twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీకూ భార్య బిడ్డలు ఉన్న విషయం గుర్తుంచుకోవాలి: కాస్టింగ్ కౌచ్‌పై నటి మీనా!

    By Bojja Kumar
    |

    Recommended Video

    Actress Meena Talks About Tollywood Culture

    తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు... హాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ప్రపంచ వ్యాప్తంగా కాస్టింగ్ కౌచ్ అంశం కొన్ని నెలలుగా చర్చనీయాంశం అవుతూనే ఉంది. కొత్తగా వచ్చిన హీరోయిన్లు, సీనియర్ నటీమణులు మీడియాకు ఎదురుపడ్డ ప్రతీసారి ఇందుకు సంబంధించిన ప్రశ్నలు ఎదుర్కొంటూనే ఉన్నాయి. తాజాగా సీనియర్ నటి, ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అగ్రహీరోలందరితోనూ హీరోయిన్‌గా జతకట్టిన నటి మీనా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించారు.

    మా కాలంలోనూ ఈ సమస్య ఉంది

    మా కాలంలోనూ ఈ సమస్య ఉంది

    కేవలం సినిమా రంగంలోనే కాదు, అన్ని రంగాల్లోనూ మహిళలు లైంగిక వేధింపుల సమస్యలు ఎదుర్కొంటున్నారు. మా రోజుల్లోనూ కాస్టింగ్ కౌచ్ సమస్య ఉండేది. నాకు అలాంటి సమస్య ఎదురు పడలేదు కానీ ఆ రోజుల్లోనూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని మీనా తెలిపారు.

    మీకూ భార్య బిడ్డలు ఉన్న విషయం గుర్తుంచుకోవాలి

    మీకూ భార్య బిడ్డలు ఉన్న విషయం గుర్తుంచుకోవాలి

    మహిళలను తప్పుడు ఉద్దేశ్యంతో చూసే మగాళ్లు ఇకనైనా మారాలి. మీకూ భార్య, పిల్లలు ఉన్నారన్న విషయం గుర్తుంచుకోవాలి. మగాళ్లలో వక్రబుద్ది పోయినపుడే ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అని మీనా అభిప్రాయ పడ్డారు.

    టాలెంటునే నమ్ముకోవాలి

    టాలెంటునే నమ్ముకోవాలి

    కాస్టింగ్ కౌచ్ లాంటివి ఎదురైనపుడు మహిళలు కూడా నిర్మొహమాటంగా తిరస్కరించాలి. ప్రతిభను నమ్ముకునే ముందుకు సాగాలి, మీలో టాలెంట్ ఉంటే ఎప్పటికైనా మీకు మంచి అవకాశం లభిస్తుంది అని మీనా అన్నారు.

    అలా ఎన్నో అవకాశాలు వదులుకున్నా

    అలా ఎన్నో అవకాశాలు వదులుకున్నా

    మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ.... ఒకప్పుడు వరుస సినిమాల్లో చేయడం వల్ల చాలా బిజీగా ఉండేదాన్ని, డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ఆ సమయంలో ఎన్నో మంచి సినిమాలను వదులుకున్నాను. ఆ సమయంలో అరవిందస్వామితో ఛాన్స్ వచ్చినా చేయలేక పోయాను. ‘రోజా' చిత్రం సమయంలో ఆయనకు చాలా క్రేజ్‌ ఉంది. కాల్షీట్స్ కారణంగా ఆయనతో నటించలేక పోయాను. ఆ వెలితి ఇప్పటికీ అలానే ఉందని మీనా తెలిపారు.

    సెలక్టివ్ పాత్రలు చేస్తూ

    సెలక్టివ్ పాత్రలు చేస్తూ

    హీరోయిన్‌గా కెరీర్ ముగిసిన తర్వాత మీనా సెలక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆ మధ్య తెలుగులో ‘దృశ్యం'లో వెంకీ భార్య పాత్ర పోషించారు. తర్వాత ‘మామ మంచు అల్లుడు కంచు' చిత్రంలో కీలక పాత్రలో నటించారు. ఇటీవల విడుదలైన ‘సాక్ష్యం' మూవీలో హీరో బెల్లకొండ శ్రీనివాస్ తల్లి పాత్ర పోషించారు.

    English summary
    "There is a problem of sexual abuse for women in all areas, but I did not face such a problem." Actress Meena said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X