ఆ బాధ అనుభవించాల్సిందే... 45 ఏళ్లు దాటాక జీవితం అలా... నటి మీనా ఎమోషనల్

బాలనటిగా ఎంట్రీ ఇచ్చి 90వ దశకంలో దక్షిణాది చిత్ర పరిశ్రమలో తిరుగులేని నటిగా వెలుగొందారు మీనా. దాదాపు మూడు దశాబ్ధాలకు పైగా సినీ కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వందకు పైగా చిత్రాల్లో నటించారు. అందం, ముఖంపై చిరునవ్వుతో అప్పట్లో కుర్రాళ్ల కలల రాకుమారిగా నిలిచారు. ఈ వయసులోనూ అదే స్టార్‌డమ్‌తో సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ క్రేజీ ప్రాజెక్ట్స్‌తో ఆకట్టుకుంటున్నారు మీనా. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మీనా.. తాజాగా పెట్టి పోస్ట్ వైరల్ అవుతోంది.

బాలనటి నుంచి స్టార్ హీరోయిన్‌గా
తమిళనాడుకు చెందిన మీనా.. తొలుత బాలనటిగా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. 1982లో ఆరేళ్ల వయసులో నడిగర్ తిలకం శివాజీ గణేషన్ హీరోగా వచ్చిన నెంజాంగల్‌ ఆమె తొలి చిత్రం. అలా దాదాపు 45 చిత్రాలలో బాలనటిగా నటించిన మీనా.. 1990లో రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన నవయుగం సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టారు. సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా అందరికీ హిట్ పెయిర్ అనిపించుకున్నారు. చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్, మమ్ముట్టి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి అగ్రనటులతో కలిసి నటించారు. అందం, డ్యాన్స్, నటనతో నటి క్రేజీ హీరోయిన్లు రమ్యకృష్ణ, సౌందర్య, రోజా, రంభ తదితరులకు పోటీ ఇచ్చారు.

Actress Meena Sagar Shares Powerful Life Lessons and future Planning for Youth

భర్త మరణంతో ఒంటరి
2009లో బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యాసాగర్‌ను పెళ్లాడారు మీనా. ఈ దంపతులకు నైనిక అనే కుమార్తె ఉంది. కోలీవుడ్ సూపర్‌స్టార్ దళపతి విజయ్ హీరోగా నటించిన తేరీలో ఈ చిన్నారి బాలనటిగా నటించింది. జీవితం సాఫీగా సాగిపోతున్న దశలో దురదృష్టవశాత్తూ 2022లో అనారోగ్యంతో మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం చెందడంతో ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. విద్యాసాగర్ మరణంతో కొన్నాళ్లు ఇంటికే పరిమితమయ్యారు మీనా.

మీనా రెండో పెళ్లిపై గాసిప్స్
అయితే మీనా రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా పలుమార్లు గాసిప్స్ వచ్చాయి. వీటికి ఆమె చెక్ పెడుతున్నప్పటికీ, ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉన్నాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులు అండగా నిలవడంతో మీనా తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం మలయాళంలో దృశ్యం 3, తమిళంలో రౌడీ బేబీ సినిమాలో మీనా నటిస్తున్నారు. పలు రియాలిటీ షోలకు జడ్జిగా, హోస్ట్‌గా, సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ తన టాలెంట్‌ను నిరూపించుకున్నారు. ఇక మీనా రాజకీయాల్లోకి రాబోతున్నారని, ఓ పార్టీ తరపున ప్రచారం చేయబోతున్నట్లుగా పుకార్లు వైరల్ అయ్యాయి. చివరికి ఇవి గాలివార్తలుగా నిలిచాయి.

50 ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని అందం
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మీనా.. ఎప్పటికప్పుడు తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. 50 ఏళ్ల వయసులోనూ చెక్కు చెదరని గ్లామర్‌తో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు మీనా. సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను తెలియజేస్తుంటారు. తాజాగా ఆమె జీవితం, ప్లానింగ్‌పై యువతకు తనదైన శైలిలో సందేశం ఇచ్చారు. ఈ మేరకు మీనా తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ పెట్టారు.

మీనా జీవిత సూత్రాలు
తొలుత అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన మీనా.. మీరు 45 ఏళ్ల వయసులో లీడర్ కావాలనుకుంటే 20 ఏళ్ల వయసులోనే అది మొదలుపెట్టాలి. 45 ఏళ్ల వయసులో ఆరోగ్యంగా ఉండాలంటే అది 25 ఏళ్లకే మొదలవ్వాలి... 45 ఏళ్ల వయసులో పశ్చాత్తాపం 20 ఏళ్ల వయసులోనే మొదలవుతుంది. 45 ఏళ్ల వయసులో దివాలా తీయడం.. 25 ఏళ్ల వయసులోనే మొదలవుతుంది. నీ భవిష్యత్తు తర్వాత రూపుదిద్దుకోదు.. ఇవాళ నువ్వు తీసుకునే నిర్ణయాలు, ఎంపికలే నీ భవిష్యత్తుని నిర్మిస్తాయి అని మీనా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

Read more about: meena sagar movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X