Meena Saagar: 46 ఏళ్ళ వయసులో గ్లామర్ తో కిక్కిచ్చేలా మీనా స్టిల్.. ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే

మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ వరల్డ్ లోకి అడుగుపెట్టిన మీనా మంచి క్రేజ్ అందుకుంది. చిన్నప్పుడే అన్ని భాషల్లో అలవాటు పడిన మీనా ఆ తరువాత రెండు పదుల వయసు దాతకముందే హీరోయిన్ గా మరో కొత్త కెరీర్ ను స్టార్ట్ చేసింది. చాలా కాలం వరకు స్టార్ హీరోయిన్ చక్రం తిప్పిన మీనా దాదాపు సౌత్ ఇండస్ట్రీలోని అందరి అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇప్పుడు అయితే ఆమె తన వయసుకు తగ్గట్టుగానే పాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. చెరగని చిరునవ్వుతో అందంగా కనిపించే మీనా కరోనా కష్ట కాలంలో తన భర్తను కోల్పోవడంతో విషాదంలోకి వెళ్లిపోయింది. ఇక ఆమె ఆ విషాదంలో నుంచి బయటకు వస్తున్న ఆమె భవిష్యత్తుపై మరింత ఫోకస్ చేసింది. ఇక ఆమె లేటెస్ట్ లుక్ చూస్తే నేటితరం హీరోయిన్స్ కు ఏమాత్రం తక్కువ కాకుండా ఉంది. ఆ వివరాలలోకి వెళితే..

మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు: ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చైల్డ్ యాక్టర్ గా కెరియర్ ప్రారంభించిన మీనా తరువాత టర్న్ తీసుకొని సీతారామయ్య గారి మనవరాలు మూవీతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా మారింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీ అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే రాలేదు.

Meena Saagar

స్టార్ హీరోయిన్ రేంజ్: తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళీ భాషలలో ఆమె గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఇక స్టార్ హీరోయిన్ చైర్ లో మీనా ఏకంగా దశాబ్దం పాటు కొనసాగడం విశేషం. తరువాత సీనియర్ హీరోయిన్ కేటగిరీలోకి వచ్చేసిన ఈమె పెళ్లి చేసుకొని విద్యా సాగర్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకుంది.

Meena Saagar

మళ్ళీ నటిగా బిజీ అవుతూ..:పెళ్లి తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరుస సినిమాలు చేసుకుంటూ మీనా వస్తున్నారు. గత ఏడాది మీనా భర్త అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. ఇదిలా ఉంటే మరల ఇప్పుడు నటిగా బిజీ అయ్యే ప్రయత్నంలో ఈమె ఉన్నారు. రీసెంట్ గా తెలుగులో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ కి జోడీగా ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు సినిమాలో నటించింది.

Meena Saagar

స్టైలిష్ అవతార్ లో మీనా: ఇక సెకండ్ ఇన్నింగ్ లో దృశ్యం సిరీస్ మీనాకి మంచి ఫేమ్ తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే ఈ మధ్య టీవీ షోలలో హోస్ట్ గా కూడా మీనా కనిపిస్తూ ఉండటం విశేషం. ఈమె కూతురు నైనిక కూడా పోలీసోడు సినిమాతో చైల్డ్ యాక్టర్ గా పరిచయం అయ్యింది. ప్రస్తుతం టీనేజ్ లో ఉంది. ఇదిలా ఉంటే మీనా ఈ మధ్య కాస్తా మోడరన్ గా కనిపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. పెళ్లి తర్వాత ఎక్కువగా చీరకట్టులోనే కనిపించిన మీనా తాజాగా జీన్ ఫ్యాంట్, వైట్ కలర్ స్కర్ట్ ధరించి స్టైలిష్ లుక్ లో మెరిసిపోయారు. ఆమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అంతే కాకుండా ఆమె ఇచ్చిన స్మైల్ చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X