చాలా భయపెట్టారు.. ఇకపై అలాంటి పాత్రల్లో నటించను.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఆఫర్లు లేక.. నటించి అవకాశం దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఎలాంటి చిన్న అవకాశం ఇచ్చిన చేజార్చుకోకుండా.. ఆ పాత్ర తమకు నచ్చిన నచ్చకున్నా నటించడానికి సిద్ధమవుతున్నారు. కానీ, ఓ హీరోయిన్ మాత్రం తాను కొన్ని పాత్రలలో నటించడానికి సిద్ధంగా లేనని, అలాంటి పాతలు నటించడానికి ఇంకా సమయం ఉందని పేర్కొంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆమె ఎలాంటి పాత్రల్లో నటించడానికి ఇష్టపడటం లేదు? వివరాల్లోకెళ్తే...
ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు..నటి మీనాక్షిచౌదరిMeenakshi Chaudhary). ఈ అమ్మడు తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ వరుస విజయాలను అందుకుంటుంది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి మీనాక్షిచౌదరి. ఇటీవల ఆమెకు వరుసగా అవకాశాలు తలుపు తడుతున్నాయి. అంతేకాదు ఆమె నటించిన సినిమాలు సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ జోష్ లో ఉంది ఈ అమ్మడు.

మీనాక్షిచౌదరి తొలుత కొల్లై అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకోపోయినా. తన నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆర్జే బాలాజీ సరసన సెలూన్ అనే మూవీలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఈ మూవీకి సూపర్ హిట్ టాక్ తో పాటు ఆ అమ్మాయి నటన కూడా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ 'గోట్' సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసింది ఈ అమ్మడు. ఇక ఈ మూవీ తో ఈ అమ్మడు దశ తిరిగింది.
సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఈ అమ్మడు పేరు మార్మోగిపోయింది. దీంతో వరుస అవకాశాలను అందుకుంటూ వస్తుంది. ఇటీవల లక్కీ భాస్కర్ అనే మూవీ లో దుల్కర్ సల్మాన్ సరసన నటించి బ్లాక్ బస్టర్ ఇట్ అందుకుంది. తాజాగా విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'మెకానిక్ రాఖీ' అనే సినిమాలో నటించింది. ఇక సంక్రాంతికి విక్టరీ వెంకటేష్- అనిల్ రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమాలో లీడ్ రోల్లో కనిపించబోతుందట. ఇలా వరుస సినిమాలతో బిజీ బిజీగా మారింది ఈ స్టార్ బ్యూటీ.
మీనాక్షి చౌదరి.. తాను ప్యూచర్ లో కొన్ని పాత్రల్లో నటించకూడదని నిర్ణయించుకున్నాననీ ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మీనాక్షి చౌదరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దుల్కర్ సల్మాన్ సరసన నటించిన 'లక్కీ భాస్కర్' మూవీ తనకు మంచి గుర్తింపు తెచ్చిందనీ, ఆ మూవీలో నటించడం తనకు సంతోషాన్ని కలిగించిందని చెప్పింది. అయితే ఈ సినిమాలో భార్యగా.. తల్లిగా.. నటించడం తన స్నేహితులకు నచ్చలేదనీ, ఇకపై తాను భార్య, అమ్మ పాత్రల్లో నటించకూడదని నిర్ణయించుకున్నారని తెలిపింది. వాస్తవానికి లక్కీ భాస్కర్ సినిమాలో తన నటనకు ప్రశంసలు లభించాయని, కానీ కొంతమంది స్నేహితులు తనను భయపెట్టారని తెలిపింది.

కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి పాత్రల్లో నటించడం సరికాదని, అలాంటి పాత్రల్లో నటించడానికి చాలా సమయం ఉందని సలహా ఇచ్చారని తెలిపింది. దీంతో తాను కూడా ఇకపై అమ్మ, అక్క పాత్రలలో నటించకూడదని నిర్ణయించుకున్నాననీ అన్నారు. ఇకపై యాక్షన్ తో కూడిన కమర్షియల్ పాత్రలోనే నటించాలని కోరుకుంటున్నానని మీనాక్షి చౌదరి పేర్కొంది.
లక్కీ భాస్కర్ సినిమాలో మీనాక్షి చౌదరి నటనకు ప్రశంసలు దక్కాయి. ఆమె భార్యగా మాత్రమే కాకుండా.. ఒక తల్లిగా కూడా నటించి మెప్పించింది. ఈ సినిమా మీనాక్షి కెరీర్లో బెస్ట్ మూవీ గా నిలుస్తుందడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీ ఏకంగా 120 కోట్ల కలెక్షన్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











