Meena: బికినీ కంటే హాట్ స్విమ్ సూట్ లో మీనా.. ఆమెను ఇలా ఎప్పుడైనా చూసారా?
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి మీనా. పాత్ర ఏదైనా సరే సినిమాల్లో డిఫరెంట్ గా ఉండే విధంగా ఆమె తనలోని సరికొత్త టాలెంట్ ను బయట పెడుతూ ఉంటుంది. ఇక ఆమె ట్రెడిషనల్ లుక్స్ తో పాటు కొన్ని గ్లామరస్ పాత్రలు కూడా చేసింది. ఇక ఒకానొక సమయంలో అయితే ఆమె దాదాపు బికినీ వేసినంత రేంజ్ లో షాక్ ఇచ్చింది. ఇక అందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. ఆ వింటేజ్ లుక్ లోకి ఒకసారి వెళితే...

300 కి పైగా చిత్రాలలో..
ఆమె తమిళనాడులోని చెన్నైలో సెప్టెంబర్ 16, 1976న జన్మించింది. మీనా చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఇక మొత్తంగా 300 కి పైగా చిత్రాలలో నటించింది. మీనా 1982లో తమిళ చిత్రం "నెంజంగళ్"లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. ఆ తర్వాత ఆమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా అనేక తమిళ, తెలుగు మలయాళ చిత్రాలలో నటించింది.

అన్ని భాషల్లో సినిమాలు
సినిమాల్లో ప్రధాన పాత్రలు చేయడం ప్రారంభించిన తర్వాత మీనా కెరీర్ ఊపందుకుంది. ఆమె మొదటి ప్రధాన పాత్ర 1990లో తమిళ చిత్రం ఒరు పుధియా కధై. ఆ తర్వాత కిజక్కు చీమయిలే, భారతి కన్నమ్మ, జెమిని వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించింది. మీనా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ కూడా హీరోయిన్ గా నటించింది.

నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు
కొన్ని చిత్రాలలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలను కూడా పోషించింది. మెగాస్టార్ తో స్నేహం కోసం సినిమాలో అలాంటి పాత్రతోనే మెప్పించింది. మీనా తన అద్భుతమైన డ్యాన్స్ స్కిల్స్‌కు తో కూడా చాలా సార్లు ఆకట్టుకుంది. మీనా నటనతో పాటు కొన్ని టీవీ షోలకు హోస్ట్‌గానూ, పలు రియాల్టీ షోలకు న్యాయనిర్ణేతగానూ వ్యవహరించింది. ఆమె తన నటనకు నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రెండు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులు, కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు, అలాగే నంది అవార్డుతో సహా అనేక అవార్డులను గెలుచుకుంది.

ఇప్పటికి కూడా వరుసగా సినిమాలు
మీనా ఇప్పటికీ చిత్ర పరిశ్రమలో చురుకుగా ఉంది. తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. మలయాళంలో దృశ్యం 2 సినిమాను తెలుగులో రీమేక్ చేయగా అక్కడ కూడా మీనా వెంకీకి జోడీగా నటించింది. తమిళంలో కూడా ఇలా అనేక చిత్రాలలో నటించింది. మీనా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అక్కడ ఆమె తన వ్యక్తిగత వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన అప్‌డేట్‌లను తన అభిమానులతో పంచుకుంటుంది.

ఆ సినిమాలో హాట్ రోల్
అయితే అప్పట్లో మీనా కొన్ని గ్లామరస్ పాత్రలతో కూడా అందరిని ఆశ్చర్యపరిచింది. ఆమె కొన్ని సినిమాలలో స్విమ్ సూట్ లలో కూడా కనిపించింది. ముఖ్యంగా కన్నడలో తరికెక్కిన హలో బ్రదర్ రీమేక్ లో కూడా ఆమె రమ్యకృష్ణ చేసిన పాత్రలో కనిపించింది. అయితే అందులోనే ఒక స్విమ్ సూట్ తో కూడా కనిపించి ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఇప్పటికి అదే క్రేజ్
దాదాపు బికినీ వేసినంత రేంజ్ లోనే ఆమె ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ లుక్ అప్పట్లో అయితే కుర్రాళ్లను మళ్ళీ మళ్ళీ థియేటర్కు వచ్చేలా చేసింది. ఎందుకంటే అంతకు ముందు వరకు కూడా మీనా ఎక్కువగా ట్రెడిషనల్ లుక్ తోనే కనిపిస్తూ వచ్చింది. కానీ అలా తడిసిన అందాలతో ఆమె కనిపించడంతో కుర్రాళ్ళు ఒక్కసారిగా ఫిదా అయిపోయారు. ఇప్పటికీ కూడా ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం విశేషం.


Click it and Unblock the Notifications











