మంచి క్యారెక్టర్ అని చెప్పి , రేప్ సీన్ ... టాలీవుడ్ డైరెక్టర్‌పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
దాదాపు 25 క్రితం హీరోయిన్లుగా వెలుగొందిన హీరోయిన్లు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లు స్టార్ట్ చేస్తూ తిరిగి బిజీ అవుతున్నారు. వీరిలో మాళవిక కూడా ఒకరు. కేరళకు చెందిన ఈ భామ తన అందం, అభినయంతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత పెళ్లి చేసుకుని నటనకు దూరమయ్యారు మాళవిక. ఇటీవలి కాలంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ కెరీర్‌లో ఎదుర్కొన్న ఇబ్బందులను పంచుకున్నారు.
1979 జూలై 19న బెంగళూరులో జన్మించారు మాళవిక. ఆమె అసలు పేరు శ్వేత కొన్నూర్ మీనన్. 19 ఏళ్ల వయసులోనే కెరీర్ ప్రారంభించిన మాళవిక.. 1999లో తమిళ చిత్రం ఉన్నాయ్ తేడీలో నటించారు. తర్వాతి వరుస అవకాశాలు అందుకున్న మాళవిక.. ఈవీవీ సత్యనారాయన దర్శకత్వంలో తెరకెక్కిన చాలా బాగుంది చిత్రం ద్వారా తెలుగు వారిని పలకరించారు. ఆ తర్వాత దీవించండి, శుభకార్యం, నవ్వుతూ బతకాలిరా, ప్రియ నేస్తమా, అప్పారావ్ డ్రైవింగ్ స్కూల్ సినిమాలు చేశారు.

తర్వాత తెలుగు తెరకు దూరమైన మాళవిక తమిళ, మలయాళ చిత్రాలతో బిజీ అయ్యారు. 2009లో చివరిసారిగా ఆరుపాదై మూవీలో గెస్ట్ రోల్‌లో నటించారు మాళవిక. 2007లో సురేష్ మీనన్ అనే వ్యక్తిని ఆమె వివాహం చేసుకుని మరుసటి ఏడాదే పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. భర్త, పిల్లలతో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోన్న మాళవిక. చాలా కాలం పాటు బయట కనిపించలేదు. తనతో పాటు ఒకప్పుడు హీరోయిన్‌లుగా చలామణీ అయిన వారు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టడంతో ఆమె కూడా రంగంలోకి దిగింది.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మాళవిక.. 45 ఏళ్ల వయసులోనూ హాట్ హాట్ ఫోటోలతో రెచ్చగొడుతున్నారు. మొన్నామథ్య థైస్ చూపిస్తూ బీచ్ ఒడ్డున ఫోజులిచ్చారు. అలాగే యోగా వీడియోలు చేసి వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ తెలుగు ఛానెల్‌లో కమెడియన్ అలీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అలీతో సరదాగా షోకు హాజరైన మాళవిక తన కెరీర్ , వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా తాను తెలుగులో ఎంట్రీ ఇచ్చిన చాలా బాగుంది సినిమా, ఆ చిత్ర దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ, హీరో శ్రీకాంత్‌లపై సంచలన వ్యాఖ్యలు చేసింది. చాలా బాగుంది ఎక్స్‌పీరియన్స్ సూపర్ అన్న ఆమె.. హీరోయిన్‌గా డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్‌ను ఈవీవీ తనకు ఇచ్చారని మాళవిక తెలిపారు. అంతా బాగానే ఉంది కానీ సినిమా మొత్తంలో తనకు నచ్చనిది రేప్ సీన్ ఒకటేనని, ఇది చేసేటప్పుడు బాగా డిస్ట్రబ్ అయ్యానని పేర్కొంది. ప్రస్తుతం మాళవిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ ఫ్రెండ్‌గా నటించిన వడ్డే నవీన్ చేతుల్లో మాళవిక అత్యాచారానికి గురవుతుంది. అతనిపై కక్షగట్టిన మాళవిక క్యారెక్టర్ అతనిపై పగ సాధించి చివరిలో మారుతుంది.


Click it and Unblock the Notifications











