పెళ్లిపై హీరోయిన్ మీనా షాకింగ్ పోస్ట్.. 48 ఏళ్ల వయసులోనూ తగ్గట్లేదుగా!
అనివార్య కారణాలతో కొందరు సినీతారలు తమ జీవిత భాగస్వాముల నుంచి విడాకులు తీసుకుంటున్నారు. పిల్లల బాధ్యత తీసుకుంటూ.. కెరీర్‌పై ఫోకస్ పెట్టి ఇలాంటి వారు ఒంటరిగా జీవితాన్ని గడిపేస్తున్నారు. అయితే వీరి సన్నిహితులు, అభిమానులు మాత్రం తమ అభిమాన తారలు జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని కోరుకుంటూ ఉంటారు. ఇప్పటికే విడాకులు తీసుకున్న పలువురు నటీనటులు వయసుతో సంబంధం లేకుండా మరొకరిని తమ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు.
భర్త మరణంతో ఒంటరిగా మీనా
రెండో పెళ్లి చేసుకోమంటూ అభిమానులు కోరుకుంటున్న సినీనటుల్లో మీనా ఒకరు. అనారోగ్యంతో ఆమె భర్త మరణించగా నాటి నుంచి కూతురిని చూసుకుంటూ ఒంటరిగా జీవిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు, ప్రజలు కూడా సోషల్ మీడియా ద్వారా ఆమె జీవితం బాగుండాలని ఆకాంక్షిస్తున్నారు. ఒంటరితనానికి ఫుల్‌స్టాప్ పెట్టి మరో తోడును వెతుక్కోమని సూచిస్తున్నారు. కానీ మీనా మాత్రం వాటిని సున్నితంగా తిరస్కరిస్తున్నారు.

బాలనటిగా ఇండస్ట్రీలోకి మీనా
తమిళనాడుకు చెందిన మీనా బాలనటిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ తర్వాత హీరోయిన్‌గా మారి దక్షిణాదిలోని అందరు అగ్రహీరోల సరసన నటించారు. 90వ దశకంలో మీనా హవా చూపించారు. ఖుష్భూ, సౌందర్య, రమ్యకృష్ణ, రోజా, రంభ వంటి హీరోయిన్లకు ఆమె గట్టి పోటీ ఇచ్చారు. కొత్త అమ్మాయిల రాకతో పాటు తన వయసు పెరుగుతుండటంతో ఆమెకు ఆఫర్లు తగ్గుతున్నట్లు త్వరగానే గుర్తించింది. ఈ దశలో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బెంగళూరుకు చెందిన విద్యాసాగర్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని పెళ్లాడారు మీనా. ఈ దంపతులకు ఓ కుమార్తె.
కూతురిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన మీనా
కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చినప్పటికీ అంతే వేగంగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. రీ ఎంట్రీలో దృశ్యం సినిమాతో మీనా బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కుమార్తె నైనికను కూడా తన లాగే బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తమిళ అగ్రనటుడు, ఇళయ దళపతి విజయ్ హీరోగా వచ్చిన తేరీలో ఆయనకు కుమార్తెగా నైనికగా నటించింది. జీవితం సవ్యంగా సాగుతున్న దశలో మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో 2022 జూన్ 28న కన్నుమూశారు. ఈ వార్త ఇండస్ట్రీని కుదిపేసింది. చిన్నవయసులోనే భర్తను కోల్పోయిన మీనాకు సినీ పరిశ్రమగా అండగా నిలిచింది.
చేతినిండా సినిమాలతో మీనా బిజీ
భర్త కోల్పోయి డిప్రెషన్‌లోకి వెళ్లిన మీనా తిరిగి కోలుకుని ఆనందపురం డైరీస్ అనే సినిమాతో తిరిగి బిజీ అయ్యారు. ప్రస్తుతం మూకుతి అమ్మన్ 2, రౌడీ బేబీ సినిమాలలో మీనా నటిస్తున్నారు. విద్యాసాగర్ మరణించిన తర్వాత మీనా రెండో పెళ్లి గురించి పలు ఊహాగానాలు వినిపించాయి. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ను ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. కానీ వీటిని మీనా ఖండించారు. తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, జీవితంలో కొన్ని లక్ష్యాలు ఉన్నాయని వాటిని నెరవేర్చుకోవాలని ఆమె తెలిపారు.
48 ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని అందం
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మీనా .. ఎప్పటికప్పుడు తన సినిమాలు, ఇతర కార్యక్రమాల గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఓ స్నేహితుడి పెళ్లికి వెళ్లిన మీనా.. అక్కడ దిగిన ఫోటోలను షేర్ చేశారు. 48 ఏళ్ల వయసులోనూ చెక్కు చెదరని మీనా గ్లామర్ చూసి అభిమానులు థ్రిల్ అవుతున్నారు. మీనాకు మంచి రోల్స్ ఇవ్వాలని దర్శకులకు వారు విజ్ఞప్తి చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











