ఆ హీరోతో బెడ్ సీన్లు ఎన్నిసార్లు షూట్ చేశారు?.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన మాళవిక మోహనన్
కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం మంచి గ్లామర్ హీరోయిన్ గానే కాకుండా నటనలో కూడా తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకుంటూ ఉన్న అతికొద్దిమంది హీరోయిన్ లలో మాళవిక మోహనన్ ఒకరు. ఆమె టాప్ హీరోయిన్స్ లిస్టులో కొనసాగుతోంది అనే చెప్పాలి. గత రెండేళ్ల నుంచి ఈ బ్యూటీ చాలా విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులలో ఆదరణను కూడా పెంచుకుంటోంది. ఇక సోషల్ మీడియాలో కూడా అభిమానులకు టచ్ లో ఉండాలి అని ఆమె వారు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం ఇస్తుంది. అయితే రీసెంట్ గా ఒక నెటిజన్ అడిగిన నెగిటివ్ ప్రశ్నకు ఆమె దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ..
మొదట మోడల్ గా మంచి క్రేజ్ అందుకున్న మాళవిక మోహనన్ ఆ తర్వాత మెల్లగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు అందుకునే విధంగా అడుగులు వేస్తోంది. ఈ బ్యూటీ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ K U మోహనం కూతురు అని చాలా మందికి తెలియదు. తండ్రి బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఆమె సొంతంగానే సినిమాలలో అవకాశాలు అందుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అయితే అందుకుంటోంది.

ఆ సినిమాలతో మంచి క్రేజ్
తమిళం మలయాళంలో చాలా మంచి అవకాశాలు అందుకుంటున్న మాళవిక మోహనన్ 2013లో పట్టం పోలే అనే మలయాళం సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత తమిళంలో ఆమె మొదటి అవకాశంగా రజనీకాంత్ సినిమాలో నటించింది. రజినీకాంత్ పేట సినిమాలో మాళవిక నటించిన విధానం ఒక వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆతర్వాత ధనుష్ మారన్ సినిమాతో కూడా ఆమె తమిళ ప్రేక్షకులకు దగ్గరైంది.

సోషల్ మీడియాలో..
మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆమె అభిమానులతో కూడా చాలా దగ్గరగా ఉండాలని అనుకుంటుంది. వారు ఎలాంటి ప్రశ్నలు అడిగినా కూడా తనదైన శైలిలో స్పందించే ప్రయత్నం చేస్తోంది. అంతే కాకుండా అప్పుడప్పుడు కావాలని నెగిటివ్ కామెంట్ చేసే వారికి కూడా దిమ్మ తిరిగే విధంగా సమాధానం ఇస్తూ ఉంటుంది.

బెడ్ సీన్లు ఎన్నిసార్లు షూట్ చేశారు?
రీసెంట్ గా కూడా ఒక నెటిజన్ మాళవిక మోహనన్ కు సంబంధించిన ఒక సీన్ గురించి తప్పుడుగా ప్రశ్నించడంతో ఆమె వెంటనే రియాక్ట్ అయ్యింది. తన ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేస్తూ ఉండగా మధ్యలో ఒక నెటిజన్ ధనుష్ మాహాన్ సినిమాలోని బెడ్ సీన్లు ఎన్నిసార్లు షూట్ చేశారు అంటూ ఊహించని విధంగా ప్రశ్నించాడు.

దిమ్మతిరిగేలా సమాధానం
అతను అడిగిన ప్రశ్నకు మాళవిక మోహనన్ దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చింది. "మీ తల లోపలి భాగం నిజంగా విచారకరమైన ప్రదేశం," అంటూ మాలవిక అతని ఆలోచన విధానానికి ఊహించని విధంగా కౌంటర్ వచ్చింది. ఇక ఆమె స్పందించిన విధానానికి మిగతా నెటిజన్లు కూడా మద్దతు పలికారు. తప్పుడుగా ఆలోచించే వారికి సరైన సమాధానం చెప్పారు అని కూడా మాళవికపై ప్రశంసలు కురిపించారు. అంతే కాకుండా ఇదొక స్లిప్పర్ షాట్ అంటూ మీమ్స్ తో ఆ సమాధానాన్ని మరింత వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మాళవిక తమిళంలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఒక సినిమా చేస్తోంది.


Click it and Unblock the Notifications











