Meena Vs Venkatesh వెంకటేష్‌పై మీనా గెలుపు.. చివరకు కౌగిలింతతో ఫ్యాన్స్ జోష్!

తెలుగు సినీ, క్రికెట్ అభిమానులకు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2024 మార్చి తొలి వారాంతం పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. హైదరాబాద్‌లో ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోని గత మూడు రోజులుగా రోజుకు రెండేసి మ్యాచ్‌లు జరగడంతో అభిమానులు పోటెత్తారు. ప్రతీ మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అయితే ఈ మ్యాచ్ హైదరాబాద్‌లో జరగడంతో సినీతారల కళకళ ఎక్కువగానే కనిపించింది. ఈ మ్యాచ్‌లో మీనా, విక్టరీ వెంకటేష్ చేసిన సందడి, ఇతర సినీ తారల తళుకుబెళుకుల వివరాల్లోకి వెళితే..

యువ హీరో విశ్వక్ సేన్ రావడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. విశ్వక్ సేన్ తన తోటి సహచర నటులకు జోష్ పెంచేందుకు రావడంతోపాటు త్వరలో విడుదల కానున్న గామి సినిమా ప్రమోషన్స్ కోసం తన హీరోయిన్‌తో కలిసి తన భావాలను పంచుకొన్నారు. తెలుగు వారియర్స్ జట్టుకు విషెస్ అందించారు.

Actress Meena Looks Fabulous With Venkatesh at Telugu Warriors Kerala Strikers Match of CCL 2024

ఇక తెలుగు వారియర్స్ జట్టులో తన సోదరుడు అశ్విన్ ఆడుతుండటంతో యాంకర్, డైరెక్టర్ ఓంకార్ తన ఫ్యామిలీ సభ్యులతో కలిసి హాజరయ్యారు. రసవత్తరంగా సాగిన మ్యాచ్‌ను ఆధ్యంతం ఎంజాయ్ చేస్తూ తన సోదరుడికి, టీమ్ సభ్యులకు సపోర్ట్‌గా నిలిచారు.

Actress Meena Looks Fabulous With Venkatesh at Telugu Warriors Kerala Strikers Match of CCL 2024

ఇక కేరళ స్ట్రైకర్స్, తెలుగు వారియర్స్ జట్టు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో నటీ మీనా, విక్టరీ వెంకటేష్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. వెంకటేష్ తెలుగు వారియర్స్ జట్టుకు మెంటర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇక మీనా కేరళ జట్టులో ఉత్సాహాన్ని కలిగించేందుకు ఆమె గ్రౌండ్‌లో హుషారుగా కనిపించారు.

Actress Meena Looks Fabulous With Venkatesh at Telugu Warriors Kerala Strikers Match of CCL 2024

కేరళ, తెలుగు వారియర్స్ జట్ల మ్యాచ్ ఉత్కంఠగా సాగడంతో ఇద్దరు ఉత్సాహంగా కనిపించారు. తెలుగు ఆటగాళ్లు బాగా ఆడినప్పుడు వెంకటేష్ చప్పట్లు కొడుతూ ఆనందంగా కనిపించగా.. కేరళ జట్టు మ్యాచ్‌లో రాణించిన సందర్భాల్లో మీనా చిన్నపిల్లలా గెంతులు వేసి తన ఆనందాన్ని పంచుకొన్నది. ఓ దశలో మీనా, వెంకటేష్ ఇద్దరు కౌగిలించుకొని అభిమానుల్లో జోష్ పుట్టించారు.

Actress Meena Looks Fabulous With Venkatesh at Telugu Warriors Kerala Strikers Match of CCL 2024

అత్యంత టెన్షన్‌గా.. నరాలు తెగేంత ఉత్కంఠతో సాగిన మ్యాచ్‌లో 1 పరుగు తేడాతో కేరళ జట్టు చేతిలో తెలుగు వారియర్స్ ఓటమిపాలైంది. దాంతో తెలుగు సినీ, క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఓ దశలో ఓడిపోతుందనుకొన్న మ్యాచ్‌ను కేరళ బౌలర్ అద్బుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ విజయాన్ని తన జట్టుకు అందించడం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X