రెండో పెళ్లిపై మీనా స్పందన.. ఒంటరిదాన్నిననే కదా ఇలా అంటూ..

దక్షిణాది సినీ పరిశ్రమలో అభినయ సుందరిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి మీనా( Meena). బాలనటిగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత అగ్ర హీరోయిన్‌గా ఎదిగిన మీనా.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వందకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా రజనీ కాంత్, కమల్ హాసన్, చిరంజీవి, వెంకటేష్, మోహన్ లాల్, మమ్ముట్టి వంటి లెజెండరీ హీరోల సరసన నటించి బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నారు. అయితే.. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో మీనా రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారు అంటూ రూమర్లు వస్తున్నాయి. ఈ ప్రచారంపై ఆమె భావోద్వేగానికి లోనై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మీనా కెరీర్ పరంగా ఎన్నో విజయాలు అందుకుంది. అయితే వ్యక్తిగతంగా మాత్రం ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో మృతి చెందిన తర్వాత ఆమె తీవ్ర మనోవేదనలోకి వెళ్లారు. ప్రస్తుతం తన కుమార్తె బాధ్యతలను ఒంటరిగా భుజాన వేసుకుని జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి సమయంలో గత కొంత కాలంగా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న అసత్య ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రెండో పెళ్లి అంటూ వస్తున్న పుకార్లు ఆమెను మరింత కలచివేశాయి. ఈ అంశంపై మీనా తీవ్రంగా స్పందించారు.

Actress Meena Slams Second Marriage Rumours

ఈ విషయంపై స్పందించిన మీనా 'నాకు రెండో పెళ్లి అని తప్పుడు కథనాలు రాస్తున్నారు. అందులో నిజం ఉంటే మాట్లాడుకోవచ్చు. కానీ, మీకు మీరే ఊహించుకుని రాయడం పూర్తిగా తప్పు. నేనొక ఒంటరి మహిళను, సెలబ్రిటీని అనే కదా మీకు నచ్చినట్లు రూమర్లు సృష్టిస్తున్నారు. నా సహనాన్ని పరీక్షించకండి. నాకు ఒక కూతురు ఉంది... తను ఇవన్నీ చూస్తే ఏమనుకుంటుంది?' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంకా మాట్లాడుతూ 'ఇది నాకు చాలా అసౌకర్యంగా ఉంది. చాలా చిరాకు తెప్పిస్తోంది. కర్మ అనేది ఒకటి ఉంటుంది. అది ఎవరినీ వదిలిపెట్టదు. ఈ నెగెటివిటీపై స్పందించి నా సమయం, ఆరోగ్యాన్ని నాశనం చేసుకోదలుచుకోలేదు. నేను పాజిటివ్ వ్యక్తిని. మంచి విషయాలపైనే ఫోకస్ పెడతాను' అని స్పష్టం చేశారు. గత రెండేళ్లుగా ఏదో ఒక హీరో పేరుతో ఆమెకు లింకులు పెట్టడం, పెళ్లి ముహూర్తం ఖరారైందంటూ కథనాలు రాయడం సాధారణమైపోయిందని అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా 'ఒంటరి మహిళ' అన్న కారణంతో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను అంగడిలో పెట్టడం సరికాదని నెటిజన్లు మీనాకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం మీనా సెకండ్ ఇన్నింగ్స్‌లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. లేటెస్ట్‌గా 'రోస్లిన్' వెబ్ సిరీస్‌తో పాటు మలయాళంలో 'దృశ్యం 3' వంటి ప్రాజెక్ట్స్‌లో కనిపించబోతున్నారు. నటిగానే కాకుండా డాన్సర్‌గా, సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, టీవీ జడ్జిగా కూడా తనదైన ముద్ర వేశారు. మీనా రెండో పెళ్లి రూమర్లపై ఇలా బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం మీనా కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కామెంట్స్ తోనైనా ఈ రూమార్స్ కు చెక్ పడుతాయో లేదో వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: actress meena tollywood rumours
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X