twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షూటింగ్ కోసం బయల్దేరింది.. ఆ కష్టాలను స్వయంగా అనుభవించిన మీనా!

    |

    ప్రస్తుతం అన్ని భాషల చిత్ర పరిశ్రమల్లో షూటింగ్‌లు ప్రారంభించేశారు. అన్ని భాషల్లోని స్టార్ హీరోలు చిన్నా పెద్దా అని తేడా లేకుండా.. అందరూ షూటింగ్‌లు ప్రారంభించేశారు. అయితే మన టాలీవుడ్‌లో మాత్రం పెద్ద హీరోలెవ్వరూ ఇంకా గడపదాటడం లేదు. చిన్న, మీడియం రేంజ్ బడ్జెట్ చిత్రాలు షూటింగ్‌లు ప్రారంభించేశారు. అయితే తాజాగా మీనా కూడా షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతోంది.

    ఈ మేరకు మీనా చెన్నై నుంచి కేరళకు బయల్దేరింది. ఈ క్రమంలోనే మీనా పీపీఈ కిట్ ధరించింది. ఇక దాన్ని ధరించడం వల్ల అనుభవించిన బాధలను వివరించింది. 'ఏదో స్పేస్‌కు వెళ్తోన్నట్టు కనిపిస్తున్నాను. కానీ నేను ఓ యుద్దాన్ని చేయడానికి వెళ్తున్నట్టు అనిపిస్తోంది. దాదాపు ఏడు నెలల తరువాత బయటకు వచ్చాను.. ఈ ఏయిర్ పోర్ట్‌ను ఇలా కామ్‌గా చూడటం ఆశ్చర్యంగా ఉంది. నాలా చాలా మంది డ్రెస్ ధరించలేదు... అది నాకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది.

    Actress Meena wear PPE Kit

    పీపీఈ కిట్ ధరించడం కంఫర్ట్‌గానే ఉండదు. ఎంతో వేడిగా ఉంటుంది.. ఏసీ ఉన్నా గానీ లోపల మాత్రం చెమట పడుతుంది. ఈ గ్లౌవ్స్ ఉండటంతో కనీసం మన మొహాన్ని మన చేతులతో తుడుచుకోలేం. రోజంతా ఈ పీపీఈ కిట్లను ధరించి మనకు సేవ చేసే వైద్య బృందానికి హ్యాట్సాప్. వీటిని ధరించడం ఎంత అసౌకర్యంగా ఉన్నా కూడా వారు మనం కోసం, మన ఆరోగ్యాల కోసం ఆలోచిస్తుంటారు. మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు.. వారికి చేతులెత్తి మొక్కాల్సిందే. మీ నిస్వార్థ సేవకు ధన్యవాదాలు' అని మీనా పేర్కొంది. ఈ మధ్యే దృశ్యం 2 ప్రారంభమైంది. మోహన్ లాల్‌తో ఆల్రెడీ షూటింగ్ ప్రారంభించేశారు. అందుకే మీనా అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్‌లో పాల్గొనేందుకు ఫ్లైట్‌లో కేరళకు వెళ్లింది.

    English summary
    Actress Meena wear PPE Kit, Though I look like traveling to space, I feel like going to war. Traveling after 7 months.... Surprised to see the airport so calm and quiet deserted. Even more surprised to see
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X