పీకల్లోతు ప్రేమలో మీనా.. హృదయాన్ని ముక్కలు చేసిన స్టార్ హీరో!

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగారు మీనా. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వందకు పైగా చిత్రాల్లో నటించారు. గ్లామర్, సెంటిమెంట్ ఇలా ఏ రోల్‌లోనైనా అద్భుతంగా నటించగల నటిగా నిలిచారు. 90వ దశకంలో తన అందంతో కుర్రాళ్ల కలల రాకుమారిగా నిలిచారు మీనా. అలాంటిది ఓ హీరోపై ఆమె మనసు పడగా.. అతను ఈ ముద్దుగుమ్మ హృదయాన్ని ముక్కలు చేశాడట. ఈ వివరాల్లోకి వెళితే..

బాలనటిగా ఎంట్రీ
తొలుత బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన మీనా ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి స్టార్‌డమ్ సంపాదించింది. రజనీ, కమల్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్‌లాల్ తదితర అగ్ర కథానాయకులతో నటించింది. కొత్తగా ఎంత మంది హీరోయిన్లు వచ్చినా మీనాకు ఢోకా లేకుండాపోయింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే బెంగళూరుకు చెందిన విద్యాసార్ అనే వ్యక్తిని పెళ్లాడగా, ఈ దంపతులకు నైనిక అనే కుమార్తె ఉంది. మూడేళ్ల క్రితం అనారోగ్యంతో విద్యాసాగర్ మరణించిన సంగతి తెలిసిందే. భర్త మరణంతో కృంగిపోయిన మీనా డిప్రెషన్‌లోకి వెళ్లి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

Actress Meena

మీనా రెండో పెళ్లిపై పుకార్లు

మీనా మళ్లీ పెళ్లి చేసుకుంటారని.. ధనుష్‌తో ఆమె రిలేషన్‌లో ఉన్నారని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. కానీ మీనా వాటిని ఖండిస్తూనే వచ్చారు. ప్రస్తుతానికి తనకు మరోసారి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని కూతురు నైనిక భవిష్యత్తే తనకు ముఖ్యమని మీనా తేల్చిచెప్పారు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తిరిగి నటిగా బిజీ అయ్యారు మీనా. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడంతో పాటు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ తిరిగి మామూలు మనిషి కావడానికి ప్రయత్నిస్తున్నారు. చిత్ర పరిశ్రమ, ఆమె స్నేహితులు కూడా మీనాకు అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నారు. ప్రస్తుతం మీనా .. తమిళంలో మూకుతి అమ్మన్ 2, రౌడీ బేబీ సినిమాలలో నటిస్తున్నారు.

ఆ హీరోని ప్రేమించిన మీనా

మీనా అంటే పడిచచ్చిపోయే ఫ్యాన్స్ ఇప్పటికీ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటిది మీనాకు కూడా ఫేవరెట్ యాక్టర్ ఒకరు ఉన్నారు. ఆయన ఎవరో కాదు.. బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీనా మాట్లాడుతూ.. తనకు హృతిక్ అంటే చాలా ఇష్టమని, అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని అమ్మతో చాలాసార్లు చెప్పానని మీనా పేర్కొన్నారు. అలాంటిది ఓ రోజున హృతిక్ రోషన్ పెళ్లి చేసుకోవడంతో తన గుండె పగిలిపోయిందని, అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదని మీనా వెల్లడించారు.

Actrss Meena Reveals She Had A Crush On Bollywood Hero Hrithik Roshan

ఫెవరేట్ హీరోతో షేక్‌హ్యాండ్
ఓ గెట్ టుగేదర్‌లో హృతిక్ రోషన్‌ను కలిశానని మీనా తెలిపారు. ఓ పాట షూటింగ్ కోసం మంచును కూడా లెక్క చేయకుండా పనిచేయడంతో హృతిక్ తనను మెచ్చుకున్నారని మీనా గుర్తుచేసుకున్నారు. ఈ పాట షూటింగ్ సమయంలో అమితాబ్, కరీనా కపూర్‌లు సెట్‌లోనే ఉన్నారని.. ఆ టైంలో తన గురించి కరీనా తల్లి కంగారుపడి వేడి పుట్టించే కొన్ని చాక్లెట్లను నాకు ఇచ్చారని మీనా తెలిపారు. అలా మొత్తానికి తన అభిమాన హీరో.. మీనా మనసుని ముక్కలు చేశాడన్న మాట. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: hrithik roshan meena
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X