పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా కంకణం కట్టుకున్న హీరోయిన్ మధుమిత!
పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ప్రముఖ నటుడు శివ బాలాజీ భార్య, నటి మధుమిత జనసేన కంకణం కట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన ఫేస్ బుక్ పేజీలో ఆసక్తికర పోస్ట్ చేశారు. ఆయన్ను గెలిపించే వరకు అలుపు ఎరుగకుండా పోరాడదామని పిలుపునిచ్చారు.
''కంకణం ధరించే ముందు ఒక అభిమానిని అన్న నిజాన్ని పక్కన పెట్టి జనసేన మానిఫెస్టో, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం, ప్రజల కోసం, రాష్ట్రం కోసం మరియు దేశం కోసం ఆయన చేసుకున్న ప్రణాళికలు, ఆయన నిస్వార్ధంగా ప్రజల కోసం కంటున్న కలలు వాటిని సాధించే దిశగా ఆయన చేస్తున్న కృషి ఇవన్నీ విశ్లేషించుకుని నిర్ణయించుకున్నాను.'' అని మధుమిత తెలిపారు.

''మనలో ప్రతి ఒక్కరు ఒక ప్రచారసాధనంగా మారి ఆయనకి ఆయన ఆశయాలకు ఆయన మనపై ఉంచిన నమ్మకానికి ప్రాణం పొయ్యాలని వేడుకుంటున్నాను. 3 రోజులు మన నాయకుడి కోసం(మన కోసం) అలుపెరుగని ఆయనలానే పనిచేద్దాం.'' అని పిలుపునిచ్చారు.
'సందడే సందడి' సినిమా ద్వారా 2002లో కెరీర్ మొదలు పెట్టిన మధుమిత పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. 2009లో నటుడు శివ బాలాజీనీ పెళ్లాడారు. పెళ్లి, పిల్లల కారణంగా సినిమాలు తగ్గించినప్పటికీ అప్పుడప్పుడూ మెరుస్తూనే ఉన్నారు. ఈ ఏడాది విడుదలైన 'వినయ విధేయ రామ' చిత్రంలో రామ్ చరణ్ వదిన పాత్ర పోషించారు. ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాల్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











