హీరోయిన్ మీనా వెంటపడ్డ స్టార్ హీరో... ఒప్పుకోమంటూ హోటల్‌లోనే!
బాల నటిగా కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోయిన్‌గా దక్షిణ భారతదేశాన్ని ఒక ఊపారు మీనా. 4 దశాబ్ధాలకు పైగా కెరీర్‌లో తన అందం, అభినయంతో కోట్లాదిమంది ప్రేక్షకులను అలరించారు మీనా. 50కి చేరువ అవుతున్నా ఇప్పటికీ చెక్కుచెదరని గ్లామర్‌తో మెరిసిపోతున్నారు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్త తిరిగిరాని లోకాలకు తరలిపోగా.. ఒంటరిగా జీవిస్తున్నారు. ప్రస్తుతం తన కూతురి భవిష్యత్ ముఖ్యమంటున్న మీనా.. ఇటీవలి కాలంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ హీరో కారణంగా తాను ఎంత ఇబ్బంది పడింది బయటపెట్టారు. ఈ వివరాల్లోకి వెళితే..
బాల నటి నుంచి స్టార్ హీరోయిన్‌గా
బాలనటిగా తొలుత ఎంట్రీ ఇచ్చిన మీనా.. ఆ తర్వాత హీరోయిన్‌గా దక్షిణాదిలోని అందరు స్టార్ హీరోలతో ఆడిపాడారు. సౌందర్య, రోజా, రమ్యకృష్ణ, రంభ, ఖుష్బూ వంటి స్టార్ హీరోయిన్లు దక్షిణాదిని దున్నేస్తున్న సమయంలో తన అందం, అభినయంతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వరుస సినిమాలతో తీరిక లేకుండా గడిపారు. సినిమాలతో పేరు, డబ్బు సంపాదించినా అందమైన తన బాల్యాన్ని, ఎన్నో ఆనందాలను కోల్పోయానని.. కనీసం తినడానికి, నిద్రపోవడానికి కూడా టైం ఉండేది కాదని మీనా పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు.

భర్త మరణంతో డిప్రెషన్‌లోకి
కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే బెంగళూరుకు చెందిన విద్యాసాగర్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పెళ్లాడారు మీనా. ఈ దంపతులకు నైనిక అనే కుమార్తె ఉంది. తనకు మాదిరిగానే కుమార్తెను బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు మీనా. పెళ్లి, కుటుంబ బాధ్యతలతో కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న మీనా ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. తన వయసు, ఇమేజ్‌కు తగ్గ పాత్రలలో నటిస్తూ మెప్పిస్తున్నారు. అంతా సజావుగా సాగుతున్న దశలో మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో 2022 జూన్ 28న కన్నుమూశారు. ఆయన మరణంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన మీనా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. పలు సినిమాల్లో కీలకపాత్రలతో పాటు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ బాధలో నుంచి బయటపడుతున్నారు. ప్రస్తుతం తమిళంలో మూకుతి అమ్మన్ 2, రౌడీ బేబీ సినిమాలలో మీనా నటిస్తున్నారు.
మీనా రెండో పెళ్లిపై పుకార్లు
భర్త మరణంతో ఒంటరిగా ఉన్న మీనా.. రెండో పెళ్లి చేసుకోబోతున్నారని పలుమార్లు మీడియాలో, సోషల్ మీడియాలో గాసిప్స్ వచ్చాయి. కోలీవుడ్ హీరో ధనుష్‌తో మీనా రెండో పెళ్లి జరగబోతుండగా కథనాలు రావడంతో మీనా సీరియస్ అయ్యారు. తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని.. ప్రస్తుతం తన దృష్టి కూతురి భవిష్యత్ మీదే ఉందని తేల్చేశారు మీనా. అయినప్పటికీ ఈ పుకార్లకు చెక్ పడటం లేదు. ఇదిలాఉండగా.. మీనా పీక్స్‌లో ఉన్నప్పుడు ఓ స్టార్ హీరో ఆమె వెంటపడ్డారట. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీనా ఈ విషయం చెప్పారు.
ఆ హీరోకి నో చెప్పా
హిందీలో చేయమని నాకు ఆఫర్లు వచ్చాయి.. కానీ దక్షిణాదిలో నేను చాలా బిజీగా ఉన్నా. అయినప్పటికీ షూటింగ్ విషయంలో సౌత్‌కి, నార్త్‌కి చాలా తేడా ఉంది. అక్కడ ఒక్క సినిమా చేసే లోపు.. దక్షిణాదిలో నాలుగు సినిమాలు చేయొచ్చు. సౌత్‌లోనే నాకు మంచి మంచి పాత్రలు దొరుకుతున్నాయి.. ఇవన్నీ వదిలేసి అక్కడికి వెళ్లాలని అనిపించలేదు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి గారి నుంచి నాకు కంటిన్యూగా ఆఫర్లు వచ్చేవి. ఊటీలో ఆయనకు ఓ హోటల్ ఉండేది.. అక్కడే షూటింగ్స్ జరిగేవి. ఆ హోటల్‌కు వెళ్లాలంటే నాకు భయం వేసేది. రెండు మూడు సార్లు మిథున్ గారు నా రూమ్ దాకా వచ్చి.. ఏంటీ మీనా గారు నాతో సినిమాలు చేస్తారా? చేయరా? అని అడిగేవారు. అంత పెద్ద స్టార్‌కు ఎలా నో చెప్పాలో అర్ధం కాలేదు. ఒకసారి చెప్పొచ్చు, రెండు సార్లు చెప్పొచ్చు ప్రతీసారి మనం నో చెప్పలేం కదా. దాంతో చాలా సిగ్గుపడేదానిని.. ఊటీకి వెళితే ఆ హోటల్‌లో ఉండకూడదు, వేరే హోటల్ బుక్ చేయమని చెప్పేదానిని అని మీనా అన్నారు.
యశ్ చోప్రా అంటే ఇష్టం
ఒకవేళ బాలీవుడ్‌లో నేను పరిచయం అవ్వాలంటే యశ్ చోప్రా, సూరజ్ బర్జాత్యా వంటి వారి చేతుల్లోనే అవ్వాలనుకున్నా. వారి సినిమాలు నాకు చాలా ఇష్టం. బాంబేలో ఓ సినిమా షూటింగ్ కోసం వెళ్లినప్పుడు యశ్‌జీని కలవాలనుకుని ఆఫీస్‌కి వెళ్లా. ఆయన చాలా స్వీట్.. యశ్‌జీ ఆఫీస్ బయటికి వచ్చి నేను మీకు పెద్ద అభిమానిని అని చెప్పారు. సార్.. నేనే మీకు పెద్ద అభిమానిని చెప్పాలని వస్తే మీరు నా గురించి చెబుతున్నారు అన్నారు. ఇది నా జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం అని మీనా గుర్తుచేసుకున్నారు.


Click it and Unblock the Notifications











