Malika Rajput Suicide: యువ నటి సూసైడ్.. ఇన్స్‌టాగ్రామ్ పోస్ట్‌లో సంచలనం!
బాలీవుడ్ నటి, గాయని మాలికా రాజ్‌పుత్ అలియాస్ విజయ లక్ష్మీ ఆకస్మిక మరణం అందర్నీ తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. మాలిక ఇకలేరనే వార్తను ఆమె స్నేహితులు, సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. నటిగా, సింగర్‌గా, కథక్ డాన్సర్‌గా, గజల్ సింగర్‌గా ఇలా బహుముఖ ప్రతిభావంతురాలు జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడమేంటి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె తన మరణానికి ముందు రాసిన కవిత ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ఆమె మరణం వెనుక ఏదైనా కారణం ఉందా? ఆమె స్వయంగా రాసిన కవితలో ఏముందనే వివరాల్లోకి వెళితే..
మాలికా రాజ్‌పుత్ మరణం ఉత్తరప్రదేశ్‌లోని సీతాఖండ్‌లోని కోత్వాల్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తన నివాసంలో ఫిబ్రవరి 13వ తేదీన ఫ్యాన్‌కు ఉరి వేసుకొని జీవితాన్ని అర్ధాంతరంగా చాలించడం ఆ ప్రాంతవాసులను కన్నీరుమున్నీరయ్యేలా చేసింది. మాలిక మరణవార్తతో కుటుంబ సభ్యులు, స్నేహితులు గుండెపగిలేలా రోదిస్తున్నారు.

మాలికా రాజ్‌పుత్ రాసిన కవితలో మరో చోట ఆమె భావోద్వేగానికి గురై రాసినట్టు కొన్ని లైన్లు కనిపించాయి. నిన్ను వదిలి నేను బతకడం అసాధ్యం.. నీ నుంచి విడిపోతున్నాననే భయం కలిగినప్పుడు ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోతాను అని రాసింది. దాంతో ఆమె ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా? లవ్ బ్రేకప్ అయినందునే ఆమె ఇలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకొందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా, విజయలక్ష్మీ అలియాస్ మాలికా రాజ్‌పుత్ మరణం గురించి పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. ఆమె తన గదిలో తలుపులు వేసుకొంది. గదిలో లైట్ వెలుగుతుంటే.. వెళ్లి పిలిచాం. ఆమె ఎంతకు పలకపోవడంతో తలుపులను గట్టిగా కొట్టాం. అయితే ఉలుకు పలుకు లేకపోవడంతో కిటికీ నుంచి చూడగా.. ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే తలుపు పగలకొట్టి బయటకు తీసుకు రాగా అప్పటికే ఆమె మరణించింది అని తెలిపారు.
మాలికా రాజ్‌పుత్ కెరీర్ విషయానికి వస్తే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ నటించిన రివాల్వర్ రాణి అనే క్రైమ్ కామెడీ చిత్రంలో నటించింది. అలాగే ప్రముఖ గాయకుడు షాన్‌తో కలిసి కొన్ని ఆల్బమ్‌లో పాటలు పాడింది. ఇంకా పలు చిత్రాలు, పలు పాటలు, గజల్స్ అందించారు. ఆమె మరణంతో తీవ్ర దిగ్బ్రాంతికి గురైన ఆమె స్నేహితులు, సన్నిహితులు సంతాపం తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











