Actress Meena: రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మీనా.. స్టార్ హీరోతో రిలేషన్ గురించి ఏం చెప్పారంటే?

Actress Meena: సినీ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ కు సంబంధించి అప్పుడప్పుడు కొన్ని పుకార్లు షికార్లు చేస్తుంటాయి. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనే విషయాన్ని పట్టించుకోకుండా.. ఆ నటి ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉండట. ఆమె మరో పెళ్లి చేసుకోబోతుందట. ఆ స్టార్ హీరోయిన్ మరో హీరోతో సిక్రెట్ రిలేషన్ షిప్ పెట్టుకుందని వారి పర్సనల్ లైఫ్ విషయాలపై ఎన్నో రూమర్లు పుట్టుకొస్తుంటాయి. అలా ఈ మధ్యన ప్రముఖ నటి మీనా వ్యక్తిగత జీవితం గురించి నెట్టింట పలు పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి. ముఖ్యంగా ఓ హీరోను రెండో పెళ్లి చేసుకోబోతుందని పలు రూమార్స్ వచ్చాయి. తాజా ఆ రూమార్స్ పై నటీ మీనా స్పందించింది.

ఇటీవల నటీ మీనా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నానని సోషల్ మీడియాలో వస్తున్నా ప్రచారాన్ని కొట్టిపడేసింది. ఆమె మాట్లాడుతూ.. 'థ్యాంక్సూ టూ సోషల్ మీడియా. ఏదోకటి రాయాలిగా.. ఏదోక విషయాన్ని హైలైట్ చేయాలనిగా అని ఇష్టవచ్చునట్టు రాస్తున్నారు. ఈ తమిళ్ హీరో థనుష్ తో నన్ను ట్యాగ్ చేస్తు పిచ్చి పిచ్చి వార్తలు రాస్తున్నారు. ఎందుకంటే.. ఆయన సింగల్ గా ఉన్నారని అలా రాస్తారు. అలా అయితే.. ఇండస్ట్రీలో చాలా మంది సింగల్ గా ఉన్నారు. వాళ్లకు వార్తలు లేకపోతే.. సింగల్ ఉన్నవారితో ట్యాగ్ చేస్తూ రూమార్స్ క్రియేట్ చేస్తున్నారు.' అని ఆవేదన వ్యక్తం చేశారు.

Actress Meena reacted to marriage with hero Dhanush

మీనా ఇంకా మాట్లాడుతూ.. ' ఈ విషయంలో మాత్రం నేను చాలా ఆవేదన, బాధ, ఆగ్రహానికి గురయ్యాను. నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నా.. ప్రతివారితోనూ ఫ్రెండ్లీగా ఉంటాను. అసలు లేని పోని విషయాలు ఎందుకు రాస్తున్నారు. రాసేముందు ఒక్క మాట అడగొచ్చు కాదా? లేదా ఏమైనా ఉంటే.. ఎదైనా నిర్ణయం తీసుకుంటే నేను మీడియాకు చెపుతా కాదా అని ఆగ్రహానికి లోనయ్యారు.

మీనా ఇంకా కంటిన్యూ చేస్తూ.. నా జీవితం తెరిచిన పుస్తకం. నా జీవితం గానీ, నేను నటించి సినిమాలు గానీ నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ప్రతి విషయం అందరికి తెలుసు. అయినా ఎందుకు రాస్తున్నారు. ఇందుకీ అనవసర విషయాలు.. ఇతరులకు ఉపయోగం లేని విషయాలు. నేను ఎన్నో సంవతర్సాలుగా ఈ ఇండస్ట్రీలో ఉన్నా.. నా జీవితం, నా కేరిర్ గురిచి అంతా తెలిసినా ఇలా ' అంటూ ఎమోషనల్ అయ్యారు.

నాకు ఓ ఫ్యామిలీ ఉంది. ఇలా రాస్తే నా ఫ్యామిలీ ఎలా ఎఫెక్ట్ అవుతుందో ఆలోచించారా? వారిని సమాజంలో ఎలా చూస్తారు? నాకు ఓ పాప ఉంది. ఆ చిన్నారిపై ఎలా ఎఫెక్ట్ పడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అలాగే.. నా ఇంట్లో ఇద్దరూ ఓల్డ్ పర్సన్స్ ఉన్నారు. ఈ విషయం తెలిస్తే.. వారు ఎంత బాధపడుతారో ఓ సారైనా ఆలోచించారా? ఇవేవి ఆలోచించకుండా .. ఎదోక హైప్.. సెన్సెషన్ కోసం ఇష్టమున్నట్టు రాస్తే ఎలా?' అని భావోద్వేగానికి లోనయ్యారు నటీ మీనా.

Actress Meena reacted to marriage with hero Dhanush

ఎదైనా నిజం ఉంటే రాయండి లేదా అసలు విషయం తెలుసుకొని రాయండి. ఎవరో ఎదో చెప్పారు? ఎదో అనుకుంటున్నారు? అని రాస్తే ఎలా.. ఇది అసలూ సరికాదు. ఒక ఒంటరి మహిళను ఇలా టార్గెట్ చేస్తూ.. ఇష్టవచ్చినట్టు రాయడం అసలూ కరెస్ట్ కాదు. ఏమైనా అనుమానాలు వస్తే.. నన్ను సంప్రదించండి.. నన్ను ఇంటర్య్వూ తీసుకోండి. అలా కూడా జీవితాలపై ఎఫెక్ట్ పడే పనులు చేయకండి. అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నటీ మీనా.

More from Filmibeat

Read more about: actress meena dhanush
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X