో నీ మొహం మీద యాసిడ్ పోస్తా అన్నాడు. నా లవ్ యాక్సెప్ట్ చేయకుండా హీరోయిన్ అవుతానని వెళ్లావు కదా నీమొహం మీద యాసిడ్ పోసి నువ్వు సినిమాల్లో అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడు.
నా ఫ్యామిలీని టార్చర్ పెట్టాడు
ఆ రోజు అతడు అలా అనడంతో నాకు చాలా కోపం వచ్చింది. అక్కడ ఉండి మాట్లాడటం కాదు ఇక్కడ అమీర్ పేటలో ఉన్నాను దమ్ముంటే వచ్చి యాసిడ్ పోసేయ్ అన్నాను. నీకెంత పొగరే... నా మాటకే నువ్వు ఎదురు చెబుతావా? నీ వీక్ పాయింట్‌తో ఆడుకుంటానన్నాడు. ఆ రోజు నా వీక్ పాయింట్ ఏమిటో అర్థం కాలేదు. కట్ చేస్తే నా ఫ్యామిలీని టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడు.
డబ్బు బలం ఎక్కువ
ఆ సమయంలో పోలీస్ కంప్లయింట్ చేయకపోవడానికి కారణం... తారగ నమ్మకం లేక పోవడం వల్లనే. అతడికి డబ్బు బలం చాలా ఉంది. దీంతో పాటు పొలిటికల బలం, బిజినెస్ పీపుల్ బలం కూడా ఉంది. వారి ముందు నేను మామూలు అమ్మాయిని. ఈ రోజుకు కూడా నా బలం సరిపోదు. డబ్బులిచ్చి మేనేజ్ చేస్తారని అందరికీ తెలుసు.... అని మాధవి లత అన్నారు.
అందుకే రిస్క్ చేయలేదు
వాడి గురించి తెలిసి నేను ఎలా రిస్క్ తీసుకుంటాను? పైగా అప్పుడే సినిమాల్లో ట్రై చేస్తున్నాను. నేను కంప్లయింట్ చేస్తే పోలీస్ స్టేషన్ల చుట్టూ నన్నే తిప్పుతారని తెలుసు. అలా టార్చర్ 2010 వరకు కంటిన్యూ అయింది. నేను ఎక్కువ బాధ పడింది మా అమ్మా నాన్నలను బాధ పెట్టినపుడే.
అతడు వచ్చాక తగ్గింది
కొన్ని రోజులకు నా లైఫ్‌లోకి మరొక పర్సన్ వచ్చాడు. ప్రేమించానన్నాడు కానీ.... మొట్టమొదట చెప్పిన మాట వాడు నీ కెరీర్‌కు ఇబ్బంది కాకుండా నేను అడ్డుకుంటాను అన్నాడు. తను సపోర్ట్ చాలా ఉండేది. కాల్స్ అన్నీ అతడే రిసీవ్ చేసుకునేవాడు. అతడు సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదు. 2009లో అతడితో బ్రోకప్ అయింది. మా మధ్య ఎలాంటి గొడవ జరుగలేదు. కొన్ని సెట్టవ్వక విడిపోయాం. ఆ తర్వాత అతడు బ్రెయిన్ ట్యూమర్‌తో 2016లో చనిపోయాడు... అని మాధవిలత గుర్తు చేసుకున్నారు.