సీక్రెట్‌గా తమిళ్ హీరోని పెళ్లాడిన మధు శాలిని.. హీరో ఎవరంటే?
ఈ మధ్య వరుసగా హీరోయిన్లు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పుడు తాజాగా పెళ్లి చేసుకుని ఓ ఇంటి వారవుతున్న హీరోయిన్ల జాబితాలో తెలుగమ్మాయి మధు శాలిని కూడా చేరారు. ఈ మధ్యే నయనతార పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న నయనతార గురించి అందరికీ తెలుసు. అందువల్ల, ఆ పెళ్లి వార్త ఎవరికీ పెద్దగా షాకింగ్ అనిపించలేదు. అయితే, మధు శాలిని పెళ్లి మాత్రం ప్రేక్షకులకు షాకింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే సైలెంట్‌గా తమిళ్ హీరోని పెళ్లాడిన మధు శాలిని, సోషల్ మీడియాలో తమ పెళ్లి విషయం వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే..

తెలుగమ్మాయి
మధు శాలిని హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన అచ్చమైన తెలుగమ్మాయి. ఆమె తండ్రి హమీద్ వ్యాపారవేత్త కాగా తల్లి పోలాప్రగడ రాజ కుమారి ప్రముఖ న్యాయవాది, శాస్త్రీయ నృత్యకారిణి. తన తల్లిలాగే, మధు శాలిని కూడా అందాల పోటీలలో పాల్గొనే ముందు కూచిపూడి నేర్చుకుంది, అలా ఆమె కొన్ని పోటీలు కూడా గెలిచింది. దీంతో ఆ పోటీలు ఆమె మోడలింగ్ వృత్తికి మార్గం సుగమం చేసినట్టు అయింది. కొద్దికాలం పాటు టెలివిజన్ యాంకర్‌గా పనిచేసిన తర్వాత, ఆమె సినిమా నటిగా మారింది.

కితకితలు అంటూ
2006లో అల్లరి నరేష్ సరసన E. V. V. సత్యనారాయణ తెరకెక్కించిన కితకితలు అనే సినిమాతో ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది, ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు వరుస అవకాశాలు వస్తాయని అనుకున్నారు కానీ అదంత ఈజీగా అయితే జరగలేదు. ఆ తరువాత అందరివాడు, నా ప్రాణం కంటే ఎక్కువ, నాయకుడు, స్టేట్ రౌడీ వంటి సినిమాల్లో కనిపించింది. చివరిగా తెలుగులో రక్తం అనే సినిమాలో కనిపించిన ఆమె తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది.

గురువారమే పెళ్లి
అయితే తాజాగా తమిళ్ హీరో గోకుల్ ఆనంద్, తెలుగమ్మాయి మధు శాలిని గురువారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీళ్లిద్దరి పెళ్లి గురువారం నాడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, కొంత మంది సినిమా ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. అయితే వీరి పెళ్లి చాలా సీక్రెట్ గా జరిగిపోయింది. మా పెళ్లి అయిందని ఇద్దరూ ప్రకటించాకే బయటకు తెలిసింది.

ఆరు సినిమాల్లో
తమిళ సినిమా 'పంచాక్షరం'లో మధు శాలిని, గోకుల్ జంటగా నటించారు. ఆ సినిమా సమయంలో ఇద్దరి మధ్య స్నేహం చిగురించిందని, ఆ తర్వాత అది ప్రేమగా మారిందని తెలుస్తోంది. మధు శాలిని పెళ్లి చేసుకున్న గోకుల్ ఆనంద్ అరడజనుకు పైగా తమిళ సినిమాల్లో హీరోగా నటించారు. 'అమెరికన్ మాపిళ్ళై', 'టాప్ లెస్' వంటి వెబ్ సిరీస్‌లు సైతం చేశారు.

ఫోటోలు వైరల్
ప్రస్తుతం గోకుల్ ఆనంద్ మలయాళ సినిమా 'జాక్ అండ్ జిల్' చేస్తున్నారు. మధు శాలిని... ఈ మధ్య వచ్చిన '9 అవర్స్' వెబ్ సిరీస్‌లో నందమూరి తారకరత్న భార్య పాత్రలో కనిపించి అలరించింది. ఇక ఆమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











