Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్‌లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Meena Sagar: భర్త మరణం తరువాత తొలిసారిగా ఇలా కనిపించిన మీనా.. ఫొటో వైరల్!
సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న మీనా సాగర్ ఇటీవల ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆమె భర్త హఠాత్తుగా మరణించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక ఆ దుఃఖం నుంచి కోలుకోవడానికి మీనా సాగర్ కు చాలా సమయం పట్టింది. ఇక చాలా కాలం తర్వాత ఆమె సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మంచి నటిగా..
తమిళ చిత్ర పరిశ్రమలో మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలు పెట్టిన మీనా ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా చాలా బిజీగా మారిపోయింది. ఇక పదహారేళ్ల వయసులోనే ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. ఇంకా తెలుగు తమిళ్ అని తేడా లేకుండా అన్ని రకాల పాత్రలతో మెప్పించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా గడసరి అమ్మాయి పాత్రలలో ఆమె నటించే విధానం అప్పట్లో హైలెట్ గా నిలిచేవి.
హఠాత్తుగా భర్త మరణం
దృశ్యం సినిమాతో ఆమె సౌత్ ఇండస్ట్రీలో మళ్ళీ చాలా బిజీగా మారిపోయింది. ఈ క్రమంలో ఫ్యామిలీతో హ్యాపీగా కొనసాగుతున్న సమయంలో హఠాత్తుగా ఒక సంఘటన చోటు చేసుకోవడం ఆమెకు తీరని లోటును మిగిల్చింది. మీనా భర్త విద్యాసాగర్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తుల సమస్యతో గత కొంత కాలంగా బాధపడుతున్న ఆయన జూన్ 28న హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తృతీయ శ్వాస విడిచారు.
ప్రేమ పెళ్లి
మీనా కు ఒక కూతురు కూడా ఉన్న విషయం తెలిసిందే. విద్యాసాగర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న మీనా ప్రతి పండగ సందర్భంలో ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసుకుంది. అతను పెద్దగా సంపన్నుడు కాకపోయినప్పటికీ కూడా మంచి మనసు చూసి మీనా పెళ్లి చేసుకుంది. ఇక హఠాత్తుగా అతను మరణించడంతో ఆమె ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు అండతో సన్నిహితుల సహకారంతో మళ్ళీ తన రెగ్యులర్ లైఫ్‌ను కొనసాగించేందుకు బిజీగా మారిపోయింది.
Recommended Video
చాలా రోజుల తరువాత
అయితే మీనా సాగర్ భర్త విద్యాసాగర్ మరణించిన తర్వాత సోషల్ మీడియాలో పెద్దగా స్పందించింది లేదు. కానీ చాలా రోజుల తర్వాత ఆమె కొన్ని ప్రత్యేకమైన ఫోటోలను షేర్ చేసుకుంది. ఇక అందులో ఆమెకు ఎంతో దగ్గరగా ఉండే స్నేహితుల ఫోటోలను కూడా షేర్ చేసుకుంది. మీనా సాగర్ కు సంగీత, రంభ, సంఘవి కూడా మంచి మిత్రులు. ఇక రీసెంట్గా వారు ప్రత్యేకంగా ఆమెను కలుసుకున్నారు.
ఎప్పటికి అలా నవ్వుతూనే..
గత రాత్రి వీరందరూ కూడా కలుసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో మీనా షేర్ చేసుకున్నారు. ఇక ఫోటోలో ఆమె చాలా అందంగా నవ్వుతూ కనిపించారు. దీంతో ఆమె ఫాలోవర్స్ కూడా మీనా గారు ఎప్పటికి ఇలా నవ్వుతూనే ఉండాలి అని కోరుకుంటున్నారు. మరోవైపు ఆమె తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా కొన్ని సినిమాల్లో ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నారు.