Malaika Arora: 50 ఏళ్ల వయసులోనూ యమా ఘాటుగా మలైకా అందాలు.. టెంప్టింగ్ ఫోజులతో గ్లామర్ షో!
మలైకా అరోరా.. ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతశయోక్తి కాదు. ఐటెం సాంగ్స్ కు డ్యాన్స్ చేస్తూ అద్భుతమైన ఫాలోయింగ్ ను సంపాధించుకున్న ఈ హాట్ బ్యూటీ పేరు వింటనే కుర్రకారు గుండెలు జారిపోతాయి. కేవలం డ్యాన్సర్ గానే కాకుండా నటిగా, వీజేగా, వ్యాఖ్యాతగా, ప్రొడ్యూసర్ గా, మోడల్ గా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన అతిథి చిత్రంతో తొలిసారి తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ క్యూట్ బ్యూటీ. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక పాటకు ప్రత్యేక డ్యాన్స్ చేసి అందరితో కేక పెట్టించింది.
1997లో సినిమా రంగంలో అడుగు పెట్టిన ఈ హాట్ బ్యూటీ ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రతిరోజూ కష్టపడి జిమ్ చేస్తూ మరీ తన అందాన్ని కాపాడుకుంటోంది. 50 ఏళ్ల వయసూలోనూ పదహారేళ్ల వయసు పాపలా అందాలను కూడా ఆరబోస్తుంది. మలైకా అరోరాను చూసిన వారెవరూ కూడా ఆమెకు 50 ఏళ్లు అంటే నమ్మరు. అంతటి అందాన్ని సొంతం చేసుకున్న ఈమె ఓవైపు సినిమాలు, మరోవైపు జిబ్ లో కసరత్తులు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఎన్ని పనులు ఉన్నా సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తుంటుంది మలైకా అరోరా. అలాగే తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో అదిరిపోయే డ్రెస్ వేసుకొని అందాలన్నీ ఆరబోసింది. చంకీలతో ఉన్న ఆ డ్రెస్సును చూస్తే.. ఎవరూ డ్రెస్ అని అనుకోరు. కేవలం పూసలను తన ఒంటికి చుట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.

దీపావళి పండుగ సందర్భంగా మలైకా అరోరా ఈ డ్రెస్ వేసుకున్నట్లు అర్థం అవుతోంది. అలాగే మలైకా ఈ ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షల్లో లైకులు వచ్చాయి. ఆమె అభిమానులు అంతా పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు, షేర్లు చేస్తూ ఆమె ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. అలాగే అదిరిపోయావు, అందంగా ఉన్నావు.. నీ అందాన్ని తట్టుకోలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. హాట్ బ్యూటీ, హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ చాలా మంది నెటిజెన్లు తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. తన భర్త అర్బాజ్ ఖాన్ తో విడాకుల తర్వాత నుంచి బోనీ కపూర్ కొడుకు హీరో అర్జున్ కపూర్ తో మలైకా అరోరా డేటింగ్ చేస్తోంది. 38 ఏళ్ల వయసు ఉన్న ఇతగాడితో 50 ఏళ్ల వయసు ఉన్న ఈమె డేటింగ్ చేయడంతో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పటికీ వీరి బంధం గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ నడుస్తూనే ఉంటుంది. కానీ వీరిద్దరూ అవేమీ పట్టించుకోకుండా.. తమ జీవితంలో ముందుకు వెళ్తున్నారు.


Click it and Unblock the Notifications











