మా ఆయన నన్ను చూసి లొట్టలు వేస్తాడు: సీక్రెట్ బయటపెట్టిన మంచు లక్ష్మి

మిగిలిన ఇండస్ట్రీల మాదిరిగానే తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా చాలా మంది స్టార్లు తమ వారుసులను పరిచయం చేస్తున్నారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో కొందరు మాత్రమే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో మంచు లక్ష్మి ఒకరు. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో వచ్చినా టాలీవుడ్‌లో తనదైన చిత్రాలు చేస్తూ ఈ అమ్మడు తన రేంజ్‌ను పెంచుకుంటూనే ఉంది. ఇలా ఇటీవలే ఓ వెబ్ సిరీస్‌తో వచ్చి మెప్పించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి.. తన భర్త గురించి ఓ సీక్రెట్ లీక్ చేసింది. ఆ వివరాలను మీరే చూడండి!

తండ్రికి తగ్గ తనయ అనేలా
సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో తనదైన మార్క్‌ను చూపిస్తూ వస్తున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. దాదాపు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో విలన్‌గా, హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా, నిర్మాతగా ఆయన ఎన్నో రకాలుగా సేవలు అందించారు. ఇక, ఆయన బాటలోనే సోదరులతో కలిసి సినీ ప్రయాణం మొదలు పెట్టింది మంచు లక్ష్మి. ఆమె కూడా ఆల్‌రౌండర్ అనిపించుకుంటూ వెళ్తోంది.

Actress Manchu Lakshmi Funny Comments On Husband

అలా మొదలైన సినీ కెరీర్

'ద ఓడ్' అనే ఇంగ్లీష్ ఫిల్మ్‌తో మంచు లక్ష్మి యాక్టింగ్ కెరీర్‌ను మొదలు పెట్టింది. ఆ తర్వాత 'డియర్ ఎయిర్' అనే చిత్రాన్ని కూడా చేసింది. అదే ఏడాది నిర్మాతగానూ తన ప్రయాణాన్ని మొదలెట్టింది. సరిగ్గా అప్పుడే 'లక్ష్మి టాక్ షో' అనే ప్రోగ్రామ్‌తో బుల్లితెరపైకీ వచ్చింది. ఈ క్రమంలోనే లక్ష్మి 'అనగనగా ఓ ధీరుడు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి నటిగా ఎంటరైంది.

విలక్షణమైన నటనతో క్రేజ్
ఫస్ట్ మూవీలోనే అదిరిపోయే నటనతో అలరించిన మంచు లక్ష్మి.. ఆ తర్వాత 'గుండెల్లో గోదారి'లో అద్భుతమైన నటనతో అవార్డులను దక్కించుకుంది. ఈ ఉత్సాహంతోనే హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో చేసింది. అలాగే, నిర్మాతగానూ పలు మూవీలను ప్రోడ్యూస్ చేసింది. ఇలా చాలా తక్కువ సినిమాలే చేసినా లక్ష్మి ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది.

Actress Manchu Lakshmi Funny Comments On Husband

ఇప్పుడలా.. ఆ సిరీస్‌లోనూ

మంచు లక్ష్మి ఇటీవలి కాలంలో లేడీ ఓరియెంటెడ్ మూవీలను ఎక్కువగా చేస్తోంది. ఇలా ఇప్పుడు 'ఆదిపర్వం' అనే సినిమా చేస్తోంది. ఇక, ఇటీవలే ఈ అమ్మడు 'యక్షిణి' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇందులో అద్భుతమైన పాత్రను పోషించిన మంచు లక్ష్మి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఫలితంగా మరిన్ని సిరీస్‌లలో అవకాశాలను అందుకుంటోంది.

నా భర్త లొట్టలు వేస్తూనే
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మంచు లక్ష్మి తాజాగా ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ లొట్టలు వేయడం ఆమె గమనించింది. అప్పుడు వెంటనే అతడిని పిలిచి మళ్లీ అలా అనమన్న లక్ష్మి 'అలా అనడం బాగుంటుంది. మా ఆయన కూడా నన్ను చూసి అలాగే పిలుస్తారు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను' అని చెప్పుకొచ్చింది.

Actress Manchu Lakshmi Funny Comments On Husband

పబ్లిక్‌లో వద్దని చెప్పాను

ఆ తర్వాత మంచు లక్ష్మి ప్రసన్న కంటిన్యూ చేస్తూ... 'నా భర్త పబ్లిక్‌లో కూడా అలా లొట్టలు వేసి పిలుస్తుంటారు. చాలా సార్లు ఆయనకు అలా చేయొద్దని చెప్పాను. అలా ఎవరూ అన్నా మా ఆయన పిలిచారేమో అని తిరుగుతాను' అని వివరించింది. దీంతో ఈ వ్యాఖ్యలు హైలైట్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. లక్ష్మి.. శ్రీనివాసన్ అనే వ్యక్తిని పెళ్లాడిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X