Tirumala laddu Row: అప్పడెందుకు స్పందించలేదు రాజా..! ప్రకాష్ రాజ్ పై మాధవిలత సైటైర్..

Tirumala laddu Row: పవిత్రమైన తిరుమల లడ్డూ మహా ప్రసాదం (Tirupati laddu)తయారీలో కల్తీ జరిగిందనే ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారాయి. ఈ వివాదంపై భక్తులు, ధార్మిక సంస్థలు మండిపడుతున్నాయి. ఈ అంశంపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో లడ్డుపై ఫన్నీ కామెంట్స్ చేసిన తమిళ హీరో కార్తీ క్షమపణ చెప్పిన విషయం తెలిసిందే. ఈ వివాదాస్పద విషయంలోకి నటుడు ప్రకాశ్ రాజ్ ఏంట్రీ ఇచ్చి 'చెయ్యని తప్పుకు సారీ చెప్పించుకోవడంతో కలిగే ఆనందమేంటో' అని ట్వీట్ చేశారు. ఈ విషయంపై ప్రముఖ నటి మాధవిలత షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రకాశ్ రాజ్ గట్టిగా అరుసుకుంది. ఇంతకీ ఏం జరిగిందో మీరే ఓ లూక్కేయండి.

అసలేం జరిగిందంటే.. తిరుమల లడ్డు విషయంలో కోలీవుడ్ హీరో కార్తీ నవ్వుతు సమాధానం ఇవ్వడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. దీంతో హీరో కార్తీ.. వెంటనే తాను ఎలాంటి చేయడలేదని క్షమించమని కోరాడు. ఇక్కడ వరకూ అంతా బాగున్నా ఈ కాంట్రవర్సీలోనే వెర్సటైల్ నటుడు ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చారు. పవన్ కామెంట్స్ చేయడం వైరల్ గా మారడంతో మళ్ళీ ప్రకాష్ రాజ్ ప్రత్యేకంగా ఓ వీడియో చేశారు. కార్తీ విషయంలో పవన్ ని టార్గెట్ చేస్తూ చేయని తప్పుకు కూడా క్షమాపణలు చెప్పించుకుంటున్నారంటూ పవన్ పేరు లేకుండా ట్రిగ్గర్ చేసే పోస్టు చేశారు. ఈ ప్రస్తుతం ప్రకాష్ రాజ్ పోస్టు వైరల్ గా మారింది.

Actress Madhavi latha made shocking comments on actor Prakash Raj tweet on the Tirupati laddu controversy

ప్రకాశ్ తీరుపై పవన్ అభిమానులు సహా హిందూవులు పవన్ కు మద్దతుగా నిలిడి ప్రకాష్ రాజ్ ని ఏకేస్తున్నారు. ప్రకాష్ రాజ్ చేస్తున్న పోస్ట్స్ పై పవన్ ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఇదంతా చూస్తుంటే ప్రకాష్ రాజ్ కావాలనే సాగదీస్తున్నట్టుగా అనిపిస్తుంది. తాజాగా ఈ విషయంపై ప్రముఖ నటి మాధవిలత(madavi latha)స్పందించింది. ప్రకాష్ రాజ్కి చురకలంటిస్తూ ఒక వీడియోను విడుదల చేసింది.

ఆ వీడియోలో నటి మాధవీలత మాట్లాడుతూ' వేరే మతం వారిని ఒక్క మాట అంటేనే నానా హంగామా చేస్తారు. మొన్న బెంగుళూర్ లో ఆంజనేయస్వామి కీర్తనాలు వింటున్న వాళ్ళను వేరే మతం వాళ్ళు వచ్చి కొడితే.. అలాంటి ఇష్యూపై ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడడు' అంటు మండిపడింది. తిరుపతి లడ్డు విషయంలో హీరో కార్తీ తన ప్రమేయం లేకున్నా.. హిందువుల మనోభావాలను గౌరవించి వారు క్షమాపణలు చెప్పారు. ఇందులో ఆనందం ఏముంది? తప్పు చెప్పడం వల్ల ఎవరకి ఆనందం రాదు. ఇలా క్షమపణ చెప్పడం వల్ల భవిష్యత్తులో ఇలాంటి విషయాలపై కామెంట్స్ చేయరాదనే సదుద్దేశ్యంతో వారు క్షమాపణలు చెప్పారు' అని చెప్పుకొచ్చింది.

Actress Madhavi latha made shocking comments on actor Prakash Raj tweet on the Tirupati laddu controversy

'ఈ విషయంలో సారీ చెప్పుతూ ఎవరూ ఆనందం రాదు. ఆనందాలను వెతకడం లేదు. మన ధర్మం మీద మనమే కామెంట్స్ చేసుకుంటే ఇంకెవరో కామెంట్స్ చేస్తారనే ఉద్దేశంతోనే సారీ చెప్పారు. మరీ ప్రకాష్ రాజ్ ఏంటో తెలియదు. కానీ, వేరే విషయంల్లో ఏమనారు. కానీ,మన హిందువుల విషయంలోనే కామెంట్స్ చేస్తున్నారు. హిందూవుల మనోభావాలు దెబ్బతిన్న ఆయన సైలెంట్ గా ఉంటారు. వేరే వాళ్ళ మనోభావాల విషయంలో వైలెంట్ గా ఉంటారు. అదే మా విషయానికి దగ్గరకొచ్చే సరికి ప్రతిదీ పాయింట్ అవుట్ చేస్తుంటాడు. కాకపోతే ఆయన్ని సపోర్ట్ చేసే ద్రోహులు కూడా ఉంటారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నటి మాధవిలత వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. నెటిజన్లు కూడా షాకింగ్ కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X