నటి మీనాకు జాక్‌పాట్... ఆ మాస్టర్‌ ప్లాన్‌తో ఊహించని లాభాలు, ఎన్ని కోట్లంటే?

బాలనటిగా కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోయిన్‌గా దక్షిణాదిని ఒక ఊపారు నటి మీనా. 90 దశకంలో అగ్ర కథానాయికగా ఆమె వెలుగొందారు. రమ్యకృష్ణ, సౌందర్య, రోజా, రంభ వంటి టాప్ స్టార్స్‌కి గట్టి పోటీ ఇచ్చి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అందరిలా అమ్మ, అత్త పాత్రలే కాకుండా హీరోయిన్‌గా నటిస్తూ తన హవా చాటుకుంటున్నారు. సినిమాలతో పాటు బిజినెస్, ఇన్వెస్ట్‌మెంట్స్‌లోనూ తిరుగులేదు అనిపించే మీనా తాజాగా భారీ లాభాలను అందుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

40 ఏళ్లకు పైగా సినీ ప్రస్థానంలో ఎన్నో అపురూప చిత్రాలలో నటించారు మీనా. గ్లామర్ పాత్రలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో దాదాపు 100కు పైగా సినిమాలలో నటించారు. రజనీకాంత్, చిరంజీవి, కమల్ హాసన్, విజయ్‌కాంత్, మోహన్‌లాల్, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి టాప్ స్టార్స్‌తో నటించారు.

Actress Meena s Real Estate Jackpot 10 Crore Investment Turns Into 100 Crore Deal

కెరీర్ పీక్స్‌లో ఉండగానే 2009లో బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యాసాగర్‌ను పెళ్లాడారు మీనా. ఈ దంపతులకు నైనిక అనే కుమార్తె ఉంది. కోలీవుడ్ సూపర్‌స్టార్ దళపతి విజయ్ హీరోగా నటించిన తేరీలో ఈ చిన్నారి బాలనటిగా నటించింది. జీవితం సాఫీగా సాగిపోతున్న దశలో దురదృష్టవశాత్తూ 2022లో అనారోగ్యంతో మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం చెందడంతో ఆమెను బాగా కృంగదీసింది.

విద్యాసాగర్ మరణంతో కొన్నాళ్లు ఇంటికే పరిమితమయ్యారు మీనా. కుటుంబ సభ్యులు, సన్నిహితుల ప్రోత్సాహంతో తిరిగి కోలుకున్న మీనా తన రోజువారీ వ్యవహారాలలో బిజీ అవుతున్నారు. ప్రస్తుతం మలయాళంలో దృశ్యం 3, తమిళంలో రౌడీ బేబీ సినిమాలో మీనా నటిస్తున్నారు. పలు రియాలిటీ షోలకు జడ్జిగా, హోస్ట్‌గా, సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ తన టాలెంట్‌ను నిరూపించుకున్నారు. ఇది కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి.

ఇకపోతే.. హీరోయిన్ల లైఫ్ స్పాన్ హీరోలతో పోలిస్తే చాలా తక్కువన్న సంగతి తెలిసిందే. మంచి విజయాలు సాధిస్తే ఓ ఐదేళ్ల పాటు హవా సాగించొచ్చు. లేదంటే ఎవరికీ కనిపించకుండా కాలగర్భంలో కలిసిపోవడమే. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సూత్రాన్ని నటీమణులు బాగా ఫాలో అవుతారు. దీనికి తోడు ముందు జనరేషన్లు, సీనియర్ల జీవితాలను దగ్గరగా చూసిన హీరోయిన్లు.. తమ సంపాదనను తెలివిగా రియల్ ఎస్టేట్, పెట్టుబడులు, వ్యాపారాల వైపు మళ్లిస్తున్నారు.

నటి మీనా కూడా బాగానే కూడబెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. తన కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో పలు చోట్ల పెట్టుబడులు పెట్టింది. ఈ క్రమంలోనే మీనాకు ఊహించని జాక్‌పాట్ తగిలినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె చెన్నైలో దాదాపు 20 ఏళ్ల క్రితం కొన్న ఓ ఇంటిని ఏకంగా 100 కోట్ల రూపాయలకు ఆమె విక్రయించి భారీ లాభాలను కళ్లజూశారట. ఆ సమయంలో 10 కోట్ల రూపాయల లోన్‌ను బ్యాంక్‌ల నుంచి తీసుకున్న మీనా.. ఓ భారీ భవనాన్ని తన అభిరుచికి తగినట్లుగా కట్టించుకున్నారు. ఫర్నిచర్, ఇంటీరియర్, గార్డెన్, విశాలమైన ప్రాంగణంతో సహా ఈ ఇంటిని ఓ ప్యాలెస్‌లా కట్టించారట. అప్పట్లో మీనా నిర్ణయాన్ని చూసి డబ్బులు తగలేస్తోందని అనుకున్నారట. కానీ ఆమె మాత్రం అవేవీ పట్టించుకోకుండా ముందుకు సాగారు.

తీరా ఇప్పుడు కట్ చేస్తే.. అమెరికాకు చెందిన ఓ దంపతులు మీనా ఇంటిని చూసి ముచ్చటపడ్డారట. వెంటనే ఎంతైనా కొనేందుకు ముందుకు రాగా.. మీనా దానిని 100 కోట్ల రూపాయలతో డీల్ సెట్ చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కేవలం 10 కోట్ల రూపాయలతో కట్టించిన ఆ ఇంటికి 20 ఏళ్లలోనే 90 కోట్ల రూపాయల లాభం రావడంతో మీనా స్ట్రాటజీ, బిజినెస్‌ మైండ్‌ని మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Read more about: meena meena sagar heroine meena
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X