Meena రెండో పెళ్లిపై స్పందించిన మీనా.. నా లైఫ్‌లో ఎప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది అంటూ!
జీవితంలో చోటు చేసుకొన్న తీరని విషాదాన్ని ఎదురించి సినీ నటి మీనా కెరీర్‌ను చక్కదిద్దుకొనే ప్రయత్నం చేస్తున్నది. ఆమె భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో ఆకస్మిక మృతి చెందడంతో ఆమె తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. అయితే ఆ విషాదం నుంచి తేరుకొని మళ్లీ మామూలు పరిస్థితిలోకి వచ్చారు. ఆ చేదు అనుభవం నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆమె రెండో పెళ్లి చేసుకొంటారనే వార్తలపై ఆమె స్పందించిన వివరాల్లోకి వెళితే..
లైఫ్ చక్కగా సాగిపోతున్న క్రమంలో హీరోయిన్ మీనాకు 2022 సంవత్సరం కఠిన పరీక్షగా మారింది. ఎవరూ ఊహించని విధంగా జీవిత భాగస్వామి దూరం కావడంతో ఎవరూ పూడ్చలేని విషాదాన్ని తానే అధిగమించింది. ఆ కఠిన పరిస్థితులను ఎదిరిస్తున్న క్రమంలోను ఆమె రెండో పెళ్లి వార్తలు మీడియాలో స్వైరవిహారం చేశాయి.

రెండో పెళ్లి వార్తలు ఓ పక్క విస్త్రృతంగా ప్రచారం అవుతున్న క్రమంలోనే హీరో ధనుష్‌తో అఫైర్ కొనసాగిస్తుందనే విషయం మీడియాలో హైలెట్‌గా మారింది. అయితే ధనుష్‌తో నాకు సంబంధం అంటగట్టడం దురదృష్టకరం. నాకు ఓ ఫ్యామిలీ ఉంది. నాకు ఓ కూతురు ఉంది. మేము ఓ విషాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాం. అలాంటి సమయంలో ఇలాంటి వార్తలు రావడం బాధాకరం అని మీనా అన్నారు.
ఇక రెండో పెళ్లిపై మీనా స్పందిస్తూ.. జీవితంలో ఏది ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పలేను. నా భర్త చనిపోతాడని ఏ క్షణంలో కూడా ఊహించలేదు. మనిషి జీవితంలో ఏది జరగాలో అది జరిగిపోతుంటుంది. ఇది చేద్దాం.. అది చేద్దాం అని ప్లాన్ చేసుకొంటే కుదరదు. నా లైఫ్‌లో కూడా అంతే.. నేను ప్రస్తుతం దేని గురించి ఆలోచించడం లేదు అని మీనా అన్నారు.

ఇంకా నా భర్త చనిపోయాడని నేను భావించడం లేదు. అతడు నాతోనే ఉన్నాడనే ఫీలింగ్‌తో బతుకుతున్నాను. ప్రస్తుతం సినిమా కెరీర్‌పై ఫోకస్ పెడుతున్నాను. నా కూతురు మంచి కోసం ఆలోచిస్తున్నాను. కానీ పెళ్లి చేసుకోవాలని ఆలోచించడం లేదు. ఇలాంటి వార్తలు నా గురించి రాయకుంటేనే మంచింది అని అన్నారు.
ఇక భర్త చనిపోతే భార్య రెండో పెళ్లి చేసుకోవాల్సిందేనా? ఎంత మంది ఒంటరిగా జీవితాన్ని గడపడం లేదు. నేను కూడా అంతే.. ప్రస్తుతం ఒంటరిగానే ఉన్నాను. సాధ్యమైనంత వరకు ఒంటరిగానే జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తాను. నాకంటూ ఓ కూతురు ఉంది. నా కూతురు నైనిక విద్యాసాగర్ భవిష్యత్ నాకు ముఖ్యం. నా జీవితంలో ఏం జరిగితే అలా నేను ముందుకు సాగుతాను అని మీనా అన్నారు.


Click it and Unblock the Notifications











