50 ఏళ్ల అంకుల్స్‌కి నేను ఆంటీనా? .. మీరంతా పైకే, స్టార్ హీరోయిన్ శాపనార్ధాలు
స్వతహాగా హీరోయిన్లు అంటేనే అందానికి బ్రాండ్ అంబాసిడర్లు, ఆ అందం చక్కగా ఉంటేనే వారి కెరీర్ మూడు పువ్వులు - ఆరు కాయలుగా ఉంటుంది. అందాన్ని , ఫేస్‌లో ఛార్మింగ్‌ను కోల్పోయి ఎంతో మంది హీరోయిన్లు అడ్రస్ లేకుండా పోయారు. ఇష్టమైనది తిన్నా, కొంచెం బరువెక్కినా మొదటికే మోసం వస్తుంది. కథ డిమాండ్ చేసిన మేరకు కొందరు ముద్ధుగుమ్మలు బరువు తగ్గడం, పెరగడం చేస్తుంటారు. అయితే ఇలా హీరోయిన్లు సన్నబడ్డా, లావెక్కినా .. ఇలా ఉన్నారేంటీ .. ఇక నువ్వు సినిమాలు చేయొద్దు అంటూ నెటిజన్లు ట్రోల్ చేసిన సందర్భాలు కోకొల్లలు.
బాడీ షేమింగ్ బారినపడ్డ వారిలో స్టార్ హీరోయిన్లు, అప్‌కమింగ్ బ్యూటీలు కూడా ఉన్నారు. వీరిలో కొందరు వెనువెంటనే రియాక్టయి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంటారు. ఉదాహరణకు స్టార్ యాంకర్, సినీ నటి అనసూయను తీసుకుంటే ఇలాంటి ఇష్యూస్‌లో ఆమె చాలా కఠినంగా ఉంటారు. తన గురించి ఎవరైనా నోరుజారితే అక్కడికక్కడే కడిగిపారేస్తుంటారు. ఈ ప్రాసెస్‌లలో తనను ఎవరు ఏమనుకున్నా సరే.. తన ఆత్మాభిమానాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదని ఎన్నోసార్లు నిరూపించుకుంది కూడా. అనసూయ నోటికి దడిసి నెటిజన్లు కాస్త జాగ్రత్తగానే ఉంటారు.

బయటి వ్యక్తులే అనుకుంటే సోషల్ మీడియా వేదికలపైనా హీరోయిన్స్ వేధింపులకు గురవుతున్నారు. తమ వ్యక్తిగత వివరాలు, సినిమా సంగతులను అభిమానులతో పంచుకోవడంతో పాటు హాట్ హాట్ ఫోటో షూట్‌లతో రెచ్చిపోతుంటారు హీరోయిన్లు. వీటిలో ఏదైనా ఫోటో తేడాగా ఉన్నా.. కాస్త ఒళ్లు చేసినా వారిని నెటిజన్లు నానా మాటలు అంటుంటారు. ముఖ్యంగా బాడీషేమింగ్ కామెంట్స్‌తో కొందరు నెటిజన్లు పెట్టే టార్చర్ అంతా ఇంతా కాదు.
తాజాగా బాడీ షేమింగ్ బారినపడ్డారు సినీ నటి, బీజేపీ నేత మాధవీ లత. 2008లో నచ్చావులే సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ మూవీతోనే మంచి పాపులారిటీ సంపాదించింది. ఆ వెంటనే స్నేహితుడా, ష్, ఉసురు, అరవింద్ 2, తొలిపాట వంటి సినిమాలు చేసినా స్టార్ డమ్ దక్కలేదు. మధ్యలో కోలీవుడ్‌ను ఓ చూపు చూసినా లక్ కలిసి రాలేదు. కొత్త అమ్మాయిల రాకతో ఈమెకు అవకాశాలు మరింత తగ్గుముఖం పట్టడంతో మాధవీలత కృష్ణ భక్తురాలిగా మారి ఆధ్యాత్మిక బాట పట్టారు. అయితే అడపాదడపా ఇంటర్వ్యూలు ఇస్తూ అందులోనూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు.
మాధవీలతపై టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. దీనికి ఆమె కౌంటర్ కూడా ఇచ్చారు. ఇదే సమయంలో మాధవీపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఆంటీ అంటూ , ముసలిదానివి అయిపోయావంటూ అసభ్యంగా కామెంట్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రోలింగ్‌పై మాధవీలత ఘాటుగా స్పందించారు. పొట్ట బట్ట ఉన్న అంకుల్స్ నన్ను ఆంటీ అంటున్నారని.. జీవితం ఎవరికీ శాశ్వతం కాదని, నా ఏజ్ వచ్చేసరికి మరణానికి దగ్గరలో ఉండేవాళ్లు కూడా నా గురించి మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు.
నేను పుట్టాను , పెరిగాను , చనిపోతాను ఇది ప్రకృతి సహజమని దీనిని ఆపగలిగే దమ్మున్న మనుషులు శాశ్వతంగా ఉండండి అంటూ మాధవీలత కౌంటర్ ఇచ్చారు. మీరు నన్ను ఆంటీ అన్నా, అవ్వ అన్నా నాకేం సమస్య లేదని.. అది మీ మెదడులోనే ఉందని .. నా కోసం ఆలోచించే సమయం మీ గురించి ఆలోచిస్తే నా ఏజ్ వచ్చేసరికి అంకుల్ కాకుండా ఉంటారని వ్యాఖ్యానించింది. మీరెలా పిలిచినా మీ వయస్సుని ఆపలేను .. నా మనసుని మార్చలేరు , నన్ను దూషణ మానేసి వయసైన మీ అమ్మానాన్నలకి అన్నం పెట్టండి ...... నన్ను దూషించిన పాపం పోతుంది శత్రు వినాశన ప్రాప్తిరస్తు అంటూ మాధవీలత సెటైర్లు వేశారు. ఆమె రియాక్షన్‌తోనైనా నెటిజన్లు ఈ గొడవని ఆపేస్తారో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











