ఆ పరిస్థితుల్లో హీరోయిన్లను నీచంగా.. అదే దురదృష్టం.. యువ హీరోయిన్ సంచలనం

Malavika Mohanan: సినీ పరిశ్రమలో మహిళల పట్ల వివక్ష ఉందని, షూటింగ్‌ లొకేషన్‌ దగ్గర నుంచి అకామిడేషన్, రెమ్యూనరేషన్ వరకూ అందరూ మేల్‌ - ఫీమేల్‌ అనే తేడాలు చూపిస్తున్నారని ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ పలు సందర్భాల్లో తమ గోడును వ్యక్తం చేశారు. మేకప్ కాస్ట్యూమ్ హెయిర్ స్టైలిస్ట్ ఇలా ప్రతి విషయంలో చిన్నచూపు చూస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా కోలీవుడ్ హీరోయిన్ మాళవిక మోహన్ కూడా ఇలాంటి తరహాలోనే షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ తంగలాన్ హీరోయిన్ ఏమన్నది?

కేరళ బ్యూటీ మాళవిక మోహన్ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రముఖ సినిమాటోగ్రఫర్ మోహనన్ కుమార్తె గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఈ బ్యూటీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించిన ఫెయిర్‌నెస్ క్రీమ్ కోసం కమర్షియల్ షూట్‌కి ఆమె తన తండ్రితో కలిసి వెళ్లింది. ఈ సమయంలో ఆమెకు నటనపై ఉన్న ఆసక్తి గుర్తించారు మమ్ముట్టి. ఇలా మమ్ముట్టి తన కుమారుడు దుల్కర్ సల్మాన్ సరసన నటించే అవకాశం కల్పించారు. అలా 'పట్టామ్ పోలే' అనే మలయాళీ చిత్రంతో కథానాయకిగా తొలిసారి నటించింది.

Actress Malavika Mohanan shocking comments on film industry

ఆ తరువాత దళపతి విజయ్ హీరోగా నటించిన 'మాస్టర్' మూవీతో కథానాయికగా స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ఆ తరువాత ధనుష్‌కు జంటగా నటించిన 'మారన్‌' తదితర చిత్రాల్లో నటించారు. 2013లో 'పట్టామ్ పోలే' మూవీతో మలయాళం సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మాళవిక మోహనన్. ఈ బ్యూటీ హిందీలో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించిన కూడా 'బియాండ్ ది క్లౌడ్స్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల 'తంగలాన్' మూవీతో తమిళ, తెలుగు ప్రేక్షలను మెప్పించింది. ఈ సినిమాలో డీ గ్లామర్ పాత్రలో మాళవిక నటనకు మంచి మార్కులు కొట్టేసింది. ఇలా అన్ని ఇండస్ట్రీలను ఓ చుట్టు చుట్టేసిన మాళవిక మోహనన్ ప్రస్తుతం ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇలా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ మాళవిక మోహన్‌ పాన్‌ ఇండియా నటిగా ముద్ర వేసుకుంటున్నారు.

తాజాగా హీరోయిన్ మాళవిక మోహనన్ ఓ ఇంటర్వ్యూ మాట్లాడుతూ.. ''సౌత్ ఇండియా సినిమాల్లో గిఫ్ట్ ఇవ్వడం చాలా కాలంగా ఉంది.. ముఖ్యంగా పెళ్లిళ్ల సమయంలో కార్లు, వాచ్‌లు వంటి ఖరీదైన బహుమతులు ఇచ్చే సంస్కృతి ఉంది. నాకెప్పుడూ అలాంటి బహుమతులు రాలేదు. సినిమాల విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా ఈ బహుమతి ఇచ్చే సంస్కృతి జరుగుతుంది. నటులు అవార్డులతో గౌరవించబడతారు, కానీ నటీమణులు కాదు. నటులు నటీమణులకు సమానమైన ప్రాధాన్యత, గుర్తింపు ఇవ్వరు." అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

Actress Malavika Mohanan shocking comments on film industry

మాళవిక ఇంకా మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో హీరోయిన్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు సరైన ప్రాముఖ్యత ఇవ్వడం లేదన్నారు. ఏదైనా సినిమా వసూళ్ల పరంగా మంచి విజయాన్ని సాధిస్తే.. ఆ క్రెడిట్‌ను హీరోలకే ఇస్తారనీ, హీరోయిన్లు మాత్రం ఎక్కువగా గుర్తింపు రావడం లేదని వాపోయారు. ఒక వేళ సినిమా సరిగా ఆడనప్పుడూ హీరోయిన్స్ నే ఫస్ట్ టార్గెట్ చేస్తారు. వారు నటీమణుల అదృష్టం గురించి మాట్లాడుతారు. బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందిన చిత్రాలలో నటించే నటిని దురదృష్టవంతురాలిగా ముద్ర వేస్తారు. ఈ పరిస్థితి దక్షిణాదిలో మాత్రమే కాదని, ఇతర చిత్ర పరిశ్రమల్లోనూ తాను చూస్తున్నానని, ఇదే పెద్ద సమస్య అని నటి మాళవిక మోహన్‌ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X